టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గుడుపుతున్నాడు. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 2019 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్‌లో ఐపీఎల్ సీజన్12 కప్‌ని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దాడాడు. ఇటు ఐపీఎల్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ త్వరలో జరగబోయే వరల్డ్‌కప్‌కు ముందు భార్య రితికా, కూతురు సమారియాలతోపాటూ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటిస్తున్నాడు. ఫ్యామిలీ టూర్‌కు సంబంధించి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. నాలుగుసార్లు ముంబైకి టైటిల్ అందించిన రోహిత్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడిగా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న రోహిత్ 2013లో తన జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్ 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు.
సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న #10YearChallenge (టెన్ ఇయర్ ఛాలెంజ్)లో భాగంగా రోహిత్‌కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 2009 ఐపీఎల్‌లో అప్పటి దక్కెన్ చార్జెస్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ అందుకున్నాడు. 2009, 2019 ఫొటోలను జత చేసి షేర్ చేయడంతో ఆ ఫొటో ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment