
కోల్‌కతా: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనుచిత చర్యకు పాల్పడ్డాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔటై పెవిలియన్‌కు వెళ్తూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్లను రోహిత్ బ్యాట్‌తో కొట్టాడు. 233 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అతడు మంచి టచ్‌లో ఉన్న సమయంలో గర్నీ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.
అంపైర్ ఔటివ్వగా... రోహిత్ డీఆర్‌ఎస్ కోరాడు. కానీ, నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. దీంతో అసహనానికి గురైన అతడు అంపైర్ ఎదుటే బ్యాట్‌ను వికెట్లకు తాకించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.2లోని లెవల్ 1ను ఉల్లంఘించినందుకు దీనిపై అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment