
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ ఆరవసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్‌లో ఢిల్లీపై ఘన విజయం సాధించిన ముంబై మరో టైటిల్‌పై కన్నేసింది. కాగా నేడు ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండడంతో ముంబై ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా రోహిత్ కూతురు సమైరా, ధవల్ కులకర్ణి కూతురు నితారా, తారే కూతురు రబ్బానీల బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌లు చెలరేగిపోతున్నారు. బుమ్రా 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్ట్ 22 వికెట్లతో ఉన్నాడు. అన్నింట్లోనూ సమానంగా కనిపిస్తున్న ముంబై మంగళవారం జరగబోయే ఫైనల్లో గెలిచి ఐదోసారి కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment