టీమిండియా(ఫైల్‌ఫొటో)
కోల్‌కతా: వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం కోల్‌కతాలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సమావేశం నిర్వహించింది. దీనిలో భాగంగా మెగా టోర్నీకి సంబంధించి ప్రాథమిక షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేయగా, పూర్తి షెడ్యూల్‌ను ఏప్రిల్ 30వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం టీమిండియా తన తొలిపోరులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2019, జూన్ 4వ తేదీన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ జట్ల మధ్య జూన్2 వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉండగా, అందులో కొద్దిపాటి మార్పు చేశారు.
ఐసీసీ సమావేశంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కొన్ని మార్పుల్ని సూచించింది. ఐపీఎల్ 2019 సీజన్ ముగిసిన రెండు వారాల్లోపే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడటం కష్టమని.. కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలంటూ గతంలో లోధా కమిటీ సూచించిన సూచనని ఇక్కడ బీసీసీఐ ప్రస్తావించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐసీసీ.. భారత్ మొదటి మ్యాచ్‌ను రెండు రోజులు వెనక్కి నెట్టింది.
ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది. బీసీసీఐ సూచించిన మార్పుల నేపథ్యంలో జూన్ 4కి భారత్-దక్షిణాఫ్రికాల మ్యాచ్‌ని మార్చనున్నారు. ఎందుకంటే.. 2019 ఐపీఎల్ సీజన్ మార్చి 29న మొదలై.. మే 19న ముగియనుంది. దీంతో.. 15 రోజుల గ్యాప్ తర్వాత ప్రపంచకప్‌లో టీమిండియా ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment