Bangladesh Reached the Top of the Points Table of the ICC Men’s Cricket World Cup Super League - Sakshi
Sakshi News home page

World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ టాప్‌లో బంగ్లాదేశ్‌! టీమిండియా ఎక్కడ?

Published Thu, Mar 24 2022 10:48 AM | Last Updated on Thu, Mar 24 2022 2:04 PM

World Cup Super League Points Updated Table: Bangladesh History In South Africa - Sakshi

ICC Cricket World Cup Super League points table (Updated): ప్రొటిస్‌ గడ్డపై బంగ్లాదేశ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణాయక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రొటిస్‌ జట్టును వారి సొంతగడ్డపై ఓడించి తొలిసారి 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌ బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్‌ (5/35) దెబ్బకు ముందుగా దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.

ఆ తర్వాత బంగ్లా 26.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (87 నాటౌట్‌; 14 ఫోర్లు) మెరిశాడు. తస్కిన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్, సిరీస్‌’ అవార్డులు దక్కాయి.  ఇక ఈ అద్భుత విజయంతో ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో బంగ్లాదేశ్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా జట్టు... 12 విజయాలు సాధించి, ఆరింట ఓడి 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 


PC: ICC

మరోవైపు ఆడిన 15 మ్యాచ్‌లలో తొమ్మిదింట గెలిచి, 5 పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్‌ 95 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక టీమిండియా ఆడిన 12 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి, నాలుగింట ఓడింది. తద్వారా 79 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అఫ్గనిస్తాన్‌, ఐర్లాండ్‌ వరుసగా 70, 68 పాయింట్లతో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి.

ఇదిలా బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర పరాభవం పాలైన దక్షిణాఫ్రికా టాప్‌-8లో చోటు దక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ప్రొటిస్‌ 49 పాయింట్లతో తొమ్మిదో స్థానానికే పరిమితమైంది. దీంతో వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి అర్హత సాధించడంలో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాగా ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్‌ కప్‌నకు ముందుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తున్నందుకు వల్ల టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది. భారత్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక,  నెదర్లాండ్స్‌ జట్టు కూడా ఈ లీగ్‌లో భాగమై ఉంటుంది.

చదవండి: PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్‌.. పేరును సార్థకం చేసుకున్న పాక్‌ జట్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement