ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో నెక్ టు నెక్ ఫైట్లు జరుగుతున్నాయి. బౌలర్లు చెలరేగుతుండటంతో స్వల్ప స్కోర్లు సైతం మ్యాచ్‌లు గెలిపిస్తున్నాయి. ప్రపంచకప్‌కు సహ వేదిక అయిన యూఎస్‌ఏలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కొత్తగా నిర్మించిన న్యూయార్క్ మైదానం క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది.
ఈ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ల్లో కనీవినీ ఎరుగని రీతిలో అత్యల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. పెద్ద జట్లు సైతం కనీసం 100 పరుగులు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ వేదికపై ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా 150 పరుగుల మార్కు దాటలేదు. ఐర్లాండ్‌పై కెనడా సాధించిన 137 పరుగులే ఈ వేదికపై అత్యధిక స్కోర్‌గా ఉంది. ఈ మైదానంలో బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండే రెండు హాఫ్ సెంచరీలు (రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్) నమోదయ్యాయి.
న్యూయార్క్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు..
శ్రీలంక (77) వర్సెస్ సౌతాఫ్రికా (80/4)
ఐర్లాండ్ (96) వర్సెస్ భారత్ (97/2)
కెనడా (137/7) వర్సెస్ ఐర్లాండ్ (125/7)
నెదర్లాండ్స్ (103/9) వర్సెస్ సౌతాఫ్రికా (106/6)
ఇండియా (119) వర్సెస్ పాకిస్తాన్ (113/7)
సౌతాఫ్రికా (113/6) వర్సెస్ బంగ్లాదేశ్ (109/7)
ఒక్క రోజులోనే టీమిండియా రికార్డు బద్దలు..
న్యూయార్క్‌లో నిన్న (జూన్ 10) జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరోసారి అత్యల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 114 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని చరిత్ర సృష్టించింది. ఛేదనలో సౌతాఫ్రికా బౌలర్లు బంగ్లాదేశ్‌ను 109 పరుగులకే కట్టడి చేసి 4 పరుగుల తేడాతో విజయం సాధించారు.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టైనా ఢిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ (114) ఇదే. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. ఇదే టోర్నీలో భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని (పాక్‌పై) విజయవంతంగా కాపాడుకుంది. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా కాపాడుకున్న 114 పరుగుల లక్ష్యం పొట్టి క్రికెట్ మొత్తంలో ఆ జట్టు ఢిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికాకు ఇది వరుసగా తొమ్మిదో విజయం.
Comments
Please login to add a commentAdd a comment