ICC Cricket World Cup Super League Points Table: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అగ్రస్థానానికి ఎగబాకింది. శుక్రవారం (మార్చి 3) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలుండగానే 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఇంగ్లండ్.. 20 పాయింట్లు ఖాతాలో వేసుకుని మొత్తంగా 155 పాయింట్లు (23 మ్యాచ్‌లు) సాధించింది.
ఇంగ్లండ్ భారీగా పాయింట్లు సాధించడంతో అగ్రస్థానంలో ఉండిన న్యూజిలాండ్.. 150 పాయింట్లకు (21 మ్యాచ్‌ల్లో) పరిమితమై రెండో స్థానానికి దిగజారింది. 21 మ్యాచ్‌ల్లో 139 పాయింట్లు కలిగిన టీమిండియా మూడో స్థానంలో, 21 మ్యాచ్‌ల్లో 130 పాయింట్లు సాధించిన పాకిస్తాన్ నాలుగులో, 18 మ్యాచ్‌ల్లో 120 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఐదో స్థానంలో, ఆతర్వాత బంగ్లాదేశ్ (20 మ్యాచ్‌ల్లో 120), ఆఫ్ఘనిస్తాన్ (15 మ్యాచ్‌ల్లో 115), వెస్టిండీస్ (24 మ్యాచ్‌ల్లో 88), సౌతాఫ్రికా (19 మ్యాచ్‌ల్లో 78), శ్రీలంక (21 మ్యాచ్‌ల్లో 77), ఐర్లాండ్ (21 మ్యాచ్‌ల్లో 68), జింబాబ్వే (21 మ్యాచ్‌ల్లో 45), నెదర్లాండ్స్ (19 మ్యాచ్‌ల్లో 25) వరుస స్థానాల్లో నిలిచాయి.
కాగా, ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే బెర్తులు ఖరారవుతాయి. 2023 వన్డే ప్రపంచకప్‌కు ఆతిధ్యమిస్తున్న కోటాలో భారత్ నేరుగా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాగా.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment