
ఫైనల్లో ఇంగ్లండ్
♦ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై చివరి ఓవర్‌లో విజయం
♦ మహిళల ప్రపంచకప్
బ్రిస్టల్: మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఫైనల్లో అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసింది. వొల్వార్ట్ (100 బంతుల్లో 66; 8 ఫోర్లు), ఎం డు ప్రీజ్ (95 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తరఫున సారా టేలర్ (76 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. హీథర్ నైట్ (56 బంతుల్లో 30; 2 ఫోర్లు), ఫ్రాన్ విల్సన్ (38 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా చివర్లో జెన్నీ గన్ (27 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడి విజయానికి సహకరించింది. దీంతో ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సారా టేలర్‌కు లభించింది.