వచ్చే ఏడాది జరిగే ఆసియా టి20 చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం తమ సభ్య దేశాల నుంచి ఆసియన్ క్రికెట్ మండలి (ఏసీసీ)
కరాచీ : వచ్చే ఏడాది జరిగే ఆసియా టి20 చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం తమ సభ్య దేశాల నుంచి ఆసియన్ క్రికెట్ మండలి (ఏసీసీ) బిడ్స్‌ను ఆహ్వానించింది. సింగపూర్, మలేసియా, యూఏఈ, నేపాల్, ఖతార్ దేశాలను ఈ టోర్నీ జరిపేందుకు బిడ్స్‌ను దాఖలు చేయాల్సిందిగా సూచించినట్టు ఏసీసీ అధికారి ఒకరు తెలిపారు. అలాగే రెండేళ్లకోసారి జరిగే ఈ చాంపియన్‌షిప్‌ను టి20, వన్డే ఫార్మాట్‌లో జరపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇందులో అసోసియేట్ సభ్య దేశాలు పాల్గొంటాయి.
ఈ చాంపియన్‌షిప్‌లో జరిగే టి20 టోర్నీ.. ఐసీసీ వరల్డ్ టి20 జరిగే ఏడాదిలో, వన్డే ఫార్మాట్.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఏడాదిలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.