లండన్ : ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఎంఎస్ ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6), కేఎల్ రాహుల్ (108; 99 బంతుల్లో 12×4, 4×6) శతకాలతో అదరగొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత టాపర్డర్ విఫలమైంది. అనంతరం ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్‌లు క్రీజ్‌లో కుదురుకుని చివర్లో బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో షకీబ్, రుబెల్ తలో రెండు, సబ్బీర్, సైఫుద్దీన్, ముస్తఫిజూర్ తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment