
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలలో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌కు అన్ని రకాలుగా అద్భుత ఆదరణ లభించింది. మెల్‌బోర్న్ మైదానంలో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఈ టోర్నీ విజయగాథను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చింది. ‘బియాండ్ ద బౌండరీ’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో 17 రోజుల పాటు సాగిన ప్రపంచకప్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. (11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి)
ముఖ్యంగా అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ టోర్నీ సమయంలో చేసిన సన్నాహకాలు, నాకౌట్ దశలో చేరడంలో సాగిన వ్యూహ ప్రతివ్యూహాలు వంటి విశేషాలతో ఇది రూపొందింది. తొలిసారి ఒక ఐసీసీ టోర్నీకి అర్హత సాధించిన థాయిలాండ్ జట్టుపై కూడా ప్రత్యేక కథనం ఇందులో కనిపిస్తుంది. ‘100 శాతం క్రికెట్’ పేరుతో తాము మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని సిద్ధం చేసినట్లు ఐసీసీ సీఈఓ మను సాహ్‌నీ వెల్లడించారు. ఇంగ్లీష్‌తో పాటు మరో ఎనిమిది భాషల్లో సబ్‌టైటిల్స్‌తో శుక్రవారం ఈ డాక్యమెంటరీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రసారమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment