ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ (World cup 2023) ఫైనల్లో భారత జట్టు ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీమిండియా ఘోర ఓటమిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతుండగా, వింత వాదనతో ఈ జాబితాలో మార్కండేయ కట్జూ చేరారు. ఆయన చెప్పిన కారణం వింటే నెటిజన్లు షాకవుతున్నారు.
మహాభారత కాలంలో ఆస్ట్రేలియా ఆనాటి పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. వారు (ఆస్ట్రేలియా) ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం అంటూ జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ఒక రేంజ్‌లో స్పందించారు.
ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేని అతని విచిత్రమైన సిద్ధాంతంపై నెటిజన్లుమండిపడుతున్నారు. ధన్యవాదాలు సార్...మీరు కామెడీ చేసి చాలా రోజులైందంటూ ఒక యూజర్ విమర్శించారు. దుబాయ్‌ని మిస్టర్ దూబే, ఈజిప్ట్ (హిందీలోమిస్ర్) మిశ్రా రూపొందించారు, ఇజ్రాయెల్‌ను యాదవులు, బహ్రెయిన్‌ను బ్రహ్మ దేవుడు, సౌదీ అరేబియాను సరస్వతి దేవి సృష్టించారా? అంటూ మరొక వినియోగదారుడు జస్టిస్ కట్జూపై మరొక యూజర్ ధ్వజమెత్తారు.
Australia was the storage centre of the 'Astras' of Pandavas. It was called 'Astralaya'. This is the real reason why they won the World Cup.
— Markandey Katju (@mkatju) November 20, 2023
కాగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయినప్పటి మొదలు పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో స్లిప్-అప్‌ల వరకు, అన్ని మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చివరికి ట్రోఫీని అందుకునే అదృష్టాన్ని దక్కించుకోలేకపోవడంపై నిపుణులుమొదలు సామాన్యుడి దాకా అనేక విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన కట్జూ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి కారణాలను చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిస్ కట్జూ 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఏప్రిల్ 2006లో భారత సుప్రీంకోర్టు జడ్జికావడానికంటే ముందు వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. సెప్టెంబర్, 2011లో పదవీ విరమణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment