markandey katju
-
వాళ్లు అందుకే గెలిచారు: సుప్రీం మాజీ జడ్జి కట్జూ సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ (World cup 2023) ఫైనల్లో భారత జట్టు ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీమిండియా ఘోర ఓటమిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతుండగా, వింత వాదనతో ఈ జాబితాలో మార్కండేయ కట్జూ చేరారు. ఆయన చెప్పిన కారణం వింటే నెటిజన్లు షాకవుతున్నారు. మహాభారత కాలంలో ఆస్ట్రేలియా ఆనాటి పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. వారు (ఆస్ట్రేలియా) ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం అంటూ జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ఒక రేంజ్లో స్పందించారు. ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేని అతని విచిత్రమైన సిద్ధాంతంపై నెటిజన్లుమండిపడుతున్నారు. ధన్యవాదాలు సార్...మీరు కామెడీ చేసి చాలా రోజులైందంటూ ఒక యూజర్ విమర్శించారు. దుబాయ్‌ని మిస్టర్ దూబే, ఈజిప్ట్ (హిందీలోమిస్ర్) మిశ్రా రూపొందించారు, ఇజ్రాయెల్‌ను యాదవులు, బహ్రెయిన్‌ను బ్రహ్మ దేవుడు, సౌదీ అరేబియాను సరస్వతి దేవి సృష్టించారా? అంటూ మరొక వినియోగదారుడు జస్టిస్ కట్జూపై మరొక యూజర్ ధ్వజమెత్తారు. Australia was the storage centre of the 'Astras' of Pandavas. It was called 'Astralaya'. This is the real reason why they won the World Cup. — Markandey Katju (@mkatju) November 20, 2023 కాగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటి మొదలు పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో స్లిప్-అప్ల వరకు, అన్ని మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చివరికి ట్రోఫీని అందుకునే అదృష్టాన్ని దక్కించుకోలేకపోవడంపై నిపుణులుమొదలు సామాన్యుడి దాకా అనేక విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన కట్జూ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి కారణాలను చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిస్ కట్జూ 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఏప్రిల్ 2006లో భారత సుప్రీంకోర్టు జడ్జికావడానికంటే ముందు వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. సెప్టెంబర్, 2011లో పదవీ విరమణ చేశారు. -
‘పఠాన్’ సినిమా బ్లాక్ బస్టర్.. ఇంత మంది మూర్ఖులా!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఏముందని చూస్తున్నారు? ‘పఠాన్’ సినిమా విజయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ఇండియాలోని మూర్ఖుల సంఖ్య మీద నా అంచనా 90 శాతం నుంచి 95 శాతానికి పెరిగింద’ని ట్వీట్ చేశారు. నల్లమందు ధర పెరిగింది కాబట్టి.. చౌకైన ప్రత్యామ్నాయంగా ‘పఠాన్’ను కనుగొన్నారని సెటైర్ వేశారు. My estimate of fools in India has gone up from 90% to 95% after seeing the response to the film Pathan — Markandey Katju (@mkatju) January 26, 2023 అన్నీ ఉన్నాయి 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్ అంటూ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘పఠాన్’లో అన్నీ ఉన్నాయి. స్టార్ పవర్, స్టైల్, హంగు, ఆత్మ, విషయం, ఆశ్చర్యాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీకారేచ్ఛతో వచ్చిన షారుక్ ఖాన్. 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్!’అని ట్వీట్ చేశారు. అంతేకాదు ట్విటర్లో ‘పఠాన్’సినిమాకు నాలుగున్న స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చారు. #OneWordReview...#Pathaan: BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½#Pathaan has it all: Star power, style, scale, songs, soul, substance and surprises… And, most importantly, #SRK, who’s back with a vengeance… Will be the first #Blockbuster of 2023. #PathaanReview pic.twitter.com/Xci1SN72hz — taran adarsh (@taran_adarsh) January 25, 2023 కాగా, పఠాన్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా. (క్లిక్ చేయండి: షారుక్ పని అయిపోయిందంటూ ట్వీట్.. చివర్లో ట్విస్ట్!) -
సీఈవో కావడం గొప్ప కాదు.. ప్రధానమంత్రి కావాలి!
రిషి సునాక్ యూకే ప్రధాని కావడం పట్ల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! కావాల్సింది ప్రణాళిక నేను గతంలో 90 శాతం మంది భారతీయులు మూర్ఖులు అన్నాను. రిషి సునాక్ యూకే ప్రధాని కావడాన్ని పండుగ చేసుకోవడం చూస్తుంటే అది నిరూపితమవుతోంది. యూకే ప్రధాని మూలాలు బ్రిటిష్, ఇండియన్, చైనీస్ – ఏవైతే ఏంటి... మాంద్యంలో ఉన్న బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను ఒడ్డున పడేయడానికి ఆయన దగ్గర ఏం ప్రణాళిక ఉందన్నది ముఖ్యం? – మార్కండేయ ఖట్జూ, మాజీ న్యాయమూర్తి రేసు మారిపోయింది సారీ ఇండియన్ – అమెరికన్స్! సీఈవో కావడం ఇప్పుడు గొప్పేమీ కాదు. పూర్వ వలసవాద దేశానికి ప్రధానమంత్రి కాగలగాలి. ఇప్పుడిదే కొత్త ప్రమాణం. – కరణ్ తలాటి, ఆంట్రప్రెన్యూర్ ఏం చేయరా? అధికారంలో ఉన్న స్మృతీ ఇరానీ మహిళల కోసం ఏం చేసిందో, రిషి సునాక్ ఇండియన్స్ కోసం అంతే చేస్తాడు. – అదితీ మిత్తల్, కమెడియన్ మీ శిబిరం కాదనా? చరిత్రలో ఇటలీకి మొదటిసారి ఒక మహిళ (జార్జియా మెలోనీ) ప్రధాని అయ్యారు. ఆమె రోమ్ శివార్లలో పెరిగారు. శ్రామిక కుటుంబానికి చెందిన, తండ్రిలేని ఈమె యూనివర్సిటీకి వెళ్లి చదువుకోలేదు. వెయిట్రెస్‌గా రాత్రి షిఫ్టుల్లో పనిచేశారు. కానీ ఆమె ఊసే ఎక్కడా లేదు. ఆమె గనుక ప్రగతిశీలవాది అయివుంటే మీడియా ఆమె గురించి హోరెత్తించి ఉండేది. – అలెజాండ్రా బెక్కో, ఇటలీ జర్నలిస్ట్ -
‘గుడ్ గర్ల్స్ స్లీప్ ఎర్లీ’ అని రిప్లయ్ ఇచ్చి..
లక్నో: నైంటీ పర్సెంట్ భారతీయులు బుద్ధిహీనులు అని బహిరంగంగా కామెంట్ చేసిన భారతీయుడు మార్కండేయ ఖట్జూ. ఆశ్చర్యం లేదు. అన్నీ ఇలాగే మాట్లాడేవారు ఆయన. సుప్రీంకోర్టు మాజీ జడ్జి. జడ్జిగా ఉన్నప్పుడే చాలా వరకు తన అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి కాలానుగుణంగా రిటైర్ అయ్యారు. భారతీయులను మాత్రమే ఓ మాట అని శాటిస్ఫై అవలేదు అప్పట్లో ఆయన. భారతీయులలో 20 శాతం మంది హిందువుల్ని, 20 శాతం మంది ముస్లిములను కూడా అన్నారు. ఆ ‘శాత’వాహనులు ఇద్దరూ మతాన్ని మోసుకుంటూ తిరుగుతుంటారట. ఇంకోసారి సాల్మన్ రష్దీని పట్టుకున్నారు ఖట్జూ. మరీ ఎక్కువ పొగిడేశామ్, అంతలేదు రష్దీకి అంటారు. ఒరిస్సా వాళ్లని డర్టీ ఫెలోస్ అన్నారు. బిహార్ వాళ్లను చికాకు మనుషులు అన్నారు. జడ్జిల్ని కూడా ఏదో అన్నట్లున్నారు.. రేప్ కేసులో ఒక దోషికి మరణశిక్ష వెయ్యకుండా వదిలేశారని! ఇలా చాలా వివాదాలు తెచ్చుకున్నారు. (న్యాయవ్యవస్థపై మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు) ప్రస్తుతం ఆయన లక్నోలో ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన గడపడం కాదు, ప్రపంచాన్ని ప్రశాంతంగా గడపనిస్తున్నారనుకోవాలి. ఈ సమయంలో ఆయన పడక్కుర్చీని నెటిజన్స్ కొందరు కదిలించారు. ‘ఓయీ.. పితృస్వామ్య భావజాలీ.. కళ్లు తెరువు‘ అని తట్టి లేపారు. లేచి, వెంటనే రెప్పలు వాల్చేశారు తప్ప రిప్లయ్ ఇవ్వలేదు ఖట్జూ. నెటిజన్ లు ఈ వయసులో ఆయన్ని డిస్టర్బ్ చెయ్యడానికి తగిన కారణమే ఉంది. ఫేస్ బుక్ లో ఆయన ఏదో పోస్ట్ పెడితే, దానిపై ఓ మహిళ ఏదో కామెంట్ పెట్టారు. ఆ కామెంట్‌కి ఆయన.. ‘గుడ్ గర్ల్స్ స్లీప్ ఎర్లీ’ అని రిప్లయ్ ఇచ్చి పడుకుండిపోయారు. ‘మంచి అమ్మాయిలు ఎక్కువసేపు మేల్కొని ఉండరు’ అని అనడంలోని ఆయన భావం.. పెద్ద పెద్ద విషయాలు ఆడవాళ్లకు ఎందుకు అని! ఆ మాట నిజమే. ఖట్జూకి ప్రస్తుతం 74 ఏళ్లు. పెద్ద వాళ్లవి పెద్ద పెద్ద విషయాలే అయివుంటాయి. -
న్యాయవ్యవస్థపై మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సరైన న్యాయ విచారణ జరగదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరస్తుడు మోదీకి ఇండియాలో న్యాయం జరగదంటూ లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనల సందర్భంగా డిఫెన్స్ సాక్షిగా ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా మోదీ దోషిగా తేలతాడు ఏ న్యాయవాది అతని కేసును తీసుకోడు. దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందంటూ శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా 130 నిమిషాల వాదనలో కట్జు న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి పరిశోధనా సంస్థలు రాజకీయ నేతల ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలు అవినీతి, అక్రమాలకు నెలవయ్యాయని ఆరోపించడం సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు కొన్ని కేసులను ఆయన ఉదహరించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు 2019 అయోధ్య తీర్పు, పదవీ విరమణ అనంతరం ఆయన రాజ్యసభ ఎంపిగా నామినేట్ కావడంవంటి అనేక ఆరోపణలను కట్జు గుప్పించారు. గత 50 సంవత్సరాల్లో అత్యంత అవమానకరమైన తీర్పు అయోధ్య తీర్పు అని కూడా వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. అంతేకాదు విచారణ పూర్తి కాకుండానే నిందితుడు మోదీని "నేరస్థుడు"గా పేర్కొంటూ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (మే నెలలో ఒక విలేకరుల సమావేశంలో)చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇలాంటి తీర్పు చెప్పడానికి ఆయనేమీ న్యాయమూర్తి కాదు కదా, ఆయనేం న్యాయశాఖా మంత్రి అంటూ ఏద్దేవా చేశారు. మోదీ నేరస్థుడని భారత ప్రభుత్వం నిర్ధారించేసుకుంది. కోర్టులు వారు చెప్పినట్టే చేస్తాయి. ఇక న్యాయమైన విచారణను ఎలా ఆశించగలమని ఆయన మండిపడ్డారు. కేంద్రాన్ని నాజీ జర్మనీతో పోల్చుతూ..ఆర్థిక మాద్యం,నిరుదోగ్యం, ఇతర సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి బలిపశువు అవసరం. ఆ బలిపశువే నీరవ్ మోదీ అని సుప్రీం మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు. సీబీఐని పంజరంలో చిలుక అని పేర్కొన్న 2013 నాటి సుప్రీం వ్యాఖ్యలను కట్జు గుర్తుచేసుకున్నారు. సీబీఐ, ఈడీ రాజకీయాలకు అతీతంగా లేవని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేతలుడిగి చూస్తోందని మండిపడ్డారు. ఇవన్నీ రాజకీయ అధినేతల చేతుల్లో పావులుగా మారిపోయాయని వ్యాఖ్యనించారు. నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ ఆర్థిక నేరాల ఆరోపణల గురించి తాను ఏమీ చెప్పలేనన్న కట్జు ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయమైన విచారణ జరగదంటూ పదే పదే నొక్కి వక్కాణించారు. కాగా కట్జు వ్యాఖ్యలపై భారతదేశం తరఫున వాదిస్తున్న న్యాయవాది హెలెన్ మాల్కం స్పందిస్తూ.. హై ప్రొఫైల్ కేసులో వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐదు రోజుల విచారణలో చివరి రోజున, జస్టిస్ శామ్యూల్ గూజీ తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. మోడీని స్వదేశానికి రప్పించే అంశంపై తుది తీర్పు డిసెంబరులో రానుందని భావిస్తున్నారు. -
భారత్ పెద్ద తప్పు చేసింది.. పాక్‌కు చాలా హ్యాపీ
న్యూఢిల్లీ: భారత్ అనవసరంగా పాకిస్థాన్‌కు అవకాశం ఇచ్చిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అన్నారు. కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భారత్ పెద్ద తప్పు చేసిందని చెప్పారు. ఈ ఒక్క చర్యతో పాక్ ఆశల పేటిక తెరుకుందని, ఇక వారు భారత్‌పై ప్రతిసారి ఐసీజే తలుపుతడతారని, భారత్ కచ్చితంగా సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ఒక్క వ్యక్తి జీవితాన్ని కాపాడేందుకు భారత్ ఈ ప్రయత్నం చేస్తే ఇప్పుడు కశ్మీర్ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై ఐసీజేకు వెళతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో కులభూషణ్ జాదవ్ కేసు, ఐసీజే విషయాన్ని ప్రస్తావిస్తూ రాశారు. ‘జాదవ్ కేసు విషయంలో ప్రపంచ న్యాయస్థానానికి వెళ్లి చాలా తీవ్రమైన తప్పుచేసింది. బహుశా.. ఐసీజే తీర్పు విషయంలో చాలామంది సంబురాలు చేసుకుంటుండొచ్చు. కానీ, నా అభిప్రాయంలో అది భారత్ చేసిన పెద్ద తప్పు. ఇది పాక్ చెప్పుచేతల్లో మనం ఆడుతున్నట్లు. ఎన్నో విషయాలు ఇప్పుడు ఐసీజే చేతుల్లో పెట్టినట్లు. కశ్మీర్ విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థను, వ్యక్తులను ఇప్పటి వరకు అనుమతించని మనం ఇప్పుడు పాక్ ఐసీజేకు వెళితే జోక్యానికి అంగీకరించాల్సి వస్తుంది. ఇది పాక్ ఆశ పేటిక తెరిచినట్లే. ఒక వ్యక్తి కోసం కశ్మీర్‌వంటి సమస్య కూడా ఐసీజేకు వెళ్లేలాగా చేశారు. పాకిస్థాన్ ఇప్పుడు నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండిఉంటుంది’ అని కట్జూ ఫేస్బుక్లో రాసుకొచ్చారు. -
ఏపీ ప్రభుత్వం తీరుపై జస్టిస్ కట్జూ ఆగ్రహం
-
ఏపీ ప్రభుత్వం తీరుపై జస్టిస్ కట్జూ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్టులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కార్టూన్లు అనేవి భావ స్వేచ్ఛ ప్రకటనలో ఓ భాగమని కట్జూ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్ 19 (1) ఏ కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో రాజకీయవేత్తలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, ఇక్కడ ప్రజలే ప్రభువులని కట్జూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్‌పై ఆర్టికల్ 356 ప్రయోగించాలని అని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు. I appeal to @RashtrapatiBhvn @PMOIndia to dismiss the @ncbn govt over the unconstitutional arrest of cartoonist Ravi Kiran under Article 356 pic.twitter.com/6Sc2RZxe5S — Markandey Katju (@mkatju) 16 May 2017 -
టీనేజ్‌లో జయలలిత అంటే పడిచచ్చేవాణ్ని!
ఏ మోహమాటం లేకుండా మనస్సులో మాట సూటిగా చెప్పడం జస్టిస్ మార్కండేయ కట్జూ శైలి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. గతంలో ఆమెను రెండుసార్లు తాను కలిసినప్పటి జ్ఞాపకాలను ఫేస్బుక్లో నెమరు వేసుకున్నారు కట్జూ. జయలలిత పక్కన తాను కూర్చున్న ఫొటోను ఎఫ్బీలో పెట్టి.. 'షేర్నీ ఔర్ షేర్' (పులి-పులి) అంటూ కామెంట్ చేశారు. జయలలిత మీద అపారమైన గౌరవాన్ని చూపెట్టిన ఆయన తాజాగా ఫేస్బుక్లో ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని వెల్లడించారు. తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే పడిచచ్చేవాడినంటూ ఇన్నాళ్లు దాచిన ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు. 'నేను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేదని అనుకునేవాడిని. మనస్సులో ఉండిపోయిన ఆ ప్రేమ గురించి జయలలితకు తెలియదు. ఆమె 1948 ఫిబ్రవరిలో జన్మించగా, నేను 1946 సెప్టెంబర్‌లో పుట్టాను. 2004 నవంబర్‌లో చెన్నై రాజ్‌భవన్‌లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నా ప్రమాణం సందర్భంగా ఆమెను తొలిసారి కలిశాను. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి. అప్పటికీ అందంగా ఉంది. నా యవ్వనంలో కలిగిన భావనను అప్పుడు ఆమెకు చెప్పడం సరికాదని అనిపించింది' అని కట్జూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జయలలిత సినిమా పాటను కూడా షేర్ చేశారు. -
‘కేజ్రీవాల్ కన్నింగ్.. కళ్లు తెరవండి’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి నోటికి పని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డరారు. ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ మోసగాడని ధ్వజమెత్తారు. మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని విమర్శించారు. ‘కేజ్రీవాల్ కపట వ్యక్తి. మోసం చేయాలన్న తలంపు తప్ప ఆయన బుర్రలో మరోటి లేదు. మోసకారి మోదీకి ఆయనకు ఎటువంటి భేదం లేదు. కేజ్రీవాల్ ను చాలా మంది ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి వారి కళ్లు తెరిపించడానికి త్వరలో సమయం వస్తుంది. నిజం బయట పడుతుంద’ని కట్జూ ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. ముందుస్తు అంచనాలు వేసే వారికి అత్యుత్సాహం పనికిరాదన్నారు. 1948 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందుగా అంచనా వేసిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
'స్పీకర్ నిర్ణయానికి అందరూ తలొగ్గాల్సిందే'
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో నేడు చోటుచేసుకున్న సంఘటనలు చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ అన్నారు. ఈ గందరగోళ పరిస్థితులపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటే అది సభ్యులందరూ ఆమోదించాల్సిందేనని తెలిపారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ లోపల జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను టీవీల్లో చూపించకపోవడం, అప్రజాస్వామికమని మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కెండేయ కట్జూ వ్యాఖ్యానించారు. శశికళ వర్గానికి చెందిన సీఎం పళనిస్వామి బలనిరూపణ పరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించారు. స్పీకర్ పోడియంను డీఎంకే సభ్యులు చుట్టుముట్టి ఆయనపై, పేపర్లు, కుర్చీలు విసిరేశారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ సభను ఒంటిగంట వరకు వాయిదా వేశారు. ప్రతిపక్ష తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తిరిగి ఒంటిగంట తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. -
యూపీలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది!
క్లియర్ మెజారిటీ సమాజ్‌వాదీ పార్టీకే బీఎస్పీ కన్నా బీజేపీకి తక్కువ స్థానాలు వస్తాయ్ జస్టిస్ మార్కండేయ కట్జూ విశ్లేషణ న్యూఢిల్లీ: రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ చిత్తుగా జోడిపోతుందని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ జోస్యం చెప్పారు. యూపీ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన అంచనా వేశారు. ఎస్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఆయన అన్నారు. రానున్న యూపీ ఎన్నికలను విశ్లేషిస్తూ కట్జూ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. 'యూపీ సహా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు కులం, లేదా మత ప్రాతిపదికన జరుగుతాయి. ఏదైనా ప్రభంజనం ఉంటే అందుకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఉదా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం నడిచింది. ఇప్పుడు యూపీలో ఎలాంటి గాలి వీయడం లేదు. కాబట్టి దాదాపుగా 90శాతం ఓటింగ్ కులం, మతం ఆధారంగా నమోదవుతుంది. ప్రభంజనం కోసమే పెద్దనోట్లను రద్దు చేసినప్పటికీ అది విజయవంతంకాలేదు. నిజానికి నోట్ల రద్దు వల్ల బీజేపీకి హాని జరిగే అవకాశముంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు బాగా దెబ్బతిన్నారు' అని కట్జూ పేర్కొన్నారు. -
'జస్టిస్ గోగోయ్.. మీరు నన్ను భయపెట్టలేరు'
న్యూఢిల్లీ: మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూకు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. న్యాయవ్యవస్ధ చరిత్రలో ఓ మాజీ న్యాయమూర్తి కోర్టు ధిక్కార నేరం కింద నోటీసులు అందుకోవడం ఇదే ప్రథమం. సౌమ్య రేప్ కేసులో తీర్పును కాకుండా న్యాయమూర్తులను కట్జూ కించపరిచారని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. సౌమ్య కేసులో నిందితుడు గోవిందచామికి మరణ దండన విధించాలంటూ కేరళ ప్రభుత్వం, సౌమ్య తల్లి వేసిన పిటిషన్లను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్ధానం మాజీ న్యాయమూర్తి కట్జూకు నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపింది. కాగా సుప్రీంకోర్టు నోటీసుపై స్పందించిన మార్కండేయ కట్జూ.. ముగ్గురు జడ్జిల ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ గోగోయ్ ను ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారు. ’మిస్టర్ గోగోయ్ మీరు నన్ను భయపెట్టలేరు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను భయపడను’ అని అన్నారు. జస్టిస్ గోగోయ్ ను ఏక సంభోదన చేస్తూ మాజీ న్యాయమూర్తి కట్జూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో జస్టిస్ గోగోయ్ తన జూనియర్ గా పనిచేశారని గుర్తు చేశారు. సౌమ్య కేసులో తీర్పును ఆక్షేపించడంపై గత నెల 17వ తేదీన జస్టిస్ కట్జూకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారించిన అత్యున్నత న్యాయస్ధానం నిందితుడు గోవిందచామీకి మరణదండన ఇస్తూ తీర్పునివ్వకపోవడం ఎలా తప్పో? చెప్పాలని కోరింది. 2013లో గోవిందచామీకి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను అమలు చేయాలని కేరళ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితుడికి శిక్షను తగ్గిస్తూ జీవిత ఖైదును విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ ఫేస్ బుక్ లో స్పందించారు. నిందితుడికి శిక్షను తగ్గించడం న్యాయవ్యవస్ధలో జరిగిన పెద్ద తప్పుగా అభివర్ణించారు. సెక్షన్ 300ను కోర్టు పూర్తిగా చదవలేదని తన పోస్టులో పేర్కొన్నారు. బహిరంగ న్యాయస్ధానంలో కోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని అన్నారు. -
కట్జూ.. కోర్టుకు రండి: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: అసాధారణ రీతిలో దేశంలోనే తొలిసారిగా ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జిని తన ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. సంచలనం సృష్టించిన కేరళ సౌమ్య రేప్, హత్య కేసులో సుప్రీం వెలువరించిన తీర్పులో ప్రాథమిక తప్పులున్నాయని మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ కట్జూ సెప్టెంబర్‌లో తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ‘కట్జూ గౌరవప్రదమై వ్యక్తి. అందుకే ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి ఫేస్బుక్లో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’ అని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యూయూ లలిత్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చే ముందు జడ్జీలు సెక్షన్ 300ను క్షుణ్ణంగా పరిశీలించలేదని, ఈ కేసును బహిరంగ కోర్టులో పునర్విచారించాలని కట్జూ అనడం విచారకరమని అభిప్రాయపడింది. ఈ మేరకు కట్జూకు కోర్టు నోటీసులిచ్చింది. మాజీ జడ్జిని ఇలా ఆదేశించడం ఇదే తొలిసారని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు. -
దేశద్రోహం కేసు పెట్టినా సెటైర్లు ఆపలేదు!
పట్నా: బిహార్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. అధికార జేడీయూ ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు శాస్త్రి నగర్ పోలీసు స్టేషన్లో ఆయనపై సెక్షన్ 124 ఏ (దేశద్రోహం) నమోదైంది. మరోవైపు ఓ లాయర్ కూడా ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిహార్‌ను తీసుకుంటామనే షరతు మీద కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేందుకు సిద్ధమని, కశ్మీర్‌ను బిహార్‌తో కలిపి ప్యాకేజీగా ఇస్తామని, బిహార్ వద్దంటే కశ్మీర్ కూడా ఇవ్వబోమని జస్టిస్ కట్జూ తీవ్ర వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సహా పలువురు నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనవి సరదా వ్యాఖ్యలు మాత్రమేనని వివరణ ఇచ్చిన కట్జూ బుధవారం మళ్లీ తన పాత ధోరణిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనపై కావాలంటే బిహారీలు ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయవచ్చునని చమత్కరించారు. 'బిహార్‌కు నేను అమ్మనా, నాన్ననా అని నితీశ్‌కుమార్ ప్రశ్నిస్తున్నారు. బిహార్‌కు నేను అమ్మానాన్నను కాదు కానీ శకుని మామను' అంటూ పేర్కొన్నారు. 'వస్త్రాపహారణం జరుగుతుంటే ద్రౌపది గౌరవాన్ని కాపాడుకునేందుకు కృష్ణుణ్ని ప్రార్థించింది' అంటూ పరోక్షంగా నితీశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. -
మా రాష్ట్రానికి నువ్వు అయ్యవా? ఓనర్‌వా?
పట్నా: కశ్మీర్‌తోపాటు బిహార్‌ను కూడా పాకిస్థాన్‌కు ఇచ్చేస్తామంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ బంఫర్ ఆఫర్ ఇచ్చేశారు. కశ్మీర్ కావాలంటే బిహార్‌తో కలిపి ఒక ప్యాకేజీలాగా ఇస్తామని, బిహార్ వద్దనుకుంటే రెండింటినీ ఇవ్వబోమని ఆయన ఫేస్బుక్లో కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కానీ, కట్టూ వ్యాఖ్యలు బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు కోపం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించడమేనని నితీశ్ పేర్కొన్నారు. ’బిహార్‌కు ఆయన తల్లీతండ్రా? లేక యజమానా’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కట్జూ పేరును నితీశ్ ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌తోపాటు బిహార్‌ను కూడా పాక్‌కు ఇచ్చేస్తామంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలపై బిహార్ రాజకీయ నాయకులు భగ్గుమంటున్నారు. అధికార జేడీయూతోపాటు ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కట్జూపై దేశద్రోహం కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. నిజానికి నితీశ్‌కు జస్టిస్ కట్జూకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. గతంలో కట్జూ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బాహాటంగానే నితీశ్ సర్కారును దుయ్యబట్టారు. బిహార్‌లో ప్రతికా స్వేచ్ఛ ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా జస్టిస్ కట్జూ తప్పుబట్టారు. -
ఆయన మెదడులో ఏమీ లేదు!
న్యూఢిల్లీ: తమ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి వస్తే అమృత్సర్ను 'పవిత్ర నగరం'గా ప్రకటిస్తామంటూ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం తాను ఎంతకైనా దిగుజారుతానని కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని కట్జూ తాజా ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. కేజ్రీవాల్ వట్టి వాక్శూరుడని, ఆయన మెదడులో ఏమీ లేదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేందుకు ఆయన సిద్ధంగా ఉంటారని ఈ వ్యాఖ్యలతో రుజువైందని జస్టిస్ కట్జూ విమర్శించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే అమృత్సర్, ఆనందపూర్ సాహిబ్ నగరాలను 'పవిత్ర నగరాలు'గా ప్రకటిస్తామని, అంతేకాకుండా అమృత్సర్ నగర పరిధిలో మద్యం, మాంసం, ధూమపానం సేవనాన్ని నిషేధిస్తామని కేజ్రీవాల్ తాజాగా హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇచ్చిన ఇలాంటి హామీల వల్ల అలహాబాద్ (ప్రయాగ), వారణాసి, అయోధ్య, మధుర, పూరి, అజ్మీర్, హరిద్వార్ వంటి నగరాల నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశముందని, ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీయవచ్చునని ఆయన పేర్కొన్నారు. మతం పేరిట ఇలాంటి హామీలు ఇవ్వడం చక్కగా ఓట్లు రాబట్టుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ, ఇవి దేశ లౌకిక స్వభావాన్నిదెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
నిర్ణయం మీదే
జల్లికట్టు నిర్వహణపై సీఎంకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సూచన చెన్నై, సాక్షి ప్రతినిధి: జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే అత్యవసర చట్టం చేసుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖర్జు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జయలలితకు ఆయన సూచించారు. రాష్ట్రంలో జల్లికట్టు పోటీలపై 2007లో నిషేధం విధించారు. అయితే ప్రభుత్వ జా రీచేసిన చట్టాన్ని అనుసరించి ప్రతి ఏటా జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో వన్యప్రాణి సంక్షేమ సంఘం వేసిన పిటిషన్‌ను అనుసరించి 2014లో సుప్రీంకోర్టు నిషేధం విధిం చింది. ఈ నిషేదాజ్ఞలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది పొంగల్ పండుగ సమయంలో సైతం జల్లికట్టు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగాయి. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకుండానే పండుగ దాటిపోయింది. మళ్లీ ఈ ఏడాది పండుగ సమీపించడంతో ప్రజలు, రాజకీయ పార్టీలు జల్లికట్టు జరిపి తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల వే ళ కావడంతో ప్రజలను ప్రసన్నం చేసుకునే జల్లికట్టు సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు పాటుపడుతున్నాయి. అయితే అదే స్థాయిలో వన్యప్రాణి సంక్షేమ సంఘం, కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాది సైతం జల్టికట్టును అనుమతించరాదని పట్టుదలతో ఉండడంతో చిక్కులు కొనసాగుతున్నాయి. మీకే అధికారం ఉంది: సుప్రీం మాజీ న్యాయమూర్తి ఇదిలా ఉండగా జల్లికట్టు నిర్వహణకు అవసరమైన ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖర్జు ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై రాష్ట్రప్రభుత్వానికి ఉన్న అధికారాలను వివరించకుండా సీఎం జయలలితను ప్రభుత్వ న్యాయసలహాదారు తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రధాని, రాష్ట్రపతికి ఉత్తరాలు రాయిస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. క్రీడలు, వినోదం తదితరాలన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర గవర్నర్ అనుమతితో కొత్త చట్టాన్ని తెచ్చుకునే అధికారం రాష్ట్రప్రభుత్వం చేతుల్లోనే ఉందని ఆయన అంటున్నారు. దున్నలు, జల్లికట్టు క్రీడాకారులు గాయపడని రీతిలో అంశాలను చేర్చి నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఫేస్బుక్లో ఖర్గే వ్యాఖ్యలను పరిశీలించిన కొందరు ఈ అంశాన్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవచ్చుకదాని ప్రశ్నించారు. మరికొందరు సచివాలయంలోని ముఖ్యమంత్రి ప్రత్యేక ఫిర్యాదుల విభాగం, ఈ-మెయిల్ చిరునామాలను ఆయనకు పంపారు. ఫేస్బుక్ వీక్షకుల సూచనలకు స్పందించిన ఖర్గే ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఖర్గే సూచనలపై వైగో: మాజీ న్యాయమూర్తి ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఎండీఎంకే అధినేత వైగో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జల్లికట్టు ఖాయం: బీజేపీ ఈ ఏడాది పొంగల్ పండుగలో జల్లికట్టు క్రీడను జరుపుకోవడం ఖాయమని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 2008లో కాంగ్రెస్, డీఎంకే హయాంలోనే జల్లికట్టుపై నిషేధం అమలులోకి వచ్చిందని చెప్పారు. ఎద్దులను హింసించడం జల్లికట్టు ఉద్దేశ్యం కాదని, తమిళుల సంప్రదాయ క్రీడగానే చూస్తున్నామని ఆయన అన్నారు.గతంలో తాను ప్రకటించినట్లుగానే జల్లికట్టు జరిగి తీరుతుందని చెప్పారు. ఈ విషయమై కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో మంగళవారం గంటపాటూ చర్చించానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వానియంబాడిలో బుధవారం మీడియాతో ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడుతూ, ఇటీవల కుంభకోణానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారని ఆమె తెలిపారు. -
కిరణ్ బేడీపై కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి కిరణ్ బేడీ కంటే షాజియా ఇల్మీ అందగా ఉంటుందని కట్జూ ట్వీట్ చేశారు. అంతేగాక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షాజియాను ప్రకటించివుంటే బీజేపీ విజయం సాధించేదని కట్జూ పేర్కొన్నారు. ప్రజలు అందంగా ఉన్నవారికే ఓటు వేస్తారంటూ మరో ట్వీట్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోని తనలాంటి వారు కూడా షాజియాకే ఓటు వేస్తారని కట్జూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కట్జూ వ్యాఖ్యలను విమర్శిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. -
భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి
* మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, ఎన్బీఏ న్యూఢిల్లీ: తెలంగాణను గౌరవించని మీడియాను భూమిలో పాతేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జాతీయస్థాయి పాత్రికేయ సంఘాలు ఖండించాయి. రెండు చానళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని విమర్శించాయి. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) గురువారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. మీడియాకు వ్యతిరేకంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన పలు చర్యలను తాము పరిశీలించామని... అవన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు ఎన్.రవి తమ ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాపై తీవ్ర చర్యలకు పాల్పడవద్దని టీ సర్కారుకు, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయాలని పిలుపిచ్చారు. మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని ఎన్బీఏ పేర్కొంది. తెలంగాణ లో కొన్ని చానళ్లను కేబుల్ ఆపరేటర్లు నిలిపేయ డం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. తీవ్ర అభ్యంతరకరం: కట్జూ మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అలాంటివి సరికాదంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీవీ చానెళ్లు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. -
అవినీతి బయటపెడితే ప్రతిష్టకు భంగమా?
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలోని అవినీతి తుట్టను రేపిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన పంథా కొనసాగిస్తున్నారు. న్యాయవ్యవస్థలోని అవినీతిని బయటపెట్టినంత మాత్రాన దాని ప్రతిష్ట దెబ్బతినదని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తుల అవినీతి బాగోతాలను బయటపెడితే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఎలా దెబ్బ తింటుందని ఆయన ప్రశ్నించారు. అవినీతి న్యాయమూర్తులు ఉండడమే న్యాయవ్యవస్థకు అవమానకరమని తన బ్లాగ్ లో కట్జూ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను కట్టూ మంటగలుపుతున్నారని వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. -
ప్రతిభ ఆధారంగానే చీఫ్ జస్టిస్ ఎంపిక
న్యూఢిల్లీ: ప్రతిభ ఆధారంగా భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగాలని సీనియారిటి ప్రాతిపదికన కాదని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. సీనియారిటి ఉన్న వారికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఇవ్వాలని రాజ్యాంగబద్దమైన లేదా శాసనసంబంధమైన నిబంధన ఏదీ లేదని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిభ కనబరిచిన వారిని నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఆయన సూచించారు. సీజేఐ నియామకానికి అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలు న్యాయవ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయని కట్జూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఏం లోదా- సెప్టెంబర్ 27న పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మీడియా నాయకత్వం వహించాలి!
భువనేశ్వర్:దేశంలో పేట్రేగిపోతున్న భూస్వామ్య వ్యవస్థను రూపుమాపడానికి మీడియా కీలక పాత్ర పోషించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ విజ్క్షప్తి చేశారు. దేశంలోని భూస్వామ్య వ్యవస్థను, పేదరికాన్నిఅంతమొందించాలంటే దానికి మీడియానే నాయకత్వం వహించాలన్నారు. అఖిల భారత మీడియా కౌన్సిల్ సమావేశంలో సోమవారం పాల్గొన్నఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా దేశంలోని పేదరికం హెచరిల్లుతుందన్నారు. గత కొన్నేళ్ల నుంచి దేశం క్లిష్లపరిస్థితులు ఎదుర్కొంటున్నందున దాన్ని నుంచి కాపాడేందుకు మీడియా ముందుండాలన్నారు. సమాజంలోని భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా రూపుమాపడానికి మీడియా పోరు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. '20 ఏళ్ల నుంచి దేశం చాలా వేదన స్థితిలో ఉంది. సమాజంలో చెడు సంస్కృతి పెరిగిపోయింది. వాటిని నివారించటానికి మీడియా యుద్ధం చేయాలి' అని కట్జూ స్పష్టం చేశారు. -
'హిందూ, ముస్లింల మైండ్ సెట్ మారాలి'
న్యూఢిల్లీ: నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే హిందువులు, ముస్లింలు తమ మైండ్‌సెట్ మార్చుకోవాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ పిలుపునిచ్చారు. హిందువులు సిసలైన భారతీయులు అనిపించుకోవాలంటే దళితులను నీచంగా చూడడం మానుకోవాలి. అలాగే దళితులు, దళితేతరుల మధ్య కులాంతర వివాహాలు ఎక్కువగా జరగాలని కట్జూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. ఇక ముస్లింలు నిజమైన ఇండియన్స్ రుజువు చేసుకోవాలంటే వారిలో గొప్ప-బీద తారతమ్యం పోవాలన్నారు. ఇందుకు ఉన్నత-నిమ్నశ్రేణి మధ్య పెళ్లిళ్లు జరగాలని సూచించారు. మహిళలను తక్కువగా పరిగణించే అన్యాయమైన ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయాలని ముస్లిములందరూ డిమాండ్ చేయాలన్నారు. -
మాజీ న్యాయమూర్తి కట్జూపై డీఎంకే మండిపాటు!
చెన్నై: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై డీఎంకే పార్టీ మండిపడింది. కట్జూ ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎంకే స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి కోసం యూపీఏ భాగస్వామిగా ఉన్న తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ పార్టీ లాబీయింగ్ చేసిందని కట్జూ ఆరోపణలన్ని అభూత కల్పన అని డీఎంకే నేతలు తెలిపారు. కట్లూ చేసి ఆరోపణల్ని డీఎంకే పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ పేరు చెప్పలేదని.. అంతేకాకుండా న్యాయమూర్తి పేరు కూడా కట్జూ వెల్లడించలేదని డీఎంకే నేత టీకేఎస్ ఎలాంగోవన్ అన్నారు. కట్జూ వ్యాఖ్యల్ని అధినేత కరుణానిధి దృష్టికి తీసుకువెళ్తామని ఎలాంగోవన్ తెలిపారు.