'హిందూ, ముస్లింల మైండ్ సెట్ మారాలి'
న్యూఢిల్లీ: నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే హిందువులు, ముస్లింలు తమ మైండ్సెట్ మార్చుకోవాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ పిలుపునిచ్చారు. హిందువులు సిసలైన భారతీయులు అనిపించుకోవాలంటే దళితులను నీచంగా చూడడం మానుకోవాలి. అలాగే దళితులు, దళితేతరుల మధ్య కులాంతర వివాహాలు ఎక్కువగా జరగాలని కట్జూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.
ఇక ముస్లింలు నిజమైన ఇండియన్స్ రుజువు చేసుకోవాలంటే వారిలో గొప్ప-బీద తారతమ్యం పోవాలన్నారు. ఇందుకు ఉన్నత-నిమ్నశ్రేణి మధ్య పెళ్లిళ్లు జరగాలని సూచించారు. మహిళలను తక్కువగా పరిగణించే అన్యాయమైన ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయాలని ముస్లిములందరూ డిమాండ్ చేయాలన్నారు.