ఢాకా: బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత, అక్కడి హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజల విషయంలో ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.
ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వుల తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
Comments
Please login to add a commentAdd a comment