మీడియా నాయకత్వం వహించాలి!
భువనేశ్వర్:దేశంలో పేట్రేగిపోతున్న భూస్వామ్య వ్యవస్థను రూపుమాపడానికి మీడియా కీలక పాత్ర పోషించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ విజ్క్షప్తి చేశారు. దేశంలోని భూస్వామ్య వ్యవస్థను, పేదరికాన్నిఅంతమొందించాలంటే దానికి మీడియానే నాయకత్వం వహించాలన్నారు. అఖిల భారత మీడియా కౌన్సిల్ సమావేశంలో సోమవారం పాల్గొన్నఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా దేశంలోని పేదరికం హెచరిల్లుతుందన్నారు. గత కొన్నేళ్ల నుంచి దేశం క్లిష్లపరిస్థితులు ఎదుర్కొంటున్నందున దాన్ని నుంచి కాపాడేందుకు మీడియా ముందుండాలన్నారు.
సమాజంలోని భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా రూపుమాపడానికి మీడియా పోరు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. '20 ఏళ్ల నుంచి దేశం చాలా వేదన స్థితిలో ఉంది. సమాజంలో చెడు సంస్కృతి పెరిగిపోయింది. వాటిని నివారించటానికి మీడియా యుద్ధం చేయాలి' అని కట్జూ స్పష్టం చేశారు.