‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణకే ప్రాధాన్యత’ | 'Priority is to protect the freedom of the media' | Sakshi
Sakshi News home page

‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణకే ప్రాధాన్యత’

Published Fri, Nov 28 2014 4:49 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణకే ప్రాధాన్యత’ - Sakshi

‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణకే ప్రాధాన్యత’

న్యూఢిల్లీ: మీడియా స్వేచ్ఛను పరిరక్షించడమే తన ప్రాధాన్యమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీ ఐ) నూతన చైర్‌పర్సన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో నియంత్రిత మీడియా కన్నా బాధ్యతారాహిత్య మీడియాను భరించటం మేలన్నారు.

గురువారమిక్కడ పీసీఐ చీఫ్‌గా జస్టిస్ మార్కండేయ కట్జూ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పీటీఐతో మాట్లాడారు. మీడియా బాధ్యతారాహిత్యంగా ఉంటే ప్రజలు దానికి తమ మేధావితనంతో తీర్పు చెబుతారని, అయితే మీడియాపై నియంత్రణ విధిస్తే మాత్రంప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదనిప్రసాద్ అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement