రిషి సునాక్ యూకే ప్రధాని కావడం పట్ల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
కావాల్సింది ప్రణాళిక
నేను గతంలో 90 శాతం మంది భారతీయులు మూర్ఖులు అన్నాను. రిషి సునాక్ యూకే ప్రధాని కావడాన్ని పండుగ చేసుకోవడం చూస్తుంటే అది నిరూపితమవుతోంది. యూకే ప్రధాని మూలాలు బ్రిటిష్, ఇండియన్, చైనీస్ – ఏవైతే ఏంటి... మాంద్యంలో ఉన్న బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను ఒడ్డున పడేయడానికి ఆయన దగ్గర ఏం ప్రణాళిక ఉందన్నది ముఖ్యం?
– మార్కండేయ ఖట్జూ, మాజీ న్యాయమూర్తి
రేసు మారిపోయింది
సారీ ఇండియన్ – అమెరికన్స్! సీఈవో కావడం ఇప్పుడు గొప్పేమీ కాదు. పూర్వ వలసవాద దేశానికి ప్రధానమంత్రి కాగలగాలి. ఇప్పుడిదే కొత్త ప్రమాణం.
– కరణ్ తలాటి, ఆంట్రప్రెన్యూర్
ఏం చేయరా?
అధికారంలో ఉన్న స్మృతీ ఇరానీ మహిళల కోసం ఏం చేసిందో, రిషి సునాక్ ఇండియన్స్ కోసం అంతే చేస్తాడు.
– అదితీ మిత్తల్, కమెడియన్
మీ శిబిరం కాదనా?
చరిత్రలో ఇటలీకి మొదటిసారి ఒక మహిళ (జార్జియా మెలోనీ) ప్రధాని అయ్యారు. ఆమె రోమ్ శివార్లలో పెరిగారు. శ్రామిక కుటుంబానికి చెందిన, తండ్రిలేని ఈమె యూనివర్సిటీకి వెళ్లి చదువుకోలేదు. వెయిట్రెస్‌గా రాత్రి షిఫ్టుల్లో పనిచేశారు. కానీ ఆమె ఊసే ఎక్కడా లేదు. ఆమె గనుక ప్రగతిశీలవాది అయివుంటే మీడియా ఆమె గురించి హోరెత్తించి ఉండేది.
– అలెజాండ్రా బెక్కో, ఇటలీ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment