Aditi Mittal
-
సీఈవో కావడం గొప్ప కాదు.. ప్రధానమంత్రి కావాలి!
రిషి సునాక్ యూకే ప్రధాని కావడం పట్ల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! కావాల్సింది ప్రణాళిక నేను గతంలో 90 శాతం మంది భారతీయులు మూర్ఖులు అన్నాను. రిషి సునాక్ యూకే ప్రధాని కావడాన్ని పండుగ చేసుకోవడం చూస్తుంటే అది నిరూపితమవుతోంది. యూకే ప్రధాని మూలాలు బ్రిటిష్, ఇండియన్, చైనీస్ – ఏవైతే ఏంటి... మాంద్యంలో ఉన్న బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను ఒడ్డున పడేయడానికి ఆయన దగ్గర ఏం ప్రణాళిక ఉందన్నది ముఖ్యం? – మార్కండేయ ఖట్జూ, మాజీ న్యాయమూర్తి రేసు మారిపోయింది సారీ ఇండియన్ – అమెరికన్స్! సీఈవో కావడం ఇప్పుడు గొప్పేమీ కాదు. పూర్వ వలసవాద దేశానికి ప్రధానమంత్రి కాగలగాలి. ఇప్పుడిదే కొత్త ప్రమాణం. – కరణ్ తలాటి, ఆంట్రప్రెన్యూర్ ఏం చేయరా? అధికారంలో ఉన్న స్మృతీ ఇరానీ మహిళల కోసం ఏం చేసిందో, రిషి సునాక్ ఇండియన్స్ కోసం అంతే చేస్తాడు. – అదితీ మిత్తల్, కమెడియన్ మీ శిబిరం కాదనా? చరిత్రలో ఇటలీకి మొదటిసారి ఒక మహిళ (జార్జియా మెలోనీ) ప్రధాని అయ్యారు. ఆమె రోమ్ శివార్లలో పెరిగారు. శ్రామిక కుటుంబానికి చెందిన, తండ్రిలేని ఈమె యూనివర్సిటీకి వెళ్లి చదువుకోలేదు. వెయిట్రెస్‌గా రాత్రి షిఫ్టుల్లో పనిచేశారు. కానీ ఆమె ఊసే ఎక్కడా లేదు. ఆమె గనుక ప్రగతిశీలవాది అయివుంటే మీడియా ఆమె గురించి హోరెత్తించి ఉండేది. – అలెజాండ్రా బెక్కో, ఇటలీ జర్నలిస్ట్ -
అదితి నన్ను వేధించింది : లేడీ కమెడియన్
#మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తానన్న కమెడియన్ అదితి మిట్టల్ ముందుగా తనకు క్షమాపణలు చెప్పాలని మరో కమెడియన్ కనీజ్ సుర్ఖా డిమాండ్ చేస్తున్నారు. అదితి తనను మానసిక సంఘర్షణకు గురి చేసిందని కనీజ్ ఆరోపించారు. ‘నాకు జరిగిన విషయం గురించి కూడా చెప్పాలి. రెండేళ్ల క్రితం.. అంధేరీ బేస్‌లో ఓ కామెడీ షో నిర్వహిస్తున్న సమయంలో.. అక్కడ సుమారు 100 మంది ప్రేక్షకులు ఉన్నారు. నాతో పాటు ఇతర కమెడియన్లు కూడా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా స్టేజీ మీదకు వచ్చిన అదితి నన్ను బలవంతంగా... ముద్దు పెట్టుకుంది. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడేమీ చేయలేకపోయాను. అయితే ఏడాది కిందట తనని కలిసినపుడు నాకు క్షమాపణ చెప్పాలని అడిగాను. మొదట సరేనంది. కానీ మరోసారి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే ఇప్పుడు తను నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి’ అంటూ కనీజ్ తన #మీటూ స్టోరీని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రతీకారం తీర్చుకోవడం లేదు.. #మీటూ ఉద్యమానికి సపోర్టు చేస్తానన్న అదితి ముందుగా తన తప్పు తెలుసుకోవాలని మాత్రమే ఈ విషయాన్ని బయటపెట్టానన్న కనీజ్.. ‘ఇది ప్రతీకార చర్య కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అంతేకాదు ఈ స్టోరీ ఆధారంగా మీ సొంత ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించకండి’ అంటూ వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు.