అదితి నన్ను వేధించింది : లేడీ కమెడియన్‌ | Comedian Kaneez Alleged Aditi Mittal Harassed Her | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 9:32 AM | Last Updated on Thu, Oct 11 2018 12:07 PM

Comedian Kaneez Alleged Aditi Mittal Harassed Her - Sakshi

అదితి మిట్టల్‌- కనీజ్‌ సుర్ఖా

#మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తానన్న కమెడియన్‌ అదితి మిట్టల్‌ ముందుగా తనకు క్షమాపణలు చెప్పాలని మరో కమెడియన్‌ కనీజ్‌ సుర్ఖా డిమాండ్‌ చేస్తున్నారు. అదితి తనను మానసిక సంఘర్షణకు గురి చేసిందని కనీజ్‌ ఆరోపించారు.

‘నాకు జరిగిన విషయం గురించి కూడా చెప్పాలి. రెండేళ్ల క్రితం.. అంధేరీ బేస్‌లో ఓ కామెడీ షో నిర్వహిస్తున్న సమయంలో.. అక్కడ సుమారు 100 మంది ప్రేక్షకులు ఉన్నారు. నాతో పాటు ఇతర కమెడియన్లు కూడా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా స్టేజీ మీదకు వచ్చిన అదితి నన్ను బలవంతంగా... ముద్దు పెట్టుకుంది. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడేమీ చేయలేకపోయాను. అయితే ఏడాది కిందట తనని కలిసినపుడు నాకు క్షమాపణ చెప్పాలని అడిగాను. మొదట సరేనంది. కానీ మరోసారి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే ఇప్పుడు తను నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి’ అంటూ కనీజ్‌ తన #మీటూ స్టోరీని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రతీకారం తీర్చుకోవడం లేదు..
#మీటూ ఉద్యమానికి సపోర్టు చేస్తానన్న అదితి ముందుగా తన తప్పు తెలుసుకోవాలని మాత్రమే ఈ విషయాన్ని బయటపెట్టానన్న కనీజ్‌.. ‘ఇది ప్రతీకార చర్య కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అంతేకాదు ఈ స్టోరీ ఆధారంగా మీ సొంత ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించకండి’ అంటూ వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులను ఉద్దేశించి మరో ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement