నటుడు, కమెడియన్ సునీల్ పాల్ మంగళవారం కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని సునీల్ భార్య సరిత ధృవీకరించింది. ఆమె మాట్లాడుతూ.. నా భర్త ఉన్నట్లుండి టచ్‌లో లేకపోయేసరికి కంగారుపడిపోయాను. అతడిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను పోలీసులను సంప్రదించగా వారు చాలా సహాయం చేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను కిడ్నాప్ చేసినవారి గురించి కూడా పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాను అని పేర్కొన్నారు.
మిస్సింగ్..
ఏదో షోలో పొల్గొనేందుకు వేరే నగరానికి వెళ్లిన సునీల్ మంగళవారం తిరిగి ఇంటికొస్తానన్నాడు. అయితే ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా ఆయన ఇంటికి చేరుకోలేదు. పైగా ఫోన్‌కాల్స్ కూడా కనెక్ట్ కాకపోవడంతో కంగారుపడిపోయిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే సునీల్ తన కుటుంబంతో టచ్‌లోకి వచ్చాడు. మంగళవారం రాత్రికల్లా తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
కాగా సునీల్ పాల్ 2005లో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో విజేతగా నిలిచాడు. హమ్ తుమ్, ఫిర్ హేరీ ఫెరి, ఆప్నా సప్నా మనీ మనీ, బాంబే టు గోవా వంటి చిత్రాల్లోనూ నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment