
ప్రియుడి హత్య కేసులో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి సోదరి ఆలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు ఒకర్ని హత్య చేసేంత కిరాతకురాలు కాదని, తనకు సహాయం చేయడం మాత్రమే వచ్చని ఆమె తల్లి వెనకేసుకొస్తోంది. నర్గీస్ ఫక్రి మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించనేలేదు. సుమారు 20 ఏళ్లుగా తన సోదరితో నర్గీస్‌కు మాటల్లేవట!

20 ఏళ్లుగా మాటల్లేవ్
ఈ రెండు దశాబ్దాల్లో ఈ అక్కాచెల్లెళ్లు కలుసుకుందే లేదని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తన సోదరి అరెస్టయిన విషయాన్ని.. అందరిలాగే నర్గీస్ కూడా వార్తలు చూసే తెలుసుకుందట! తాజాగా నర్గీస్ ఫక్రి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నీకోసం మేమంతా వస్తున్నాం అని రాసుకొచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బజ్వాతో కలిసున్న ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఈ ముగ్గురూ హౌస్‌ఫుల్ 5 సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది.

ఏం జరిగిందంటే?
అమెరికాలో ఉంటున్న ఆలియా..ఎడ్వర్డ్ జాకబ్స్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏమైందో ఏమోకానీ వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే మళ్లీ కలిసిపోదామన్న ఆలియా అభ్యర్థనను ఎడ్వర్డ్ తోసిపుచ్చాడట! పైగా తనను వదిలేసి అతడి స్నేహితురాలు అనస్తాసియాతో ఎక్కువ చనువుగా ఉండటాన్ని జీర్ణించలేకపోయిందట! ఈ క్రమంలోనే గ్యారేజీకి నిప్పుపెట్టి ఎడ్వర్డ్, అనస్తాసియాను చంపేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అరెస్టయిన ఆలియాను డిసెంబర్ 9న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Comments
Please login to add a commentAdd a comment