Nargis Fakhri
-
హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్!
ప్రియుడి హత్య కేసులో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి సోదరి ఆలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు ఒకర్ని హత్య చేసేంత కిరాతకురాలు కాదని, తనకు సహాయం చేయడం మాత్రమే వచ్చని ఆమె తల్లి వెనకేసుకొస్తోంది. నర్గీస్ ఫక్రి మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించనేలేదు. సుమారు 20 ఏళ్లుగా తన సోదరితో నర్గీస్‌కు మాటల్లేవట! 20 ఏళ్లుగా మాటల్లేవ్ఈ రెండు దశాబ్దాల్లో ఈ అక్కాచెల్లెళ్లు కలుసుకుందే లేదని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తన సోదరి అరెస్టయిన విషయాన్ని.. అందరిలాగే నర్గీస్ కూడా వార్తలు చూసే తెలుసుకుందట! తాజాగా నర్గీస్ ఫక్రి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నీకోసం మేమంతా వస్తున్నాం అని రాసుకొచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బజ్వాతో కలిసున్న ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఈ ముగ్గురూ హౌస్‌ఫుల్ 5 సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది.ఏం జరిగిందంటే?అమెరికాలో ఉంటున్న ఆలియా..ఎడ్వర్డ్ జాకబ్స్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏమైందో ఏమోకానీ వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే మళ్లీ కలిసిపోదామన్న ఆలియా అభ్యర్థనను ఎడ్వర్డ్ తోసిపుచ్చాడట! పైగా తనను వదిలేసి అతడి స్నేహితురాలు అనస్తాసియాతో ఎక్కువ చనువుగా ఉండటాన్ని జీర్ణించలేకపోయిందట! ఈ క్రమంలోనే గ్యారేజీకి నిప్పుపెట్టి ఎడ్వర్డ్, అనస్తాసియాను చంపేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అరెస్టయిన ఆలియాను డిసెంబర్ 9న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.చదవండి: ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్ -
మాజీ బాయ్‌ఫ్రెండ్ హత్య కేసులో ప్రముఖ నటి సోదరి అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది. తన సోదరి అలియాను హత్య కేసులో న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది. అలియా మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎడ్వర్డ్ జాకబ్స్, ఆయన స్నేహితురాలి హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉంది. ఎడ్వర్డ్‌కు చెందిన గ్యారేజీకి అలియా నిప్పంటించడంతో వారు చనిపోయారని న్యూయార్క్ పోలీసులు అనుమానిస్తున్నారు.న్యూయార్క్ డైలీ న్యూస్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ తన మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ , అతని స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్ల మరణానికి కారణం అలియానే అని అనుమానాలు ఉన్నాయి. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో అనస్తాసియా మధ్య పెరుగుతున్న బంధం పట్ల అలియా అసూయతో ఉన్నట్లు వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే, అసూయతో, ఆమె గ్యారేజీకి నిప్పు పెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. నిప్పు పెట్టిన తర్వాత విష వాయువులు వెలువడటంతో వారు మరణించారు. ఆమె అసూయనే ఇద్దరు వ్యక్తులను చనిపోయేలా చేసిందని అక్కడి మీడియా పేర్కొంటుంది. క్వీన్స్ క్రిమినల్ కోర్టులో విచారణ అనంతరం ఆమెకు బెయిల్ కూడా నిరాకరించబడింది.ఈ ఘటనపై నర్గీస్ ఫక్రీ తల్లి న్యూయార్క్ డైలీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ' నా కూతురు ఇలాంటి తప్పు చేయదు. ఒకరిని చంపుతుందని నేను అనుకోను. ఆమెకు ఇతరులకు సహాయం చేయడం మాత్రమే తెలుసు. ఆమె కొద్దిరోజుల క్రితం దంతాలకు సంబంధించి చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె ఓపియాయిడ్లు (మత్తు మందులు) ఎక్కువగా తీసుకుంది. ఆ సమయం నుంచి ఆమెలో కొన్ని మార్పులు వచ్చాయి.' అని ఆమె తెలిపింది. నర్గీస్ ఫక్రీ బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించింది. అయితే, తెలుగులో హరి హర వీర మల్లు సినిమాలో ఆమె కనిపించనుంది. -
Nargis Fakhri: బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ బ్యూటిఫుల్ ఫొటోస్
-
ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్
రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ భామ నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్, మైన్ తేరా హీరో, అజహర్ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం దిల్లీ ఉంటోన్న ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచకుంది. తాజా ఇంటర్వ్యూకు హాజరైన భామ ముంబయిలో తనకు ఎదురైన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది. (ఇది చదవండి: హీరోయిన్‌కు అసభ్యకరంగా విష్ చేసిన హీరో.. ఏకంగా ఆ వీడియోతో! ) నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ..'ముంబయిలోని బాంద్రాలో ఓ అపార్ట్మెంట్లో నివసించేదాన్ని. మేముండే ప్రాంతం హిల్ రోడ్. మా అపార్ట్‌మెంట్‌కు సమీపంలో శ్మశానవాటిక ఉంది. అక్కడ ఉన్నప్పుడు నాకు భయంకరమైన కలలు వచ్చేవి. భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్ని. కలలో ఓ వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ.. నన్ను స్మశానవాటికకు తీసుకువెళతాడు. అక్కడ తను స్మశానవాటికలో మనుషుల ఎముకలు తీసి నన్ను తినమని చెప్పేవాడు. అలా వరుసగా నాలుగు రోజులు అదే కల వచ్చిందని. దీంతో భయంతో వణికిపోయా.' తెలిపింది. నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ.. 'అలా నాలుగు రోజులు పీడకలలు రావడంతో నాకు భయం వేసి వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి దిల్లీకి వచ్చేశా. అంతే కాకుండా నా రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని ప్యాకర్స్ నాతో చెప్పారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు అక్కడ ఏమి జరుగుతుందో నాకర్థం కాలేదు.' అంటూ ఆ భయానకమైన రోజుల గురించి చెప్పుకొచ్చింది. అందుకే ఆ ఇంటిని వదిలి దిల్లీకి వెళ్లానని నర్గీస్ ఫక్రీ తెలిపారు. న్యూయార్క్‌లో జన్మించిన బాలీవుడ్ భామ.. యూరప్, ఆగ్నేయాసియాలో పెరిగింది. బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ ) -
అలాంటి సీన్స్ చేయాలంటే నా డ్రెస్ మాత్రం తీయను: హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేస్తుండగా.. చిన్న సినిమాలు మాత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని సీన్స్ మరింత బోల్డ్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓటీటీలో వచ్చే సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఎక్కువగానే చూపిస్తున్నారని అన్నారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అయితే ఓటీటీలో అలాంటి సీన్స్ పట్ల తాజాగా తన అభిప్రాయం చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రీ. అయితే ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి ఓటీటీలో బోల్ట్ కంటెంట్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తన దుస్తులు తీసివేయనని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ.. 'నాకు నగ్నంగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ ప్రాజెక్ట్‌లోనూ నగ్నంగా నటించను. అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే తన దుస్తులు మాత్రం తీసివేయను. అంతే కాకుండా స్క్రీన్‌పై లెస్బియన్‌గా నటించడం, మరొక స్త్రీని వివాహం చేసుకున్న స్త్రీగా చూపించడం తనకు ఇష్టముండదు. నేను దానిని పట్టించుకోను కూడా. ఏ పాత్ర అయినా అది కచ్చితంగా నటనలో ఓ భాగం.' అని అన్నారు. (ఇది చదవండి: టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?) కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ కంటెంట్ చూడటం అసౌకర్యంగా అనిపిస్తోందా? అని ప్రశ్నించగా.. అది వారి వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చింది. కాగా.. నర్గీస్ ఫక్రీ త్వరలోనే పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లులో కనిపించనుంది. అంతే కాకుండా ఓటీటీల వల్ల నటీనటులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు అవకాశముందని చెప్పారు. -
సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటే గర్భవతి అని తేల్చేశారు : హీరోయిన్
రాక్‌స్టార్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నర్గీస్ ఫక్రి. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొంతకాలంగా కాశ్మీరి వ్యాపారవేత్త టోనీ బేగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఈ బ్యూటీ స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో అందరూ ప్రేమలో పడతారు. కానీ నేను సెలబ్రిటీ కావడంతో దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అంతేకాకుండా సెలబ్రిటీల శరీరాల గురించి మాట్లాడుకుంటారు. అనుకోకుండా నేను బ్రేక్ తీసుకుంటే మెటర్నిటీ లీవ్ అని తేల్చేశారు. నేను ఇండియాకు వచ్చిన కొత్తలో చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు బరువు పెరగాలని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో నేను కొంచెం బరువు పెరిగాను. అయితే కాస్త లావుగా కనిపించేసరికి నన్ను బాడీ షేమింగ్ చేశారు. నేను గర్భవతినంటూ ప్రచారం చేశారు. ఆ కామెంట్స్ నన్నెంతో బాధపెట్టాయి. ఇక నేనే రియలైజ్ అయ్యి నా ఆరోగ్యం కోసం బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా 2016లొ అజహర్ చిత్రం తర్వాత సుమారు మూడేళ్లు విరామం తీసుకున్న నర్గీస్ 2018లో మరలా 5 వెడ్డింగ్స్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. చివరగా టొర్బాజ్ సినిమాలో నటించింది. ఇందులో సంజయ్ దత్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే పవన్‌కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది. -
స్టార్‌గా వెలుగుతున్న సమయంలో సినిమాలకు బ్రేక్!
తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరోయిన్ నర్గీస్ ఫక్రి బాలీవుడ్లో స్టార్‌గా వెలిగిపోతుందనుకున్నారంతా! 'రాక్‌స్టార్' చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు కమర్షియల్ సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువలకాలం హీరోయిన్గా రాణించలేకపోయింది. దర్శకనిర్మాతల కోరిక తీర్చనందువల్లే తనకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయంటూ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకున్నట్లు వెల్లడించింది నర్గీస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ.. '2016 -2017 సంవత్సరం మధ్యలో అనుకుంటా.. ఎక్కువ పని చేస్తున్నట్లు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించింది, పైగా నా కుటుంబాన్ని, ఫ్రెండ్స్‌ను బాగా మిస్సయ్యాను. మరీ వరుసపెట్టి సినిమాలు చేస్తూ నా సంతోషానికి దూరమవుతున్నానేమో అనిపించింది. ఎలాగైనా దీనికి ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నాను. అందుకే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇలాంటి విరామాలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల జనాలు మనల్ని మర్చిపోతారనేది ఇండస్ట్రీ జనాల వాదన. అందుకే చాలామంది ఆర్టిస్టులు ఆఫర్లు రాకుండా పోతాయేమోనని భయపడుతుంటారు. నేను చెప్పొచ్చేదేంటంటే.. మీకోసం మీరు సమయం కేటాయించుకున్నప్పుడు కోల్పోయేదేమీ ఉండదు. విజయం దానంతటదే వస్తుంది' అని చెప్పుకొచ్చింది. కాగా నర్గీస్ చివరగా టొర్బాజ్ సినిమాలో నటించింది. ఇందులో సంజయ్ దత్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో 'హరిహర వీరమల్లు' చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది. చదవండి: దటీజ్ రామ్‌చరణ్: విమర్శించిన వారితోనే శభాష్ అనిపించుకున్నాడు..! -
పవర్ స్టార్ సినిమా నుంచి జాక్వెలిన్ ఔట్.. హాట్ బ్యూటీకి ఛాన్స్ !
Director Krish Clarifies About Cast Change In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్రకు మొదటగా శ్రీలంక ముద్దుగుమ్మ, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జాక్వలెన్ సమస్యల్లో చిక్కుకుంది. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకే జాక్వెలిన్‌ను పవన్ సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. 'డేట్స్ ఇష్యూ వల్లే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మా సినిమా చేయలేకపోయింది. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టమైంది. అందుకే గతేడాదే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. జాక్వెలిన్ స్థానంలో మేం నర్గిస్ ఫక్రిని ఎంపిక చేశాం. జాక్వెలిన్ ఇప్పుడు వార్తల్లో నిలిచేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు.' అని క్రిష్ తెలిపారు. పవన్ నటిస్తున్న హరి హర వీర మల్లు చిత్రంలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనుంది. ఆమె లుక్ చాలా అందంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఏఎమ్ రత్నం సినిమాను నిర్మిస్తున్నారు. -
దర్శక-నిర్మాతల కోరిక తీర్చకుంటే ఆఫర్లు రావు: నటి
కాస్టింగ్ కౌచ్ పెద్దగా ఈ పేరు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎక్కడ చూసిన ఈ పేరు బాగా వినిపిస్తోంది. మీ టూ ఉద్యమంలో భాగంగా చాలామంది నటీనటులు, హీరోయిన్లు పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ వేధింపులు తప్పవని, అవకాశాలు రావాలంటే కంప్రమైజ్ అవ్వాల్సిందేనని బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు చెప్పుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. పరిశ్రమలో తను ఎదుర్కొన్న వేధింపులు, తనకు సినిమా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. కాగా నర్గీస్ రాక్‌స్టార్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆమె బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ విజయంతో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. కానీ ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేకపోయింది. అయితే దానికి కారణం తాను కమిట్మెంట్ ఇవ్వకపోవగడమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘తొలి సినిమా భారీ విజయం సాధిస్తే ఎక్కడైన హీరోహీరోయిన్లకు ఆఫ్లరు వస్తాయి. కానీ నా విషమంలో అలా జరగలేదు. బాలీవుడ్లో రాణించాలంటే దర్శక-నిర్మాతల కోరికలను తీర్చాల్సిందే. వాళ్లు చెప్పినట్టు చేయాలి, వారికి నగ్నంగా కనిపించాలి. అలా చేయనందుకే నాకు అవకాశాలు తగ్గాయి. కొందరు బడా దర్శక-నిర్మాతలు నన్ను కమిట్మెంట్ అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో అది మనసులో పెట్టుకని నాకు ఆఫర్స్ రాకుండా చేశారు’ అంటూ ఆమె ఆరోపించింది. కాగా నర్గీస్ తన తొలి చిత్రంతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సూపర్ స్టార్ ఆఫ్ టుమారో-ఫీమేల్ కేటగిరీలో స్టార్ డస్ట్, జీ సినిమా అవార్డులు అందుకుంది. అలాగే ఈ సినిమాతో ఐఫా అవార్డు కూడా అందుకుంది. -
నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి
పారితోషికం ఎక్కువగా ఇస్తామంటే హద్దులు మీరి నటించడానికైనా రెడీ చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం తాము గీసుకున్న కట్టుబాట్లకు, విలువలకు లోబడే ఉంటారు. రాక్‌స్టార్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పదహారేళ్ల ప్రాయంలోనే మోడల్‌గా అవతరించిన ఈ ముద్దుగుమ్మ ఎదుర్కొన్న అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ ప్లేబాయ్ మ్యాగజైన్ నుంచి నర్గీస్‌కు మంచి ఆఫర్ వచ్చింది. మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం నగ్నంగా ఫొటో దిగమన్నారు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్తామన్నారు. అయితే నగ్నంగా ఫొటో దిగడానికి ఇష్టపడని నర్గీస్ ఆఫర్‌ను తిరస్కరించారు. తనకంటూ కొన్ని పరిమితులు, విలువలు విధించుకున్న ఈ భామ వాటికి తిలోదకాలివ్వనేనని వెల్లడించారు. ఇక హాలీవుడ్ కన్నా బాలీవుడ్లో స్కిన్‌షో కాస్త తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నగ్నంగా నటించడం కానీ, శృంగార భరిత సన్నివేశాల్లో చేయడం చేయకపోవడం మన చేతుల్లో ఉంటుందని, అందుకే బాలీవుడ్లో రంగప్రవేశం చేశానని తెలిపారు. కాగా నర్గీస్ వెండితెరకు పరిచయమవటానికి ముందు కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. -
రాక్స్టారిణి
‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్ ఫక్రీ మద్రాస్‌కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్–3...మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ నటించింది. ‘అమావాస్య’ సినిమాతో ఈమధ్య తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘రాక్‌స్టార్ యాక్ట్రెస్’గా పిలుచుకునే నర్గీస్ ఫక్రీ అంతరంగ తరంగాలు ఇవి... అమ్మ స్ఫూర్తితో... చాలా విషయాల్లో అమ్మే నాకు స్ఫూర్తి. ఆమె చెకోస్లోవేకియాలో పుట్టింది. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయినా ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. దీంతో దేశం విడిచి వెళ్లింది.‘రెఫ్యూజీ క్యాంప్’లో నివసించింది. న్యూయార్క్‌కు వెళ్లిన తరువాత...ఇంగ్లిష్ రాక ఇబ్బందులు పడింది. ఆమెకు తెలిసిన వృత్తి కూడా అక్కడ ఉపయోగపడలేదు. దీంతో ఒక రెస్టారెంట్లో క్లీనర్‌గా పనిచేసింది.రాత్రి రెస్టారెంట్ పని, పగలు ఇంగ్లిష్ క్లాసులకు వెళ్లేది. ‘ఇంత కష్టం అవసరమా!’ అని ఎప్పుడూ అనుకోలేదు. బాబోయ్ ఎలుగు! నా పన్నెండవ ఏట అమ్మ నన్ను సమ్మర్‌క్యాంప్‌కు పంపింది. ఇది లో–ఇన్కమ్ ఫ్యామిలీల కోసం ఏర్పాటైన క్యాంపు. టెంటులలో ఉండేవాళ్లం. ఈ క్యాంపు పుణ్యమా అని పనులు సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నాను. నీళ్లు తెచ్చుకోవడం, వంట చేయడం, ఊడ్చడం వరకు...ఎన్నో పనులు చేశాను. ఒకరోజు మా క్యాంప్‌లోకి ఒక ఎలుగు వచ్చి నానాబీభత్సం సృష్టించింది. వెంటనే తట్టాబుట్టా సర్దుకొని వేరే చోట క్యాంప్ చేశాం! సొంతకాళ్లపై... సమ్మర్‌క్యాంప్ అనుభవాలు వృథా పోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడడానికి ఉపయోగపడ్డాయి. ఇల్లు శుభ్రపరచడం, బాటిల్స్ కలెక్ట్ చేసి అమ్మడం...ఇలా చిన్నాచితకా పనులు చేసి నా చదువుకు అవసరమైన డబ్బు నేనే సంపాదించుకునేదాన్ని. చదువుకునే రోజుల్లో టీచర్ కావాలనుకున్నాను. ఆర్ట్ థెరపీ నేర్చుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. నటిని అయ్యాను. నటించాలని కానీ, నటిస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అమ్మలాగే ప్రయాణాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మోడలింగ్‌లోకి రావడం ద్వారా కొత్తప్రదేశాలు చూడటంతో పాటు డబ్బు సంపాదించే అవకాశం దొరికింది. మేలు చేసింది! కోపెన్‌హాగెన్‌లో నివసించే రోజుల్లో(2010)లో ‘రాక్‌స్టార్’ అడిషన్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ అసిస్టెంట్ సునయన నుంచి మెయిల్ వచ్చింది. ‘‘నాకు హిందీ రాదు’’ అని చేతులెత్తేశాను. కానీ ఇంతియాజ్ సుమారు ఆరుగంటల పాటు మాట్లాడి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అలా ముంబై దారి పట్టాను. ఇక్కడే హిందీ, నటన నేర్చుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాను. -
హారర్ జోనర్ సినిమాలు హిట్టే
‘‘నాకు హారర్ జోనర్ అంటే ఇష్టం. అందుకే ఆ నేపథ్యంలో చాలా సినిమాలు నిర్మించాను. హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడూ హిట్టే. సచిన్ మంచి నటుడు. తనకు చాలా వ్యాపారాలు ఉన్నా సినిమాపై ప్యాషన్‌తో నటిస్తున్నారు. ఆయన భార్య రైనా సచిన్జోషిగారు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సచిన్ జోషి, నర్గిస్ ఫక్రి జంటగా భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రైనా సచిన్‌జోషి, దీపెన్ ఆమిన్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పాటల్ని విడుదల చేశారు. సచిన్ జోషి మాట్లాడుతూ– ‘‘నేను చాలా కాలంగా హారర్ జోనర్లో ఓ సినిమా చేయాలనుకుంటన్న టైమ్‌లో భూషణ్ పటేల్ ‘అమావాస్య’ కథ చెప్పారు. ఇదొక క్లాసిక్ హారర్ మూవీ. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వి.ఎఫ్.ఎక్స్. వర్క్‌ను ఉపయోగించాం. హాలీవుడ్ స్థాయి హారర్ సినిమాని ప్రేక్షకులకు అందించాలని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మా టీం అంతా చాలా కష్టపడటం వల్లే ఈ సినిమా చాలా బాగా వచ్చింది’’ అని భూషణ్ పటేల్ అన్నారు. ‘‘మొదటిసారి ఒక హారర్ సినిమాలో నటించాను’’ అని నటుడు అలీ అస్గర్ అన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు
తన సినిమాలతో పాటు బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో బ్రేక్ అప్ వార్తలతో ఇటీవల తెగ హడావిడి చేస్తున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన లేటెస్ట్ సినిమా బాన్‌జో ప్రమోషన్ సందర్భంగా అలిసి పోయిన నర్గీస్ తరువాత రిలాక్స్ అవ్వడం కోసం అమెరికా వెల్లింది. అక్కడ షాపింగ్‌లు, టూర్లతో ఎంజాయ్ చేసిన నర్గీస్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే అమెరికాలో షాపింగ్ చేస్తున్న సమయంలో తన క్రెడిట్ కార్డ్‌కు డూప్లికేట్ తయారు చేసిన దుండగులు ఆమె అకౌంట్ నుంచి దాదాపు 6 లక్షల రూపాయలను కాజేశారట. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఈ బ్యూటి తరువాత తన కార్డ్ బ్లాక్ చేయటంతో మరింత నష్టం జరగలేదు. ఆమె కార్డు డూప్లికేట్ ను వినియోగించిన వారు ఎక్కువగా షాపింగ్ చేయటంతో సీసీ కెమరాల ద్వారా వారిని పట్టుకోవటం పెద్ద కష్టమేమి కాదన్న హామి ఇచ్చారట అమెరికా పోలీసులు. -
గాసిప్పులకు స్పందించను కానీ...
ముంబై: పెళ్లికి తాను ఒప్పుకోకపోవడం వల్లే తన ప్రియురాలు నర్గిస్ ఫక్రీ అలిగి విదేశాలకు వెళ్లిపోయిందని వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు-నిర్మాత ఉదయ్ చోప్రా తోసిపుచ్చాడు. ఇప్పటికీ తనకు ఆమె సన్నిహితురాలేనని చెప్పాడు. తాము విడిపోయారని వచ్చిన వార్తలపై ఉదయ్ స్పందించాడు. 'సాధారణంగా గాసిప్పులకు నేను స్పందించను. కానీ మీడియా ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నర్గిస్, నేను ఇప్పటికీ సన్నిహిత మిత్రులమే'నని ఉదయ్ చోప్రా స్పష్టం చేశాడు. కల్పిత వార్తలు రాయడంలో మీడియా బాగా పనిచేస్తోందని ఎద్దేవా చేశాడు. తమపై సాగుతున్న ప్రచారం అంతా అవాస్తమని కొట్టిపారేశాడు. అనారోగ్య కారణాలతో నర్గిస్ ఫక్రీ విదేశాలకు వెళ్లిందని ఆమె మేనేజర్ ఇప్పటికే తెలిపారు. -
అవన్నీ రూమర్లు: హీరోయిన్
ముంబై: తనపై వచ్చిన రూమర్లకు బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆరోగ్య కారణాలతోనే విదేశాలకు వెళ్లినట్టు ఆమె వెల్లడించింది. ప్రియుడు ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె మేనేజర్ తెలిపాడు. ఏడాది కాలంగా తీరిక లేకుండా సినిమాలు చేయడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావించినట్టు చెప్పారు. వరుసగా మూడు సినిమాల్లో నటించిందని తెలిపారు. ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, గాయాలతోనే 'అజర్' ప్రమోషన్ లో పాల్గొంటున్నారని వెల్లడించారు. దీంతో 'హౌస్ ఫుల్ 3' సినిమా నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకుని నూయార్క్ కు వెళ్లిపోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే ఆమె 'హౌస్ ఫుల్ 3' ప్రమోషన్ కు దూరమైందన్నారు. నెల రోజులు పాటు నర్గీస్ ఫక్రీ విశ్రాంతి తీసుకుంటుందని చెప్పారు. బాలీవుడ్ నుంచి ఆమె ఆకస్మికంగా మాయమవడంతో రూమర్లు వచ్చాయి. 'అజర్' సినిమాలో అజహరుద్దీన్ రెండో భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
'ఎక్స్ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇమ్రాన్ హష్మి తాజా సినిమా 'అజార్'. ఈ సినిమా ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ-నర్గీస్ ఫక్రీ మధ్య హాట్ హాట్ ముద్దుసీన్లను రెండోసారి తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ సినిమాలో అజార్ రెండో భార్య సంగీత బిజ్లానీ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడికి ఇలా రెండోసారి తెరకెక్కించడం చాలా చికాకు తెప్పించిందట. అందుకే ఎక్స్ట్రా లిప్‌లాక్ సీన్లు చేయాలంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తాను తేల్చిచెప్పినట్టు నర్గీస్ వెల్లడించింది. 'సినిమాలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని నాకు తెలియదు. ఇన్ని సీన్లు ఉండటం నాకు చికాకు తెప్పించింది. ఇందుకు ఎక్కువ చార్జ్ చేయాలనిపించింది. అందులోనూ ఎన్నో రీటేక్‌లు, రీషూట్లు ఉన్నాయి. వీటిని చేయడమంటే మాటలా' అంటూ నర్గీస్ కుండబద్దలు కొట్టింది. ముద్దుసీన్లు, ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించాలంటే తనకు చాలా ఇబ్బంది అనిపిస్తుందని ఆమె తెలిపింది. 'రాక్‌స్టార్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ 36 ఏళ్ల భామ అదే సమయంలో సహ నటుడు ఇమ్రాన్ హష్మిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతను చాలా కూల్‌గా ఉంటాడని, ఎంత ఒదిగినా ఒదిగి ఉంటాడని, చాలా ప్రొఫెషనల్ అని చెప్తోంది. -
రీలుపై... రియల్ పాత్ర వివాదం
భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితంపై ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘అజహర్’ సినిమాలో అజహరుద్దీన్ జీవితం, ఆయన మాజీ భార్య అయిన సినీ నటి సంగీతా బిజ్లానీ సహా పలువురు నిజజీవిత వ్యక్తులు పాత్రలు కనిపించడం సహజం. సంగీతా బిజ్లానీ పాత్రను వెండితెరపై నర్గిస్ ఫక్రీ పోషించనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదంగా మారింది. మొదట్లో ఈ సినిమా, అందులోని పాత్ర గురించి మాట్లాడేందుకు చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతను కలిసే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌తో తమకేమీ సంబంధం లేదని సంగీత తేల్చేశారు. తీరా ఇప్పుడు తనతో ఏ మాత్రం పోలిక లేని నర్గిస్ ఫక్రీ ఆ పాత్రను పోషించడం సంగీతకు నచ్చట్లేదని వినికిడి. దాంతో, రేపు సినిమాలో తన పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోతే ఆమె చట్టపరంగా చర్య తీసుకోవాలని భావిస్తున్నారట! అయితే, అజహరుద్దీన్ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని భావోద్వేగభరిత ఘట్టాలకు వెండితెర రూపమైన ఈ సినిమాలో నటిస్తున్నందుకు నర్గిస్ ఫక్రీ మాత్రం మహదానందపడిపోతున్నారు. వీలుంటే, త్వరలోనే సంగీతా బిజ్లానీని స్వయంగా కలవాలని కూడా భావిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో ఆమె (సంగీత పాత్ర)ను ఎంతో హుందాగా దర్శకుడు తీర్చిదిద్దారు. మా దర్శకుడు చెప్పినట్లే చేశాను. కాకపోతే, ఆమె గురించి అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం చదివాను. పరిచయస్థుల ద్వారా అజహర్, సంగీతల జీవితం గురించి తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో, ‘‘స్క్రిప్ట్‌లోని పాత్రలన్నీ నిజజీవితంలో సజీవంగా ఉన్నవారివి కాబట్టి, కచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి, కొంత భయంగా కూడా ఉంది’’ అన్నారు. మొత్తానికి, నిజజీవిత కథల మీద ఆధారపడి తీస్తున్న సినిమా అంటే, ఆ నిజజీవిత వ్యక్తులకైనా, ఈ తెర మీద నటిస్తున్నవాళ్ళకైనా అనుమానాలు, భయాలు సహజమే కదూ! -
అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్
అడల్ట్ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమే కానీ, బాలీవుడ్లో మాత్రం అలాంటి సినిమాలు చేయబోనని అంటోంది హీరోయిన్ నర్గీస్ ఫక్రీ. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్-3' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండియాలో అలాంటి సినిమాలు చేయలేనని, అమెరికా లేదా ఇతర విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరముండదని చెప్పుకొచ్చింది. అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్ కు ప్రస్తుతం బాలీవుడ్లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. 'నేను ఇక్కడ అలాంటి (అడల్ట్, సెక్స్ కామెడీ) సినిమాలు చేయబోను. ఆ విషయంలో సెన్స్ హ్యూమర్ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యుమర్ వేరే రకంగా ఉంటుంది. అమెరికాలో అయితే నేను తప్పకుండా ఆ సినిమాల్లో నటిస్తా. ఇక్కడ మాత్రం చేయను' అని నర్గీస్ తాజాగా సెలవిచ్చింది. బాలీవుడ్లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు బాగానే కాసులు కురిపించాయి. అయితే, ఇప్పటివరకు బాలీవుడ్లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతోపాటు అజారుద్దీన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న 'అజార్' సినిమాలోనూ నర్గీస్ నటిస్తోంది. -
ఆ హీరోయిన్ బరువు తగ్గిందట
ముంబయి: కొన్నికొన్ని ఆహార్ అలవాట్లు మార్చుకోవడం ద్వారా తాను అనూహ్యంగా బరువుతగ్గిపోయినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తెలిపింది. ఒక్క నెలలోనే తాను నాలుగు కేజీల బరువు తగ్గిపోయినట్లు ఈ రాక్ స్టార్ నటి వివరించింది. తనకు నచ్చని ఆహార పదార్థాలను పక్కకు పెట్టేయడం ద్వారా, ప్రతి రోజు10 వేల అడుగుల దూరం నడవడం ద్వారా తన బరువులో మార్పు వచ్చిందని, ఓ రకంగా ఇలా జరగడం వల్ల తనకు అమిత సంతోషంగా ఉందని తెలిపింది. ఇటీవల షూటింగ్ సమయంలో బాగా ఆలస్యం అయ్యేదని, ఆ సమయంలో ఫ్రెంచ్ వంటకాలు తనను అమితంగా ఆకర్షించేవని అయినా నిగ్రహంగా ఉంటూ వాటికి నో చెప్పడంతో మార్పువచ్చిందని అందరూ ఇలా తక్కువ ఆహార పదార్థాలు౮ తీసుకోవడం వల్ల నాజుకుగా తయారు కావడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని సెలవిచ్చింది. అంతేకాకుండా బట్టర్ అంతమంచిది కాదని అభిప్రాయపడింది ఈ అమ్మడు. -
ఇదే చివరి రోజు అనుకో!
‘‘జీవితం చాలా చిన్నది. ఎప్పటి దాకా ఉంటామో గ్యారెంటీ లేదు. చిన్న వయసులోనే ఇంత వేదాంతం చెబుతోందేంటని అనుకోకండి. దీనికి వయసు అవసరం లేదు. నాకు ఎదురైన అనుభవాలే పాఠాలు. అందుకే చెబుతున్నా... మన జీవితంలో ప్రతి రోజునూ ఇదే ఆఖరి రోజు అనుకోవాలి. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో చేయాలి. చేసిన తప్పులను తలుచుకుని కుమిలిపోతే లాభం లేదు. మనల్ని మనం క్షమించుకుంటేనే జీవితంలో ముందుకు సాగి విజయాలను సాధించగలం. కాకపోతే, మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి.’’ - నర్గీస్ ఫక్రీ -
నర్గీస్ ఫక్రీ.. న్యూ గెటప్!
నయా సాల్లో ఏదో ఒకటి కొత్తగా చేసెయ్యాలనీ... ప్రారంభించాలనీ ఉంటుంది. అదుకు బాలీవుడ్ భామలూ మినహాయింపేమీ కాదు. ఇండస్ట్రీ అంతా పార్టీలను విభిన్నంగా ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయడంలో మునిగిపోతే... అప్‌కమింగ్ తార నర్గీస్ ఫక్రీ మాత్రం ‘న్యూ లుక్’తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. జుత్తును షార్ట్‌గా మార్చి సరికొత్తగా కనిపిస్తున్న ఫక్రీ... తన ఆనందాన్ని నెటిజనులతోనూ పంచుకుంది. చూస్కోండంటూ నయా హెయిర్ స్టైల్ సెల్ఫీలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి అందరినీ ఆకట్టుకుంటోందీ చిన్నది. ‘కాస్త విభిన్నంగా ట్రై చేశా. నాకు నచ్చిందనే అనుకుంటున్నా’ అంటూ అర్థమయ్యీ కాని కామెంట్ ఒకటి చేసింది ఫక్రీ. -
పెళ్లి తప్పనిసరా?
మనసులో మాట విమర్శ ‘‘నీ గురించి ఫలాన విమర్శ చదివి నాకు బాధ అనిపించింది. నీకేమీ అనిపించలేదా?’’ అని కొందరు అడుగుతుంటారు. ‘‘నాకేమీ బాధ లేదు. నువ్వు బాధ పడితే నేనేమీ చేయలేను’’ అంటాను. నా సమాధానం విని ఆశ్చర్యపోతారు. మనిషి మనస్తత్వం గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. మానవమనస్తత్వంలో ప్రతి కోణం గురించి నాకు తెలుసు. మనిషికి తిండిలాగే విమర్శ కూడా కావాలి. నిన్న విమర్శించిన వారే... ఇవ్వాళ ప్రశంసిస్తారు. కాబట్టి విమర్శను గురించి తీవ్రంగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోను. వినోదం ఒంటరిగా ఉండడం కంటే స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతాను. స్నేహితులు ఉన్నచోట వినోదానికి కొదవా? నవ్వడం ద్వారా కొత్త శక్తి చేరినట్లు అనిపిస్తుంది. విహారం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాను. నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అనుకుంటాను. నేను ఏ దేశంలోనైనా ఎక్కడైనా బతకగలను. ఒక కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు నాలో కలిగే అనుభూతి మాటలకు అందనిది. ఒక చోటుకు వెళ్లిన తరువాత ‘‘నెక్స్ట్ ఎక్కడికీ?’’ అని ఆలోచిస్తూనే ఉంటాను. వివాహం వివాహం అనేది తప్పనిసరి కాదని అభిప్రాయపడుతున్నాను. పెళ్లి ప్రాముఖ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పి, పెళ్లి తరువాత రకరకాల కష్టాలతో కన్నీళ్లు కార్చే వారు ఎంతోమంది నాకు తెలుసు. ఏ జంటనైనా చూస్తే... పెళ్లి చేసుకోవాలనే ఆలోచన బలంగా కలగాలి. దురదృష్టవశాత్తు అలాంటి జంట ఒక్కటి కూడా నాకు కనిపించలేదు! పెళ్లి అవసరం లేదని అనడం లేదు, అత్యవసరం కాదు అని మాత్రం అంటున్నాను. - నర్గీస్ ఫక్రీ, హీరోయిన్ -
వరుణ్‌తో డేటింగ్ వదంతే!
బెంగళూరు: ‘మై తేరా హీరో’ సహనటుడు వరుణ్ ధావన్‌తో డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను నటి నర్గీస్ ఫఖ్రి తోసిపుచ్చింది. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు లేవంది. ‘అలా మీడియాలో వార్తలు వచ్చాయా? నేను ఇంకా చదవలేదు. అసలు దాని గురించి నాకేమీ తెలియదు’ అంది. నగరంలో ఆదివారం జరిగిన మయంత్రా హెల్ప్‌లైన్‌ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్ధమనోహరి మీడియా తీరుపై పరోక్షంగా మండిపడింది. ‘ఎటువంటి వాస్తవాలు లేకుండానే అటువంటి వార్తలు రాస్తారు. కనీసం ఒకసారి కూడా చూడని వ్యక్తితో తాను ఓ రాత్రంతా చిందులు వేసినట్టు రాస్తారు. ఇదేమీ నేరం కాకపోయినా వారికి తోచినట్టు రాస్తుంటారు. భారతీయ యువకులు అమ్మాయిలతో డేటింగ్ చేసే సమయంలో చిత్రవిచిత్రంగా ఉండనవసరం లే దు. సృజనాత్మకంగా ఉంటే సరిపోతుంది. డేటింగ్ అంటే ఏమిటనేది ముందుగా వాళ్లు కచ్చితంగా తెలుసుకోవాలి. యువతుల నుంచి ఏమీ ఆశించకూడదు. సంభాషణలను సాగించవచ్చు’ అని అంది. న్యూయార్క్‌లో ఇటీవల ఓ వ్యక్తితో ఓ రోజు గడిపానంది. అతడు తనను హోటళ్లు, నైట్‌క్లబ్‌లకు తీసుకెళ్లాడని తెలిపింది. చివరికి తనను మళ్లీ ఇంటివద్ద విడిచిపెట్టాడంది. అతను ఎవరో మీరు ఊహించగలరా అంటూ మీడియాను ప్రశ్నించింది. ఆ రోజు తనకు అత్యంత గుర్తుంచుకోదగ్గదని అంది. బాలీవుడ్లో మీ ప్రయాణం ఎలా సాగుతోందని అడగ్గా అంతా గందరగోళంగా ఉందంది. కుదుపులు ఎదురవుతున్నాయంది. అయితే జీవితం మాత్రం హాయిగా ఉందని, తానెంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. -
వరుణ్‌తో డేటింగ్ వదంతే!
‘మై తేరా హీరో’ సహనటుడు వరుణ్ ధావన్‌తో డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను నటి నర్గీస్ ఫఖ్రి తోసిపుచ్చింది. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు లేవంది. ‘అలా మీడియాలో వార్తలు వచ్చాయా? నేను ఇంకా చదవలేదు. అసలు దాని గురించి నాకేమీ తెలియదు’ అంది. నగరంలో ఆదివారం జరిగిన మయంత్రా హెల్ప్‌లైన్‌ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్ధమనోహరి మీడియా తీరుపై పరోక్షంగా మండిపడింది. ‘ఎటువంటి వాస్తవాలు లేకుండానే అటువంటి వార్తలు రాస్తారు. కనీసం ఒకసారి కూడా చూడని వ్యక్తితో తాను ఓ రాత్రంతా చిందులు వేసినట్టు రాస్తారు. ఇదేమీ నేరం కాకపోయినా వారికి తోచినట్టు రాస్తుంటారు. భారతీయ యువకులు అమ్మాయిలతో డేటింగ్ చేసే సమయంలో చిత్రవిచిత్రంగా ఉండనవసరం లే దు. సృజనాత్మకంగా ఉంటే సరిపోతుంది. డేటింగ్ అంటే ఏమిటనేది ముందుగా వాళ్లు కచ్చితంగా తెలుసుకోవాలి. యువతులనుంచి ఏమీ ఆశించకూడదు. సంభాషణలను సాగించవచ్చు’ అని అంది. న్యూయార్క్‌లో ఇటీవల ఓ వ్యక్తితో ఓ రోజు గడిపానంది. అతడు తనను హోటళ్లు, నైట్‌క్లబ్‌లకు తీసుకెళ్లాడని తెలిపింది. చివరికి తనను మళ్లీ ఇంటివద్ద విడిచిపెట్టాడంది. అతను ఎవరో మీరు ఊహించగలరా అంటూ మీడియాను ప్రశ్నించింది. ఆ రోజు తనకు అత్యంత గుర్తుంచుకోదగ్గదని అంది. బాలీవుడ్లో మీ ప్రయాణం ఎలా సాగుతోందని అడగ్గా అంతా గందరగోళంగా ఉందంది. కుదుపులు ఎదురవుతున్నాయంది. అయితే జీవితం మాత్రం హాయిగా ఉందని, తానెంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. -
వరుణ్‌తో అలాంటిదేమీ లేదు...
వరుణ్ ధావన్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా వచ్చిన కథనాలను నర్గీస్ ఫఖ్రీ తోసిపుచ్చింది. ‘ఏక్ థా హీరో’లో వరుణ్‌తో కలసి నటించిన నర్గీస్ ఫఖ్రీ, కొద్ది కాలంగా అతడితో రొమాన్స్‌లో మునిగి తేలుతోందని, ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇదివరకు కూడా తనపై ఇలాంటి కథనాలే వచ్చాయని, ఊసుపోని పాత్రికేయులు కొందరు ఇలాంటివి రాస్తుంటారని రుసరుసలాడింది. చెల్లెళ్లతో పూజాభట్ సినిమా! కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న పూజాభట్ త్వరలోనే తన చెల్లెళ్లు ఆలియా, షాహీన్‌లతో సినిమా నిర్మించాలనుకుంటోంది. తాను నటనకేమీ దూరం కాలేదని, వయసుకు తగిన పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తానని ఆమె చెబుతోంది. ఇప్పుడు తన వయసు 42 ఏళ్లని, తన తండ్రి మహేశ్‌భట్ తరహాలో ఎవరైనా కథ రూపొందించి, తనకు తగిన పాత్ర కల్పిస్తే, మళ్లీ తెరపై కనిపిస్తానని అంటోంది. స్టైలిస్ట్‌గా ఆలియాభట్ వెండితెరపై ఇప్పుడిప్పుడే సత్తా చాటుకుంటున్న ఆలియాభట్ త్వరలోనే స్టైలిస్ట్‌గానూ తన ప్రతిభ నిరూపించుకోనుంది. ఎంటీవీ చానల్ ప్రసారం చేసే డిజిటల్ షో ‘ది లుక్’ కోసం తాను స్వయంగా రూపకల్పన చేసిన హెయిర్‌స్టైల్స్‌ను పరిచయం చేయనుంది. వీడియో జాకీలు వాణి, గేలిన్లతో కలసి ఆలియా తన స్టైలిస్ట్ అవతారాన్ని ప్రదర్శించనుంది.