ఆ హీరోయిన్ బరువు తగ్గిందట
ముంబయి: కొన్నికొన్ని ఆహార్ అలవాట్లు మార్చుకోవడం ద్వారా తాను అనూహ్యంగా బరువుతగ్గిపోయినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తెలిపింది. ఒక్క నెలలోనే తాను నాలుగు కేజీల బరువు తగ్గిపోయినట్లు ఈ రాక్ స్టార్ నటి వివరించింది. తనకు నచ్చని ఆహార పదార్థాలను పక్కకు పెట్టేయడం ద్వారా, ప్రతి రోజు10 వేల అడుగుల దూరం నడవడం ద్వారా తన బరువులో మార్పు వచ్చిందని, ఓ రకంగా ఇలా జరగడం వల్ల తనకు అమిత సంతోషంగా ఉందని తెలిపింది.
ఇటీవల షూటింగ్ సమయంలో బాగా ఆలస్యం అయ్యేదని, ఆ సమయంలో ఫ్రెంచ్ వంటకాలు తనను అమితంగా ఆకర్షించేవని అయినా నిగ్రహంగా ఉంటూ వాటికి నో చెప్పడంతో మార్పువచ్చిందని అందరూ ఇలా తక్కువ ఆహార పదార్థాలు౮ తీసుకోవడం వల్ల నాజుకుగా తయారు కావడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని సెలవిచ్చింది. అంతేకాకుండా బట్టర్ అంతమంచిది కాదని అభిప్రాయపడింది ఈ అమ్మడు.