lost weight
-
98 కిలోలు ఎలా తగ్గాడబ్బా?
ముంబై: బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు గణేశ్ ఆచార్య ఏకంగా 98 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఏబీసీడీ చిత్రంలో గణేష్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అయన భారీ శరీరంతో కనిపించారు. అయితే ఆ సమయంలో ఆయన దాదాపు 200 కిలోల బరువు ఉన్నారంట. ఇటీవల ప్రముఖ కపిల్ శర్మ కామెడీ షోకు అథితిగా వచ్చిన ఆయన ఏడాదిన్న కాలంలో 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా అంత ఈజీగా జరగలేదని, ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కరోజు కూడా జిమ్ మానకుండా కఠిన కసరత్తులు చేసి తగ్గానని చెప్పుకొచ్చారు. అంతేగాక 2015లో తను నటించిన ‘హే బ్రో’ సినిమా కోసం కూడా దాదాపు 40 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కాగా బాలీవుడ్లో గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, గోవింద, అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్లకు ఆయన కొరియోగ్రాఫి అందించారు. ఈ క్రమంలో 2018లో ‘టాయ్‌లెట్’ సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు పని చేసిన ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
జీరో సైజ్‌కు త్రిష
అందం అనేది ఆకారాన్ని బట్టి కాదు. మనసును బట్టి ఉంటుందంటారు. అది నిజమే అయినా మన కథానాయికలు మాత్రం బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత నిస్తుంటారు. ఈ విషయంలో వారిని తప్పు పట్టడం భావ్యం కాదు. కారణం అభిమానులు వారి నుంచి అందాన్నే కోరుకుంటారు. అది దాటి నటి అనుష్క లాంటి అతి కొద్దిమంది మాత్రమే పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం లాంటివి శ్రమతో కూడుకున్నవి అయినా రిస్క్ తీసుకుని చేస్తుంటారు. నిజం చెప్పాలంటే ఇలాంటివి హీరోలే చేస్తుంటారు. తాజాగా చెన్నై సుందరి త్రిష జీరో సైజ్‌కు మారే ప్రయత్నంలో ఉన్నారు. ఈ బ్యూటీ ఏమంత లావు కాదు. మూడు పదుల వయసు మీద పడుతున్నా సన్నగా, నాజుగ్గానే బాడీని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. తాజాగా నటిస్తున్న నాయకి చిత్రం కోసం మరింత సన్నబడుతున్నారు. ఈ ద్విభాషా చిత్రంలో అమ్మడు లేలేత అందాల చిన్నదిగాను, 30 ఏళ్ల పైబడ్డ ప్రౌఢగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర కోసం జీరో సైజ్ అందాలతో మెరవడానికి సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గ కసరత్తులతో ఇప్పటికే మునుపటి కంటే ఐదు కిలోల బరువు తగ్గారట. ఇకపై కూడా మరింత బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
ఆ హీరోయిన్ బరువు తగ్గిందట
ముంబయి: కొన్నికొన్ని ఆహార్ అలవాట్లు మార్చుకోవడం ద్వారా తాను అనూహ్యంగా బరువుతగ్గిపోయినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తెలిపింది. ఒక్క నెలలోనే తాను నాలుగు కేజీల బరువు తగ్గిపోయినట్లు ఈ రాక్ స్టార్ నటి వివరించింది. తనకు నచ్చని ఆహార పదార్థాలను పక్కకు పెట్టేయడం ద్వారా, ప్రతి రోజు10 వేల అడుగుల దూరం నడవడం ద్వారా తన బరువులో మార్పు వచ్చిందని, ఓ రకంగా ఇలా జరగడం వల్ల తనకు అమిత సంతోషంగా ఉందని తెలిపింది. ఇటీవల షూటింగ్ సమయంలో బాగా ఆలస్యం అయ్యేదని, ఆ సమయంలో ఫ్రెంచ్ వంటకాలు తనను అమితంగా ఆకర్షించేవని అయినా నిగ్రహంగా ఉంటూ వాటికి నో చెప్పడంతో మార్పువచ్చిందని అందరూ ఇలా తక్కువ ఆహార పదార్థాలు౮ తీసుకోవడం వల్ల నాజుకుగా తయారు కావడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని సెలవిచ్చింది. అంతేకాకుండా బట్టర్ అంతమంచిది కాదని అభిప్రాయపడింది ఈ అమ్మడు.