People Said I Am Pregnant Says Nargis Fakhri After Putting on Weight - Sakshi
Sakshi News home page

Nargis Fakhri: 'సెలబ్రిటీల శరీరాల గురించి మాట్లాడతారు, ఆ కామెంట్స్‌ బాధించాయి'

Published Sat, Apr 9 2022 1:31 PM | Last Updated on Sat, Apr 9 2022 5:07 PM

People Said Im Pregnant Says Nargis Fakhri After Putting On Weight - Sakshi

రాక్‌స్టార్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రి. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో బ్రేక్‌ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొంతకాలంగా కాశ్మీరి వ్యాపారవేత్త టోనీ బేగ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఈ బ్యూటీ స్పందించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో అందరూ ప్రేమలో పడతారు. కానీ నేను సెలబ్రిటీ కావడంతో దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అంతేకాకుండా సెలబ్రిటీల శరీరాల గురించి మాట్లాడుకుంటారు. అనుకోకుండా నేను బ్రేక్‌ తీసుకుంటే మెటర్నిటీ లీవ్‌ అని తేల్చేశారు.  నేను ఇండియాకు వచ్చిన కొత్తలో చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు బరువు పెరగాలని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో నేను కొంచెం బరువు పెరిగాను. అయితే కాస్త లావుగా కనిపించేసరికి నన్ను బాడీ షేమింగ్‌ చేశారు.

నేను గర్భవతినంటూ ప్రచారం చేశారు. ఆ కామెంట్స్‌ నన్నెంతో బాధపెట్టాయి. ఇక నేనే రియలైజ్‌ అయ్యి నా ఆరోగ్యం కోసం బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది.  కాగా 2016లొ అజహర్‌ చిత్రం తర్వాత సుమారు మూడేళ్లు విరామం తీసుకున్న నర్గీస్‌  2018లో మరలా 5 వెడ్డింగ్స్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. చివరగా టొర్బాజ్‌ సినిమాలో నటించింది. ఇందులో సంజయ్‌ దత్‌, రాహుల్‌ దేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే పవన్‌కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement