అలీ అస్గర్, భూషణ్ పటేల్, సచిన్ జోషి, సి.కల్యాణ్
‘‘నాకు హారర్ జోనర్ అంటే ఇష్టం. అందుకే ఆ నేపథ్యంలో చాలా సినిమాలు నిర్మించాను. హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడూ హిట్టే. సచిన్ మంచి నటుడు. తనకు చాలా వ్యాపారాలు ఉన్నా సినిమాపై ప్యాషన్‌తో నటిస్తున్నారు. ఆయన భార్య రైనా సచిన్‌జోషిగారు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సచిన్ జోషి, నర్గిస్ ఫక్రి జంటగా భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రైనా సచిన్‌జోషి, దీపెన్ ఆమిన్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పాటల్ని విడుదల చేశారు.
సచిన్ జోషి మాట్లాడుతూ– ‘‘నేను చాలా కాలంగా హారర్ జోనర్‌లో ఓ సినిమా చేయాలనుకుంటన్న టైమ్‌లో భూషణ్ పటేల్ ‘అమావాస్య’ కథ చెప్పారు. ఇదొక క్లాసిక్ హారర్ మూవీ. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వి.ఎఫ్.ఎక్స్. వర్క్‌ను ఉపయోగించాం. హాలీవుడ్ స్థాయి హారర్ సినిమాని ప్రేక్షకులకు అందించాలని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మా టీం అంతా చాలా కష్టపడటం వల్లే ఈ సినిమా చాలా బాగా వచ్చింది’’ అని భూషణ్ పటేల్ అన్నారు. ‘‘మొదటిసారి ఒక హారర్ సినిమాలో నటించాను’’ అని నటుడు అలీ అస్గర్ అన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment