
'సాహసం'లో నర్గీస్ ఫక్రీ ఐటెం సాంగ్
బాలీవుడ్ తార నర్గీస ఫక్రీ దక్షిణాదికి వచ్చింది. ప్రశాంత్ హీరోగా తమిళంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'సాహసం'లో ఆమె ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇందులో ఆమెతో పాటు వంద మంది డాన్సర్లు పాల్గొంటారు. ఆమె నేరుగా హంగేరీ నుంచి విమానంలో చెన్నై వచ్చి ఈ షూటింగ్లో పాల్గొంటోంది. బిన్నీ మిల్స్ ప్రాంగణంలో దాదాపు వంద మంది డాన్సర్లతో కలిసి ఈ పాట షూటింగ్ జరుగుతోంది.
తెలుగులో బన్నీ నటించిన సూపర్హిట్ చిత్రం జులాయికి తమిళ రీమేక్ 'సాహసం'. ఈ సినిమాలో తన పాట షూటింగ్ అయిపోయిన తర్వాత చెన్నై వీధుల్లో సరదాగా తిరగాలని కూడా నర్గీస్ ఫక్రీ భావిస్తోంది. ఇప్పటికే ఆమె ప్రశాంత్ బంగారు నగల దుకాణానికి వెళ్లిందని, ఆయన తండ్రి త్యాగరాజన్ను కూడా కలిసిందని సినిమా వర్గాలు తెలిపాయి. తాను గత ఏడేళ్లుగా కలవని ఓ స్నేహితుడు కూడా చెన్నైలో కలిశాడంటూ ట్విట్టర్లో ఫొటోతో సహా పెట్టింది. ఈ సినిమాలో ప్రశాంత్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అరుణ్ రాజ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
Haven't seen my friend in 7 years! N I bump Into him in Chennai !!! Of all places in the... http://t.co/S19iT50drC pic.twitter.com/cVggXeyQwM
— Nargis (@NargisFakhri) July 29, 2014