
బాలీవుడ్ అత్యంత సౌకర్యవంతం: నర్గీస్ ఫక్రీ
ముంబై: హాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే తనకు అత్యంత సౌకర్యవంతంగా ఉందని హాట్ బేబీ నర్గీస్ ఫక్రీ స్పష్టం చేసింది. హాలీవుడ్ లో 'స్పై' చిత్రంతో వెండితెర ప్రవేశం చేసిన నర్గీస్.. బాలీవుడ్ లో నటించడమే తనకు బాగుందని తెలిపింది. 'నేను హాలీవుడ్ నుంచి వచ్చినా.. ఇక్కడ(బాలీవుడ్) లో చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇక బాలీవుడ్ కే ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి ఇందుకోసం ఎటువంటి ప్రణాళికలు రచించుకోలేదు. సాధ్యమైనంతవరకూ వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని.. దానికి తగిన న్యాయం చేస్తానని' నర్గీస్ పేర్కొంది.
'సంగీతం, డ్యాన్స్ రెండూ తనకు అత్యంత ఇష్టమని తెలిపింది. బాలీవుడ్-హాలీవుడ్ రెండు చోట్లా నటించినా ఇక నుంచి ఇక్కడే ఎక్కువ దృష్టి పెడతానని నర్గీస్ పేర్కొంది. ఆ దేవుని ఆశీర్వాదం వల్లే పెద్ద నటులతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇక్కడ భాషా పరంగా తనకు ఎటువంటి ఇబ్బందులేవని తెలిపింది.