హాలీవుడ్ కంటే... బాలీవుడ్డే బాగుంది..! | I'm more comfortable in Bollywood than Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ కంటే... బాలీవుడ్డే బాగుంది..!

Published Sat, Jul 12 2014 12:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

I'm more comfortable in Bollywood than Hollywood

ముంబై: హాలీవుడ్ చిత్రం ‘స్పై’తో తెరంగేట్రం చేసిన నాజూకు సుందరి  నర్గిస్ ఫఖ్రీ తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే సౌకర్యవంతంగా ఉందని చెబుతోంది. ‘హాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాల్లో నటించడమే నాకు సౌకర్యవంతంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతున్నాను. పైగా ఎన్నో విషయాలను బాలీవుడ్‌లో నటించడం ద్వారా నేర్చుకుంటున్నాను.

అందుకే నాకు ఇక్కడే బాగుంది. మరెక్కడికీ వెళ్లే ఆలోచన కూడా లేద’ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు సంగీతం, నృత్యమంటే ఎంతో ఇష్టమని, బాలీవుడ్ చిత్రాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుం దని, తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఉందని భావించడం వెనుకు ఇది కూడా ఓ కారణమని తెలిపింది.
 
ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతోపాటు బాలీవుడ్ చిత్రాలను కూడా అంగీకరిస్తున్నానని, బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వస్తుండడంపై సంతోషంగా ఉందని చెప్పింది. ఈ గుర్తింపు తనకు తానుగా తెచ్చుకున్నదని, అందుకే తన ప్రయాణం తనకెంతో గర్వంగా ఉందంది. బాలీవుడ్‌లో కొన్ని కథలు వింటున్నానని, అంగీకరించే విషయంలో తగినంత సమయం తీసుకుంటానని, తొందరపాటుగా అంగీకరించడం తనకు అటవాటు లేదని ఈ ‘రాక్‌స్టార్’ నటి చెప్పింది.

నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి పెద్దపెద్దవారితో నటించే అవకాశం దక్కిందని, ఇదంతా దేవుడి దయవల్లే జరిగిందని తెలిపింది. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘రాక్‌స్టార్’లో నటించడం, జాన్ అబ్రహాంతో కలిసి ‘మద్రాస్ కేఫ్’లో నటించడం, వరుణ్ ధవన్‌తో కలిసి ‘మై తేరా హీరో’లో నటించడం తనకు బాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు తీసుకొచ్చిందని, అందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement