రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ భామ నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్, మైన్ తేరా హీరో, అజహర్ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం దిల్లీ ఉంటోన్న ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచకుంది. తాజా ఇంటర్వ్యూకు హాజరైన భామ ముంబయిలో తనకు ఎదురైన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది.
(ఇది చదవండి: హీరోయిన్‌కు అసభ్యకరంగా విష్ చేసిన హీరో.. ఏకంగా ఆ వీడియోతో! )
నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ..'ముంబయిలోని బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేదాన్ని. మేముండే ప్రాంతం హిల్ రోడ్. మా అపార్ట్‌మెంట్‌కు సమీపంలో శ్మశానవాటిక ఉంది. అక్కడ ఉన్నప్పుడు నాకు భయంకరమైన కలలు వచ్చేవి. భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్ని. కలలో ఓ వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ.. నన్ను స్మశానవాటికకు తీసుకువెళతాడు. అక్కడ తను స్మశానవాటికలో మనుషుల ఎముకలు తీసి నన్ను తినమని చెప్పేవాడు. అలా వరుసగా నాలుగు రోజులు అదే కల వచ్చిందని. దీంతో భయంతో వణికిపోయా.' తెలిపింది.
నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ.. 'అలా నాలుగు రోజులు పీడకలలు రావడంతో నాకు భయం వేసి వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి దిల్లీకి వచ్చేశా. అంతే కాకుండా నా రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని ప్యాకర్స్ నాతో చెప్పారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు అక్కడ ఏమి జరుగుతుందో నాకర్థం కాలేదు.' అంటూ ఆ భయానకమైన రోజుల గురించి చెప్పుకొచ్చింది. అందుకే ఆ ఇంటిని వదిలి దిల్లీకి వెళ్లానని నర్గీస్ ఫక్రీ తెలిపారు. న్యూయార్క్‌లో జన్మించిన బాలీవుడ్ భామ.. యూరప్, ఆగ్నేయాసియాలో పెరిగింది. బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
(ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ )
Comments
Please login to add a commentAdd a comment