తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరోయిన్ నర్గీస్ ఫక్రి బాలీవుడ్‌లో స్టార్‌గా వెలిగిపోతుందనుకున్నారంతా! 'రాక్‌స్టార్' చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు కమర్షియల్ సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువలకాలం హీరోయిన్‌గా రాణించలేకపోయింది. దర్శకనిర్మాతల కోరిక తీర్చనందువల్లే తనకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయంటూ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకున్నట్లు వెల్లడించింది నర్గీస్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ.. '2016 -2017 సంవత్సరం మధ్యలో అనుకుంటా.. ఎక్కువ పని చేస్తున్నట్లు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించింది, పైగా నా కుటుంబాన్ని, ఫ్రెండ్స్‌ను బాగా మిస్సయ్యాను. మరీ వరుసపెట్టి సినిమాలు చేస్తూ నా సంతోషానికి దూరమవుతున్నానేమో అనిపించింది. ఎలాగైనా దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాను. అందుకే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇలాంటి విరామాలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల జనాలు మనల్ని మర్చిపోతారనేది ఇండస్ట్రీ జనాల వాదన. అందుకే చాలామంది ఆర్టిస్టులు ఆఫర్లు రాకుండా పోతాయేమోనని భయపడుతుంటారు. నేను చెప్పొచ్చేదేంటంటే.. మీకోసం మీరు సమయం కేటాయించుకున్నప్పుడు కోల్పోయేదేమీ ఉండదు. విజయం దానంతటదే వస్తుంది' అని చెప్పుకొచ్చింది. కాగా నర్గీస్ చివరగా టొర్బాజ్ సినిమాలో నటించింది. ఇందులో సంజయ్ దత్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో 'హరిహర వీరమల్లు' చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది.
చదవండి: దటీజ్ రామ్‌చరణ్: విమర్శించిన వారితోనే శభాష్ అనిపించుకున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment