
నర్గీస్ ఫక్రీ.. న్యూ గెటప్!
నయా సాల్‌లో ఏదో ఒకటి కొత్తగా చేసెయ్యాలనీ... ప్రారంభించాలనీ ఉంటుంది. అదుకు బాలీవుడ్ భామలూ మినహాయింపేమీ కాదు. ఇండస్ట్రీ అంతా పార్టీలను విభిన్నంగా ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయడంలో మునిగిపోతే... అప్‌కమింగ్ తార నర్గీస్ ఫక్రీ మాత్రం ‘న్యూ లుక్’తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. జుత్తును షార్ట్‌గా మార్చి సరికొత్తగా కనిపిస్తున్న ఫక్రీ... తన ఆనందాన్ని నెటిజనులతోనూ పంచుకుంది. చూస్కోండంటూ నయా హెయిర్ స్టైల్ సెల్ఫీలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి అందరినీ ఆకట్టుకుంటోందీ చిన్నది. ‘కాస్త విభిన్నంగా ట్రై చేశా. నాకు నచ్చిందనే అనుకుంటున్నా’ అంటూ అర్థమయ్యీ కాని కామెంట్ ఒకటి చేసింది ఫక్రీ.