
నర్గీస్ ఫక్రి
పారితోషికం ఎక్కువగా ఇస్తామంటే హద్దులు మీరి నటించడానికైనా రెడీ చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం తాము గీసుకున్న కట్టుబాట్లకు, విలువలకు లోబడే ఉంటారు. రాక్‌స్టార్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పదహారేళ్ల ప్రాయంలోనే మోడల్‌గా అవతరించిన ఈ ముద్దుగుమ్మ ఎదుర్కొన్న అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ ప్లేబాయ్ మ్యాగజైన్ నుంచి నర్గీస్‌కు మంచి ఆఫర్ వచ్చింది. మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం నగ్నంగా ఫొటో దిగమన్నారు.
దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్తామన్నారు. అయితే నగ్నంగా ఫొటో దిగడానికి ఇష్టపడని నర్గీస్ ఆఫర్‌ను తిరస్కరించారు. తనకంటూ కొన్ని పరిమితులు, విలువలు విధించుకున్న ఈ భామ వాటికి తిలోదకాలివ్వనేనని వెల్లడించారు. ఇక హాలీవుడ్ కన్నా బాలీవుడ్‌లో స్కిన్‌షో కాస్త తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నగ్నంగా నటించడం కానీ, శృంగార భరిత సన్నివేశాల్లో చేయడం చేయకపోవడం మన చేతుల్లో ఉంటుందని, అందుకే బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశానని తెలిపారు. కాగా నర్గీస్ వెండితెరకు పరిచయమవటానికి ముందు కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment