Play Boy
-
కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!
Russian Playboy Model Spends 5 Lakh For Dye Dog: గతంలో సెలబ్రిటీలు ఏం చేసినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసిన అది మీడియా ద్వారా తెలియాల్సిందే. అయితే సోషల్‌మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చేసే ప్రతీది ప్రపంచ మారుమూలాలకు వెళ్తోంది. అయితే అందులో కొన్ని నెటిజన్లకు నచ్చితే పోగడ్తలతో ముంచెత్తడం, లేదంటే విపరీతమైన ట్రోలింగ్ చేయడం సర్వ సాధారణం. తాజాగా ఓ పాపులర్ మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరికి సరదానే. కాకపోతే ధనవంతులు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా చూసుకుంటారు. రష్యాకు చెందిన ‘ప్లేబాయ్’ మోడల్ పేరు అన్నా స్టూపక్ తన తన పెంపుడు కుక్కకి ఫోటోషూట్ చేయాలనుకుంది. ఇందులో ఆమెను విమర్శించాలి పని ఏముందని అనుకుంటున్నారా?. కానీ, అమ్మడు సరికొత్తగా ఆలోచించి ఫోటోషూట్ కోసం తన కుక్క పిల్ల కలర్‌నే మార్చేసింది. దాని ఒంటి మీదున్న వెంట్రుకలకు డై చేయించింది. అలా ఓ ఫోటో షూట్ కోసం ఏకంగా ఖర్చు 5 వేల యూరోలు (రూ. 5 లక్షలు) ఖర్చు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది మూగ జీవాన్ని హింసించడమేనంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. దీంతో అన్నా తన చర్మానికి ఎలాంటి హానీ జరగకుండానే వైట్ డాగ్‌ను ఆరెంజ్ డాగ్‌గా మార్చామని బదులిచ్చింది. అయినా ఆమెపై విమర్శుల మాత్రం ఆగడం లేదు. చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ -
నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి
పారితోషికం ఎక్కువగా ఇస్తామంటే హద్దులు మీరి నటించడానికైనా రెడీ చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం తాము గీసుకున్న కట్టుబాట్లకు, విలువలకు లోబడే ఉంటారు. రాక్‌స్టార్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పదహారేళ్ల ప్రాయంలోనే మోడల్‌గా అవతరించిన ఈ ముద్దుగుమ్మ ఎదుర్కొన్న అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ ప్లేబాయ్ మ్యాగజైన్ నుంచి నర్గీస్‌కు మంచి ఆఫర్ వచ్చింది. మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం నగ్నంగా ఫొటో దిగమన్నారు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్తామన్నారు. అయితే నగ్నంగా ఫొటో దిగడానికి ఇష్టపడని నర్గీస్ ఆఫర్‌ను తిరస్కరించారు. తనకంటూ కొన్ని పరిమితులు, విలువలు విధించుకున్న ఈ భామ వాటికి తిలోదకాలివ్వనేనని వెల్లడించారు. ఇక హాలీవుడ్ కన్నా బాలీవుడ్లో స్కిన్‌షో కాస్త తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నగ్నంగా నటించడం కానీ, శృంగార భరిత సన్నివేశాల్లో చేయడం చేయకపోవడం మన చేతుల్లో ఉంటుందని, అందుకే బాలీవుడ్లో రంగప్రవేశం చేశానని తెలిపారు. కాగా నర్గీస్ వెండితెరకు పరిచయమవటానికి ముందు కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. -
ప్లే బాయ్‌గా ‘అర్జున్ రెడ్డి’..!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ యంగ్ హీరో టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గీత గోవిందంలో మరో ఘనవిజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్ మరో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. రాశీఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్ తరహా పాత్రో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
భారత్‌లో కూడా దుమ్ము రేపిన ‘ప్లేబాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని చికాగో నుంచి గత 64 సంవత్సరాలుగా వెలువడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘ప్లేబాయ్’ మేగజిన్ గురించి తెలియని వారు దాదాపు లేకపోవచ్చు. భారత్‌లో కూడా ఇది దుమ్మురేపిందని, దాని ప్రభావంతో అచ్చంగా కాక్టెయిల్, డెబనీర్లాంటి పెద్ద వారి పత్రికలు పుట్టుకొచ్చాయనే విషయం ఎందరికి తెలుసో తెలియదు. ప్రపంచంలోని ప్రముఖ నాయకులు, సినీ నటీనటులు, సాహితీవేత్తలు, కళాకారులు, కార్టూనిస్టులు, నోబెల్ అవార్డు గ్రహీతల ఇంటర్వ్యూలు, వారి రచనలు ప్రచురించిన ఘనత కూడా ఈ పత్రిక ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. (సాక్షి ప్రత్యేకం) ఆ కోవలోనే భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఇంటర్వ్యూని ఈ పత్రిక 1963లో ప్రచురించింది. జవహర్ లాల్‌ను ఆయన నివాసమైన ‘తీన్ మూర్తి హౌజ్’లో ఇంటర్వ్యూ చేసినట్లు ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ చెప్పుకున్నారు. నెహ్రూ ఇంటర్వ్యూ ప్లేబాయ్ మేగజిన్‌లో రావడంపట్ల విమర్శలు వెల్లువెత్తడంతో నాటి పీఎంవో కార్యాలయం నెహ్రూ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెహ్రూ వివిధ సందర్భాల్లో, వివిధ సమావేశాల్లో వెల్లడించిన అభిప్రాయలను క్రోడీకరించి తామే ఇంటర్వ్యూ రూపంలో ప్రచురించామని ఆ తర్వాత ప్లేబాయ్ పత్రిక వివరణ ఇచ్చుకుంది. నెహ్రూకు ముందు ప్రముఖ బ్రిటిష్ తత్వవేత్త, మేథమెటీషియన్, రచయిత, రాజకీయవాది బెర్ట్రండ్ రస్సెల్ ఇంటర్వ్యూను ప్రచురించింది. నెహ్రూ ఇంటర్వ్యూతోనే భారత్‌లో ప్లేబాయ్ పత్రిక ఒకటుందనే విషయం తెల్సింది. (సాక్షి ప్రత్యేకం) నగ్న చిత్రాలు, బికినీ భామల ఫొటోలు ఉంటాయన్న కారణంగా భారత్‌లో ఈ పత్రిక విక్రయానికి అనుమతివ్వలేదు. దాంతో దొంగచాటుగా ఈ పత్రిక ప్రతులు భారత్‌కు వచ్చేవి. ప్లేబాయ్ స్ఫూర్తితో అమెరికాలో, లండన్‌లో ప్లేబాయ్ క్లబ్బులు కూడా వచ్చాయి. వీటిని ముద్దుగా క్యాట్స్ ఐ క్లబ్‌లని పిలిచేవారు. ఇదే స్ఫూర్తితో భారత వాణిజ్య రాజధాని ముంబైలో కూడా ‘క్యాట్స్ ఐ క్లబ్’లు వెలిశాయి. ఈ క్లబుల్లో బికినీ భామలు క్లస్టమర్లకు మందు పోసేవారు. సభ్యులకు మాత్రమే ఈ క్లబ్బుల్లోకి ప్రవేశం ఉండేది. ప్రతి సభ్యుడి వద్ద క్లబ్బు డోర్‌ను తీసుకొని రావడానికి ఓ కీ కూడా ఉండేది. కొన్నేళ్లలోనే ఈ క్లబ్బులు మూతపడ్డాయి. అయితే అమెరికా, లండన్‌లోని ప్లేబాయ్ క్లబ్బులు మాత్రం 1960 నుంచి 1988 వరకు కొనసాగాయి. (సాక్షి ప్రత్యేకం) ఈ క్లబ్బుల పేరిట ‘ప్లేబాయ్ బన్నీ’ పోటీలు నిర్వహించేవారు. ఇందులో అందమైన బికినీ భామను ఆ ఏడాది ప్లేబాయ్ బన్నీగా ఎంపిక చేసేవారు. లండన్‌లో జరిగిన ఓ ప్లేబాయ్ బన్నీ పోటీలో భారత్‌కు చెందిన కటీ మీర్జా ఎన్నికయ్యారు. ఆమె భారత్‌కు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు నీరాజనాలందించారు. సన్మాన సత్కారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఆమెకు ‘కస్మే వాదే, జైల్ యాత్ర’ తదితర చిత్రాల్లో అవకాశం కూడా వచ్చింది. చికాగో నుంచి వెలువడుతున్న ప్లేబాయ్ మేగజిన్ పత్రిక 1972లో 70 లక్షల కాపీల అమ్మకాలను దాటిపోవడంతో భారత్‌లో కూడా దానికి ప్రాచుర్యం పెరిగింది. భారత్‌లో బహిరంగంగా అమ్మే అవకాశం లేకపోవడంతో అదే తరహాలో ‘కాక్టాయిల్’ అనే పత్రిక ముంబయి నుంచి వెలువడేది. కొన్ని నెలల్లోనే అది మూతపడిపోయింది. అప్పుడు ‘డెబనీర్’ పత్రిక ప్రచురణ ప్రారంభమైంది. ప్లేబాయ్ లాగానే డెబనీర్లో కూడా నగ్న భామల బొమ్మలు, సీరియస్ ఆర్టికల్స్ వచ్చేవి. పయనీర్, ఔట్లుక్లాంటి పత్రికలకు సంపాదకత్వం వహించిన వినోద్ మెహతా డెబనీర్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. కాలక్రమంలో నగ్న ఫొటోల ప్రచురణను నిలిపివేయడంతో సర్కులేషన్ బాగా పడిపోయింది. ఇదే విషయాన్ని తోటి జర్నలిస్టులు వినోద్ మెహతాను అడిగినప్పుడు ‘సర్క్యులేషన్ కోసం ప్రచురణకర్తలు నగ్న ఫొటోలు వేయమంటారు. సీరియస్ ఆర్టికల్స్‌ను ప్రచురించడంలో భాగంగానే ఇంతకాలం మేము నగ్న ఫొటోలు వేస్తూ వచ్చాం. (సాక్షి ప్రత్యేకం) సీరియల్ ఆర్టికల్స్‌కు జనాదరణ పెరగడంతో నగ్న ఫొటోలు ఇక అవసరం లేదని నిలిపేశాం. ఇలా నిలిపేసినప్పుడల్లా సర్కులేషన్ పడిపోవడం, మళ్లీ వేసినప్పుడల్లా పెరగడం మామూలై పోయింది’ అని అన్నారు. ఎన్ని సీరియస్ ఆర్టికల్స్‌ను ప్రచురించినప్పటికీ పత్రిక మనుగడ సాగించలేకపోయింది. బెర్ట్రాండ్ రస్సెల్, జాన్ పాల్ సాత్రే, మార్టిన్ లూథర్ కింగ్, ఫిడెల్ క్యాస్ట్రో, జిమ్మీ కార్టర్, సల్మాన్ రష్దీ లాంటి వారి మనస్తత్వాలను విశ్లేషించిన ‘ప్లేబాయ్’ పత్రిక మార్గరెట్ అట్వుడ్, పీజీ వుడౌజ్, హరుకి ముర్కామి, జాన్ లీ కర్రీ, ఆర్థర్ సీ క్లార్క్, జాన్ అప్డైక్, వ్లాదిమీర్ నబకోవ్లాంటి ప్రముఖ రచనలను ప్రచురించారు. (సాక్షి ప్రత్యేకం) భారత మాజీ రాష్ట్రపతి ఆర్కే నారాయణ్ రాసిన ‘గాడ్ అండ్ కాబ్లర్’ కథను కూడా ప్లేబాయ్ ప్రచురించింది. ఈ పత్రిక వ్యవస్థాపకుడు హూ హెఫ్నర్ 91 ఏట బుధవారం మరణించిన విషయం తెల్సిందే. ప్లేబాయ్ పత్రికకు నగ్నంగా ఫోజులిచ్చిన దాదాపు వెయ్యిమంది బికినీ భామలతో శృంగార జీవితాన్ని పంచుకున్న ఆయన భౌతికకాయాన్ని చివరకు అలనాటి శృంగార దేవత మార్లిన్ మన్రో పక్కనే సమాధి చేశారు. -
అతనేంటో నాకు తెలుసు
నా భర్త ఎలాంటి వారో నాకు బాగా తెలుసని సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఈమె ఆ తరువాత వైరాజావై చిత్రం చేశారు. ప్రస్తుతం స్టంట్ కళాకారుల జీవిత ఇతివృత్తంతో సినిమా వీరన్ అనే లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే విధంగా తన తండ్రి సూపర్‌స్టార్ జీవిత చరిత్రను రాసి, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించే పనిలోనూ ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఐశ్వర్య భర్త, ధనుష్ గురించి రకరకాల వదంతులు మీడి యాలో హల్చల్ చేస్తున్నాయి. ధనుష్ ప్లేబాయ్ అని, కొందరు నటీమణులతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు కలకలం పుట్టిస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి వదంతుల కారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తినట్లు, చివరకు రజనీకాంత్ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటి ప్రచారాన్ని మౌనంగా గమనిస్తూ వస్తున్న ధనుష్ భార్య, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ తన మనోగతాన్ని తేటతెల్లం చేశారు. తన భర్తపై ప్రచారం అవుతున్న వదంతులకు స్పందిస్తూ తాను డాక్టర్నో, లాయర్‌నో అయి ఉంటే ఇలాంటి వదంతులకు ఆగ్రహించుకునేదానినన్నారు. తనది సినిమా కుటుంబం అని, సినిమా గురించి తనకు పూర్తిగా తెలుసనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భర్త ధనుష్ గురించి,ఆయన ఎలాంటి వారో తనకు బాగా తెలసన్నారు. ఇలాంటి పనికిమాలిన, అసత్య ప్రచారాల గురించి పట్టించుకోవలసిన అవసరమో, బాధ పడాల్సిన పనో లేదని ఐశ్వర్య ధనుష్ స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనం. -
'ప్లే బాయ్'ను ఆపండి!