భారత్‌లో కూడా దుమ్ము రేపిన ‘ప్లేబాయ్‌’ | play boy creates sensation in in india also | Sakshi
Sakshi News home page

భారత్‌లో కూడా దుమ్ము రేపిన ‘ప్లేబాయ్‌’

Published Fri, Sep 29 2017 8:06 PM | Last Updated on Sat, Sep 30 2017 2:41 PM

play boy creates sensation in in india also

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని చికాగో నుంచి గత 64 సంవత్సరాలుగా వెలువడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘ప్లేబాయ్‌’ మేగజిన్‌ గురించి తెలియని వారు దాదాపు లేకపోవచ్చు. భారత్‌లో కూడా ఇది దుమ్మురేపిందని, దాని ప్రభావంతో అచ్చంగా కాక్‌టెయిల్, డెబనీర్‌లాంటి పెద్ద వారి పత్రికలు పుట్టుకొచ్చాయనే విషయం ఎందరికి తెలుసో తెలియదు. ప్రపంచంలోని ప్రముఖ నాయకులు, సినీ నటీనటులు, సాహితీవేత్తలు, కళాకారులు, కార్టూనిస్టులు, నోబెల్‌ అవార్డు గ్రహీతల ఇంటర్వ్యూలు, వారి రచనలు ప్రచురించిన ఘనత కూడా ఈ పత్రిక ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. (సాక్షి ప్రత్యేకం) ఆ కోవలోనే భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఇంటర్వ్యూని ఈ పత్రిక 1963లో ప్రచురించింది. జవహర్‌ లాల్‌ను ఆయన నివాసమైన ‘తీన్‌ మూర్తి హౌజ్‌’లో ఇంటర్వ్యూ చేసినట్లు ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ చెప్పుకున్నారు.

నెహ్రూ ఇంటర్వ్యూ ప్లేబాయ్‌ మేగజిన్‌లో రావడంపట్ల విమర్శలు వెల్లువెత్తడంతో నాటి పీఎంవో కార్యాలయం నెహ్రూ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెహ్రూ వివిధ సందర్భాల్లో, వివిధ సమావేశాల్లో వెల్లడించిన అభిప్రాయలను క్రోడీకరించి తామే ఇంటర్వ్యూ రూపంలో ప్రచురించామని ఆ తర్వాత ప్లేబాయ్‌ పత్రిక వివరణ ఇచ్చుకుంది. నెహ్రూకు ముందు ప్రముఖ బ్రిటిష్‌ తత్వవేత్త, మేథమెటీషియన్, రచయిత, రాజకీయవాది బెర్ట్రండ్‌ రస్సెల్‌ ఇంటర్వ్యూను ప్రచురించింది. నెహ్రూ ఇంటర్వ్యూతోనే భారత్‌లో ప్లేబాయ్‌ పత్రిక ఒకటుందనే విషయం తెల్సింది. (సాక్షి ప్రత్యేకం) నగ్న చిత్రాలు, బికినీ భామల ఫొటోలు ఉంటాయన్న కారణంగా భారత్‌లో ఈ పత్రిక విక్రయానికి అనుమతివ్వలేదు. దాంతో దొంగచాటుగా ఈ పత్రిక ప్రతులు భారత్‌కు వచ్చేవి.

ప్లేబాయ్‌ స్ఫూర్తితో అమెరికాలో, లండన్‌లో ప్లేబాయ్‌ క్లబ్బులు కూడా వచ్చాయి. వీటిని ముద్దుగా క్యాట్స్‌ ఐ క్లబ్‌లని పిలిచేవారు. ఇదే స్ఫూర్తితో భారత వాణిజ్య రాజధాని ముంబైలో కూడా ‘క్యాట్స్‌ ఐ క్లబ్‌’లు వెలిశాయి. ఈ క్లబుల్లో బికినీ భామలు క్లస్టమర్లకు మందు పోసేవారు. సభ్యులకు మాత్రమే ఈ క్లబ్బుల్లోకి ప్రవేశం ఉండేది. ప్రతి సభ్యుడి వద్ద క్లబ్బు డోర్‌ను తీసుకొని రావడానికి ఓ కీ కూడా ఉండేది. కొన్నేళ్లలోనే ఈ క్లబ్బులు మూతపడ్డాయి. అయితే అమెరికా, లండన్‌లోని ప్లేబాయ్‌ క్లబ్బులు మాత్రం 1960 నుంచి 1988 వరకు కొనసాగాయి. (సాక్షి ప్రత్యేకం) ఈ క్లబ్బుల పేరిట ‘ప్లేబాయ్‌ బన్నీ’ పోటీలు నిర్వహించేవారు. ఇందులో అందమైన బికినీ భామను ఆ ఏడాది ప్లేబాయ్‌ బన్నీగా ఎంపిక చేసేవారు.

లండన్‌లో జరిగిన ఓ ప్లేబాయ్‌ బన్నీ పోటీలో భారత్‌కు చెందిన కటీ మీర్జా ఎన్నికయ్యారు. ఆమె భారత్‌కు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు నీరాజనాలందించారు. సన్మాన సత్కారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఆమెకు ‘కస్మే వాదే, జైల్‌ యాత్ర’ తదితర చిత్రాల్లో అవకాశం కూడా వచ్చింది. చికాగో నుంచి వెలువడుతున్న ప్లేబాయ్‌ మేగజిన్‌ పత్రిక 1972లో 70 లక్షల కాపీల అమ్మకాలను దాటిపోవడంతో భారత్‌లో కూడా దానికి ప్రాచుర్యం పెరిగింది. భారత్‌లో బహిరంగంగా అమ్మే అవకాశం లేకపోవడంతో అదే తరహాలో ‘కాక్‌టాయిల్‌’ అనే పత్రిక ముంబయి నుంచి వెలువడేది. కొన్ని నెలల్లోనే అది మూతపడిపోయింది.

అప్పుడు ‘డెబనీర్‌’ పత్రిక ప్రచురణ ప్రారంభమైంది. ప్లేబాయ్‌ లాగానే డెబనీర్‌లో కూడా నగ్న భామల బొమ్మలు, సీరియస్‌ ఆర్టికల్స్‌ వచ్చేవి. పయనీర్, ఔట్‌లుక్‌లాంటి పత్రికలకు సంపాదకత్వం వహించిన వినోద్‌ మెహతా డెబనీర్‌ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. కాలక్రమంలో నగ్న ఫొటోల ప్రచురణను నిలిపివేయడంతో సర్కులేషన్‌ బాగా పడిపోయింది. ఇదే విషయాన్ని తోటి జర్నలిస్టులు వినోద్‌ మెహతాను అడిగినప్పుడు ‘సర్క్యులేషన్‌ కోసం ప్రచురణకర్తలు నగ్న ఫొటోలు వేయమంటారు. సీరియస్‌ ఆర్టికల్స్‌ను ప్రచురించడంలో భాగంగానే ఇంతకాలం మేము నగ్న ఫొటోలు వేస్తూ వచ్చాం. (సాక్షి ప్రత్యేకం) సీరియల్‌ ఆర్టికల్స్‌కు జనాదరణ పెరగడంతో నగ్న ఫొటోలు ఇక అవసరం లేదని నిలిపేశాం. ఇలా నిలిపేసినప్పుడల్లా సర్కులేషన్‌ పడిపోవడం, మళ్లీ వేసినప్పుడల్లా పెరగడం మామూలై పోయింది’ అని అన్నారు. ఎన్ని సీరియస్‌ ఆర్టికల్స్‌ను ప్రచురించినప్పటికీ పత్రిక మనుగడ సాగించలేకపోయింది.

బెర్ట్రాండ్‌ రస్సెల్, జాన్‌ పాల్‌ సాత్రే, మార్టిన్‌ లూథర్‌ కింగ్, ఫిడెల్‌ క్యాస్ట్రో, జిమ్మీ కార్టర్, సల్మాన్‌ రష్దీ లాంటి వారి మనస్తత్వాలను విశ్లేషించిన ‘ప్లేబాయ్‌’ పత్రిక మార్గరెట్‌ అట్‌వుడ్, పీజీ వుడౌజ్, హరుకి ముర్కామి, జాన్‌ లీ కర్రీ, ఆర్థర్‌ సీ క్లార్క్, జాన్‌ అప్‌డైక్, వ్లాదిమీర్‌ నబకోవ్‌లాంటి ప్రముఖ రచనలను ప్రచురించారు. (సాక్షి ప్రత్యేకం) భారత మాజీ రాష్ట్రపతి ఆర్కే నారాయణ్‌ రాసిన ‘గాడ్‌ అండ్‌ కాబ్లర్‌’ కథను కూడా ప్లేబాయ్‌ ప్రచురించింది. ఈ పత్రిక వ్యవస్థాపకుడు హూ హెఫ్నర్‌ 91 ఏట బుధవారం మరణించిన విషయం తెల్సిందే. ప్లేబాయ్‌ పత్రికకు నగ్నంగా ఫోజులిచ్చిన దాదాపు వెయ్యిమంది బికినీ భామలతో శృంగార జీవితాన్ని పంచుకున్న ఆయన భౌతికకాయాన్ని చివరకు అలనాటి శృంగార దేవత మార్లిన్‌ మన్రో పక్కనే సమాధి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement