అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి ఏటా బాలల సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా చికాగోలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా ఈ బాలల సంబరాలను ఓ సంప్రదాయంలా నాట్స్ వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తోంది.
బాలల సంబరాల్లో భాగంగా తెలుగు విద్యార్ధులకు అనేక పోటీలు నిర్వహిస్తోంది. బాలల్లో సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేలా నిర్వహించిన ఈ పోటీల్లో 150 మందికి పైగా చిన్నారులు సంస్కృతి, సృజనాత్మకతతో కూడిన ప్రదర్శనలతో తమ ప్రతిభ చూపించారు. బాలల సంబరాల పోటీల్లో తెలుగులో ఉపన్యాస పోటీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మ్యాథ్ బౌల్, ఆర్ట్ పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ ప్రదర్శనలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది.
బాలల సంబరాలకు వివిధ తెలుగు సంస్థల నుండి ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ప్రతి విభాగంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. బాలల సంబరాలను విజయవంతం చేయడంలో తోడ్పడిన సలహాదారులు, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నారులకు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్లపాటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అందరి సహకారం, కృషి, అంకితభావం వల్ల నాట్స్ బాలల సంబరాలు దిగ్విజయంగా జరిగాయని అన్నారు.చిన్నారుల్లో ప్రతిభను ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాల పోటీలు దోహద పడతాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులని అభినందించారు. బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.పోటీల్లో మహిళా జట్టు చేసిన విశేష కృషిని నాట్స్ నిర్వాహకులు ప్రశంసించారు.
తెలుగు ఉపన్యాస పోటీ నిర్వహణలో హవేళ, సిరి ప్రియ, భారతి కేశనకుర్తి మ్యాథ్ బౌల్ నిర్వహణలో చంద్రిమ దాది, ఆర్ట్ పోటీకి కిరణ్మయి గుడపాటి నృత్య ప్రదర్శనలకు బిందు, లక్ష్మి ఫ్యాన్సీ డ్రస్ పోటీల నిర్వహణ కోసం రోజా చేసిన కృషికి నాట్స్ చికాగో టీం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు-నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారుతో పాటు అంకితభావంతో పనిచేసిన వాలంటీర్ల మాధురి పాటిబండ్ల, బిందు బాలినేని, రవి బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపిలకు నాట్స్ జాతీయ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది.
బాలల సంబరాలకు సహకరించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, రాజేష్ కాండ్రు, నాట్స్ బోర్డ్ మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన తదితరులకు చికాగో నాట్స్ బోర్డు చాప్టర్ జట్టు కృతజ్ఞతలు తెలిపారు.బాలల సంబరాలకు ప్రాథమిక స్పాన్సర్ గా వ్యవహరించి, అందరికీ ఎంతో రుచికరమైన భోజనం అందించిన బౌల్ ఓ బిర్యానీ వారికి నిర్వాహకులు చికాగో నాట్స్ టీం ధన్యవాదాలు తెలిపింది.
(చదవండి: ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం)
Comments
Please login to add a commentAdd a comment