childrens day clebrations
-
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ... భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, ప్రతి ఏటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నాట్స్ లాస్ ఏంజెల్స్ బాలల సంబరాలు అత్యంత వైభవంగా అందరిని ఆకట్టుకునేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, హాస్య నాటికలు, ఫాన్సీ డ్రెస్ ప్రదర్శన, ఫ్యాషన్ షో, మాథమాటిక్స్ అండ్ చెస్ పోటీలు ఘనంగా జరిగాయి.అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన ఈ సంబరాలలో దాదాపు 900 మందికిపైగా తెలుగు వారు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఈ బాలల సంబరాల్లో 300 మందికి పైగా చిన్నారులు సంప్రదాయ, జానపద, చలనచిత్ర నృత్యాల ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆద్యంతం ఆహ్లదభరితంగా సాగిన ఈ ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలల సంబరాల్లో ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల దుస్తులు ధరించిన పిల్లలతో సాగిన ప్రదర్శన కన్నులపండుగగా ఆద్యంతం సాగింది. అదేవిధంగా ఫాన్సీ డ్రెస్ షో కూడా వివిధ ప్రముఖ పాత్రలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాట్స్ బాలల సంబరాలకు రాజ్యలక్ష్మి చిలుకూరి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఈ సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బాలల సంబరాల్లో భాగంగా ఫ్యాషన్‌తో, విద్య, సాంస్కృతిక అంశాల్లో వివిధ పోటీల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. చదరంగం, గణిత పోటీలు విద్యార్ధుల్లో నైపుణ్యాలను వెలికి తీసి వారిని ప్రోత్సహించడమే నాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ బాలల సంబరాల్లో భాగంగా గురు కృష్ణ కొంకా అండ్ రావిలిశెట్టి వెంకట నరసింహారావు లకు వారి సామాజిక , నాట్స్ సేవలను గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ తో పాటు సన్మాన పత్రాలు నాట్స్ బోర్డ్ గౌరవ సభ్యులు రవి ఆలపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మధు బోడపాటి, నాట్స్ కార్యక్రమాల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చిలుకూరితో వారికి సన్మానం చేశారు. లాస్ ఏంజిల్స్‌లో బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మల్లిన, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్స్ కిషోర్ గరికపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహార్, మెంటర్స్ హరి కొంక, వెంకట్ ఆలపాటి తదితరుల సహకారంతో ఈ బాలల సంబరాలు విజయవంతంగా జరిగాయి.బాలల సంబరాల నిర్వహణలో విశేష కృషి చేసిన లాస్ ఏంజిల్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళి ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, నాట్స్ టీం సభ్యులు గురు కొంక, శ్రీనివాస్ మునగాల, సిద్ధార్థ కోలా, అరుణ బోయినేని, శంకర్ సింగంశెట్టి, శ్రీపాల్ రెడ్డి, చంద్ర మోహన్ కుంటుమళ్ల, ముకుంద్ పరుచూరి, సరోజ అల్లూరి, పద్మ గుడ్ల, రేఖ బండారి, లత మునగాల, నరసింహారావు రవిలిశెట్టి, సుధీర్ కోట, శ్యామల చెరువు, మాలతి, నాగ జ్యోతి ముద్దన, హారిక కొల్లా, అనూష సిల్లా, హర్షవర్ధన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ ఆలపాటి, చంద్రర్క్ ముద్దనతో పాటు ఇతర వాలంటీర్లను నాట్స్ జాతీయ నాయకత్వం అభినందించింది. బాలల సంబరాలకు రుచికరమైన ఆహారాన్ని విష్ణు క్యాటరింగ్ గ్రూపుకు చెందిన రామ్ కడియాలను నాట్స్ అభినందించింది . సంబరాల ముగింపులో సాంస్కృతిక మహోత్సవం అందరికి సంతోషాలను, మధురానుభూతులను పంచింది.(చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
చికాగోలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి ఏటా బాలల సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా చికాగోలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా ఈ బాలల సంబరాలను ఓ సంప్రదాయంలా నాట్స్ వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తోంది.బాలల సంబరాల్లో భాగంగా తెలుగు విద్యార్ధులకు అనేక పోటీలు నిర్వహిస్తోంది. బాలల్లో సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేలా నిర్వహించిన ఈ పోటీల్లో 150 మందికి పైగా చిన్నారులు సంస్కృతి, సృజనాత్మకతతో కూడిన ప్రదర్శనలతో తమ ప్రతిభ చూపించారు. బాలల సంబరాల పోటీల్లో తెలుగులో ఉపన్యాస పోటీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మ్యాథ్ బౌల్, ఆర్ట్ పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ ప్రదర్శనలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. బాలల సంబరాలకు వివిధ తెలుగు సంస్థల నుండి ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ప్రతి విభాగంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. బాలల సంబరాలను విజయవంతం చేయడంలో తోడ్పడిన సలహాదారులు, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నారులకు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్లపాటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం, కృషి, అంకితభావం వల్ల నాట్స్ బాలల సంబరాలు దిగ్విజయంగా జరిగాయని అన్నారు.చిన్నారుల్లో ప్రతిభను ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాల పోటీలు దోహద పడతాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులని అభినందించారు. బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.పోటీల్లో మహిళా జట్టు చేసిన విశేష కృషిని నాట్స్ నిర్వాహకులు ప్రశంసించారు. తెలుగు ఉపన్యాస పోటీ నిర్వహణలో హవేళ, సిరి ప్రియ, భారతి కేశనకుర్తి మ్యాథ్ బౌల్ నిర్వహణలో చంద్రిమ దాది, ఆర్ట్ పోటీకి కిరణ్మయి గుడపాటి నృత్య ప్రదర్శనలకు బిందు, లక్ష్మి ఫ్యాన్సీ డ్రస్ పోటీల నిర్వహణ కోసం రోజా చేసిన కృషికి నాట్స్ చికాగో టీం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు-నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారుతో పాటు అంకితభావంతో పనిచేసిన వాలంటీర్ల మాధురి పాటిబండ్ల, బిందు బాలినేని, రవి బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపిలకు నాట్స్ జాతీయ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది.బాలల సంబరాలకు సహకరించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, రాజేష్ కాండ్రు, నాట్స్ బోర్డ్ మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన తదితరులకు చికాగో నాట్స్ బోర్డు చాప్టర్ జట్టు కృతజ్ఞతలు తెలిపారు.బాలల సంబరాలకు ప్రాథమిక స్పాన్సర్ గా వ్యవహరించి, అందరికీ ఎంతో రుచికరమైన భోజనం అందించిన బౌల్ ఓ బిర్యానీ వారికి నిర్వాహకులు చికాగో నాట్స్ టీం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం) -
స్టూడెంట్ల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
మాక్ అసెంబ్లీలో చిన్నారులతో రేవంత్
-
చిల్డ్రన్స్ డే స్పెషల్- లిటిల్ స్టార్స్ సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్టులు
-
సాక్షి మీడియా హౌస్ లో..తారే జమీన్ పర్ లిటిల్ స్టార్స్ (ఫొటోలు)
-
చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!
నెల నెలా వచ్చే చందమామ లేదు. బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు లేవు. ఇంట్లో కథలు వినిపించే వారు లేరు. స్కూళ్లలో బుక్ రీడింగ్ అవర్ కనిపించడం లేదు. పిల్లల ఊహను పెంచి ఆలోచనను పంచే బాలసాహిత్యం వారికి అందకపోతే బూస్టు, హార్లిక్సు, ఆర్గానిక్ ఆహారం ఇవి ఏమిచ్చినా ఉపయోగం లేదు. శరీరం ఎదిగే ఆహారంతోపాటు బుద్ధి వికసించే ఆహారం ఇవ్వాలి. అది కథల్లో దొరుకుతుంది. కనీసం డిజిటల్ మీడియాలోని కథలైనా వారికి చేరువ చేయాలి.ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వీటిని ‘ప్రశ్నాపంచకం’ అంటారు. ఏ మనిషి జిజ్ఞాస అయిన అడుగంటి΄ోకుండా ఉండాలంటే ఈ ఐదు ప్రశ్నల్ని సజీవంగా ఉంచుకోవాలి. పిల్లలు అనుక్షణం ఈ పంచ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. గతంలో ప్రశ్నలు అడిగే పిల్లలను తెలివైన వారుగా భావించి మెచ్చుకునేవారు. నేడు ప్రశ్నిస్తే విసుక్కుంటున్నారు. కథ చెప్పమంటే తీరిక లేదంటున్నారు. మారాం చేస్తే సెల్ చేతికిస్తున్నారు. మరీ గొడవ చేస్తే సినిమాకు పంపిస్తున్నారు. కాని వారి చేత కథ చదివించడం లేదు. దాని వల్ల పిల్లల్లో ప్రశ్నించే కుతూహలం చచ్చి΄ోతుంది. కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు. కనుక ఇది అంతిమంగా సమాజానికే నష్టం.అసలు మన సమాజంలో పిల్లలను గౌరవించడం ఉందా? వారి ఎదుగుదల గురించి చింత ఉందా?వారికి ఎలాంటి జ్ఞానం అందుతోందన్న ఆలోచన ఉందా? ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, ప్రశ్నించడం, జవాబులు వెదుక్కోవడం, సమాధానాలు సృష్టించుకోవడం ఇవన్నీ పిల్లలు నిరంతరం చేయాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం ఎంత చిన్నవయసులో అలవడితే అంత త్వరగా వాళ్ళు స్వతంత్రులవుతారు. అయితే మన దగ్గర బాలసాహిత్యంగా చలామణి అయ్యేది పూర్తిగా బాల సాహిత్యం కాదు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా శాస్త్రీయంగా ఫలానా వయసు వారు ఫలానా స్థాయి పుస్తకాలు చదవాలని వాటిని రాసి, ప్రచురించరు. ఉన్నవల్లా ఏవో కొన్ని కథలే. అయితే అవన్నా వారు చదవకుండా బాలల పత్రికలన్నీ మూతపడటం విషాదం. ఇళ్లల్లో పెద్దలు కథలు వినిపించే ఆనవాయితీ ΄ోవడం మరో విషాదం. అందుకే కనీసం పిల్లలు అలవాటు పడ్డ సెల్‌ఫోన్ ద్వారా అయినా వారికి కథలు అలవాటు చేయాలి. ఇంటర్నెట్లో పిల్లల కోసం సైట్లు, యాప్‌లు, యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా పిల్లల కోసం నిర్వహించేవి, పిల్లలకే ప్రధాన భూమికను పోషించేవిగా ఉన్నాయి. వాటిలో https://manchipustakam.inని చూడటం పిల్లలకు అలవాటు చేయాలి. ఇక్కడ మంచి బాలల పుస్తకాలు ఉంటాయి. అలాగే ttps://storyweaver.org.in/పిల్లల ఉచిత ఆన్లైన్ పుస్తకాలతోపాటు రాయడం, చదవడం, అనువదించడం పట్ల ఆసక్తి వున్న వారికి సహకరించే వేదిక. యూట్యూబ్‌లో పిల్లల కథల వీడియోలు చాలానే వున్నాయి. Geethanjali Kids&Telugu అనే యూట్యూబ్ చానల్లో 375 వీడియోలు వున్నాయి. MintuTelugu Rhymes అనే యూట్యూబ్ చానల్లో 178 కథల వీడియోలు దొరుకుతాయి. ‘పిల్లల కంటెంట్’ అనే ప్రత్యేకమైన ఆప్షన్ కూడా యూట్యూబ్ లో వుంది. పిల్లలు తమ తమ ఊహలకు కొంత సాంకేతికతను జోడిస్తే అద్భుతమైన కథల వీడియోలతో వారే ఒక చానెల్ నిర్వహించవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా అందుబాటులోకి రావడంతో రకరకాల యానిమేషన్ థీమ్స్‌తో కథలను క్రియేట్ చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చాలానే వున్నాయి. వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో తెలిపే ట్యుటోరియల్స్ కూడా వున్నాయి. ఎవరు ఏ అంశంపై వీడియోలు చేయాలన్నా, వినాలన్నా, నేర్చుకోవాలన్నాం. యూట్యూబ్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా వాటిని పొందవచ్చు. పల్లెలకు చేరుతున్న కథలుసెల్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయ్యాక నేను బాలల కథల వ్యాప్తికి దానినే సాధనంగా మలచుకున్నాను. మొదట అడుగు పెట్టింది ఫేస్బుక్లో. ఆ తరువాత వాట్సప్, ప్రతి లిపి, కహానియా.కాం, టెలిగ్రాం, ఇన్స్టాగ్రాం, డైలీహంట్, షేర్ చాట్, కూ, బ్లూపాడ్, స్టోరీ మిర్రర్.. ఇలా ప్రతిదానిలో బాలసాహిత్యాన్ని వాటి నిబంధనల మేరకు పోస్ట్ చేస్తుంటాను. ఈ మధ్య కోరాలో కొత్తగా అడుగుపెట్టాను. అంతేగాక కథలు, గేయాలు, బొమ్మలతో సామెతలు, పొడుపు కథలు సింగల్ పేజీలుగా మార్చి అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తయారు చేస్తుంటాను. వీటిని ఆర్కైవ్స్‌లో కూడా అప్లోడ్ చేశాను. కథలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని పాఠకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. అందుకే రోజూ కొంత సమయం వీటికోసం కేటాయిస్తా. మారుతున్న కాలానికి తగినట్లుగా మనమూ మారక తప్పదు. నిజానికి సామాజిక మాధ్యమాల వల్లనే కొత్త పాఠకులు విపరీతంగా పెరిగారు. నగరాలను దాటి పల్లెలకు కూడా సాహిత్యాన్ని చేర్చగలుగుతున్నా. పుస్తకాల అమ్మకాలు కూడా వీటివల్ల విపరీతంగా పెరిగాయి. అడిగి మరీ కొంటున్నారు. ‘హరి కథలు కర్నూల్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కథలను అక్కడ స్వయంగా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ‘వంద రోజులు – వంద కథలు’ వాట్సాప్ గ్రూప్‌లో కథలు పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఇందులో 38 వేల మంది సభ్యులు ఉన్నారు. – డా. ఎం.హరికిషన్, బాలల రచయిత (చదవండి: బాలల దినోత్సవం స్పెషల్: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!) -
బాలల దినోత్సవం: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!
మన భాగ్యనగరం, హైదరాబాద్ అనగానే బిర్యానీ, కేఫ్‌లు, వివిధ కమ్మని వంటకాలు ఒక్కసారిగా గుర్తొస్తాయి. అలాంటి హైదరాబాద్‌లో భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఓ బేకరీలోని బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తినేవారట. ఆయన మెనూలో తప్పనిసరిగా ఆ బేకరీ అల్పాహారం ఉంటుందట. బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ నెహ్రూ ఇష్టపడే హైదరాబాద్ బేకరీ, దాని విశేషాలు గురించి చూద్దామా..!మన భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) గారి జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లలంటే నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని బలంగా విశ్వసించేవారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. పిల్లల అభివృద్ధికి వారి సంక్షేమానికి ఎంతో కృషి చేయడంతో ఆయన పుట్టిన రోజు అయిన నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన మన భాగ్యనగరంలో మెచ్చిన బేకరీ, దాని కథాకమామీషు ఏంటో చూద్దాం.హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ల తోపాటు ఉస్మానియా బిస్కెట్లుకు ఫేమస్. ఇక్కడ లాబొనెల్ బేకరీ, కరాచీ బేకరీ వంటి అనేక రకాల బేకరీలు కూడా ప్రసిద్ధిగాంచినవే. వాటిలో మన జవహర్లాల్ నెహ్రూ అల్పాహారంలో భాగమైన బేకరీ బ్రెడ్ ఒకటి ఉంది. అదే సుభాన్ బేకరీ. దీన్ని 1948లో సయ్యద్ ఖాదర్ స్థాపించారు. ఇది ఐకానిక్ బేకరీ దమ్ కే రోట్, ఖరీస్, క్లాసిక్ ఉస్మానియా బిస్కెట్లకు పేరుగాంచింది.ఈ సయ్యద్ బేకరీ ప్రారంభించడానికి ముందు సికింద్రాబాద్‌లో బ్రిటిష్ రెజిమెంట్‌కు బ్రెడ్ సరఫరా చేసే బేకరీలో పనిచేశాడు. ఆ తర్వాత చిన్న గ్యారేజీలో బ్రెడ్ అమ్ముతూ హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌కు వెళ్లాడు. అతడి బ్రెడ్ తయారీలోని నాణ్యతకు విపరీతమైన ప్రజాదరణ రావడంతో ఖాదర్ వ్యాపారం బాగా పెరిగింది. అలా నాంపల్లిలో బేకరీని స్థాపించే స్థాయికి చేరుకున్నాడు. ఆ బేకరీకి తన కొడుకు సుభాన్ పేరు పెట్టాడు. అలా క్రమంగా ఈ సుభాన్ బేకరీ హైదరాబాద్‌లోనే నెంబర్ వన్ బేకరీగా మంచి పేరుతెచ్చుకుంది. ఔ1950వ దశకంలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సుభాన్ బేకరీలోని రొట్టెల రుచికి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఈ బ్రెడ్‌ని తన అల్పాహారంలో భాగంగా చేసుకుని ఆస్వాదించడం ప్రారంభించారు నెహ్రూ. ముఖ్యంగా మన హైదరాబాద్‌కు వస్తే తన రోజువారీ అల్పాహారంలో భాగంగా ఆ బేకరీ బ్రెడ్‌ని తీసుకురావాలని పట్టుబట్టేవారని సమాచారం. దీంతో సుభాన్ బేకరీ మరింత పేరురావడమే గాక నగరంలోని నవాబులు, ఇతర ప్రముఖులు, సెలబ్రిటీలు కస్టమర్ల అవ్వడం మొదలైంది. అయితే 1960లలో విపరీతమైన పోటీ పెరగడంతో పెద్ద బేకరీలు మార్కెట్లోకి ప్రవేశించడంతో సుభాన్ బేకరీకి పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఖాదర్ వారుసులు దీన్ని మరింత మెరుగపరిచి విభిన్నమైన రుచులతో కూడిన ఆహారపదార్థాలను అందిస్తూ ఆహార ప్రియుల మన్ననలను అందుకుంటున్నారు.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..) -
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!
ప్రపంచంలోని చిన్నారుల క్రీడా మైదానాల్లో ఇదే అతిపెద్దది. బ్రిటన్‌లో ఆనిక్ పట్టణంలోని ఆనిక్ గార్డెన్లో ఉన్న ఈ మైదానం పేరు లిలిడోరీ. ఆనిక్ కోటను ఆనుకుని ఉన్న 1300 హెక్టార్ల స్థలంలో ఆనిక్ గార్డెన్‌ను, అందులోని క్రీడామైదానాన్ని నార్తంబర్లండ్ తొలి డ్యూక్ హఫ్ పెర్సీ 1750 సంవత్సరంలో ప్రారంభించారు. ఇందులో పిల్లల వినోదానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, జారుడుబండలు, రోలర్కోస్టర్లు, చరిత్రను ప్రతిబింబించే ముప్పయి కలప ఇళ్లు, ప్రాచీన పురాణ పాత్రల శిల్పాలు వంటి ఆకర్షణలే కాకుండా, పిల్లలకు ప్రత్యేకంగా కథలు చెప్పుకొనే చోటు కూడా ఉండటం విశేషం. (చదవండి: -
కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!
చాలామంది చిన్నారులు తమ తల్లుల్లాగానే మేకప్ వేసుకోవడం, స్పాకి వెళ్లడం వంటి పనులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ పనుల్లో తల్లులను అనుకరించాలని తహతహలాడతారు. అలాంటి వారికి మార్కెట్లో చాలానే డివైస్‌లు, కిట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. హెయిర్ స్టైల్స్ మెషిన్స్ మ్యానిక్యూర్– పెడిక్యూర్ కిట్స్, మేకప్ బాక్సెస్ ఇలా చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దామా?చిత్రంలోని ఈ కిట్ వెంట ఉంటే.. చిన్నారులంతా తమ చేతులను, కాళ్లను అందంగా మార్చుకోవచ్చు. ఫుట్ స్పా బాత్ సెట్, ఐ మాస్క్, నెయిల్ ఫ్యాన్ డ్రైయర్, వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్, మసాజ్ స్టోన్స్, గ్లిట్టర్ పౌడర్ ఇలా చాలానే ఈ కిట్‌లో లభిస్తాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఇది బెస్ట్ బహుమతి అవుతుంది. ఈ కిట్ ఇంట్లో ఉంటే చిన్నారులకు ఇంట్లోనే స్పా ఫీలింగ్ కలుగుతుంది. ఈ కిట్‌తో పిల్లలే చక్కగా నెయిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, కాళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా తమ అందాన్ని తామే కాపాడుకుంటూ మెరిసిపోవచ్చు.మీ లిటిల్ ప్రిన్సెస్‌కి ఈ కిట్‌ని కొనిచ్చేస్తే.. వారి మేకప్ వారే వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇందులో బ్రష్‌లు, ఐ షాడోస్, బ్లష్‌లు, లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ స్టిక్కర్స్, ప్రత్యేకమైన కిరీటం, హెయిర్ యాక్సెసరీస్ వంటివి చాలానే ఉంటాయి. మందపాటి మృదువైన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కిట్‌ను తేలికగా ఓపెన్, క్లోజ్ చేసుకోవడానికి జిప్ ఉంటుంది. ఇలాంటి కిట్స్ ఆన్లైన్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీపైన, వినియోగించే తీరుపైన రివ్యూస్ చదివి చేసుకుంటే మంచిది. చిత్రంలోని ఈ డై హెయిర్ టూల్ బోలెడన్ని జడలల్లేస్తుంది. కొత్తకొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసే అవకాశాన్నిస్తుంది. ఈ ‘రియలిస్టిక్ డై రోప్ హెయిర్ బ్రైడర్’ అందంగా క్యూట్‌గా కనిపించేందుకు రకరకాల హెయిర్ స్టైల్స్‌ను అందిస్తుంది. ఈ డివైస్ సెట్లో నాణ్యమైన ఎలక్ట్రానిక్ బ్రెయిడింగ్ మెషిన్, హెయిర్ రబ్బర్లు, ఒక దువ్వెన, హెయిర్ స్ప్లిటర్, బ్రెయిడింగ్ మెషిన్లో ఉపయోగించే త్రీ హుక్స్, వివిధ హెయిర్ యాక్సెసరీలు ఉంటాయి. దీన్ని పిల్లలకు బహుమతిగా అందివ్వొచ్చు. ఇలా తేలికగా పిల్లలు వారి జడలను వారే వేసుకునేలా మార్కెట్లో చాలా మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి.(చదవండి: చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..) -
May-5: 'జపాన్‌లో బాలల దినోత్సవం'! ఎలా జరుగుతుందో తెలుసా!
జపాన్‌లో బాలల దినోత్సవం ఏటా మే 5న జరుగుతుంది. జపాన్ రాచరిక సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఐదు వార్షిక ఉత్సవాలలో ఇది ఒకటి. జపాన్‌లో దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు. జపాన్‌లో బాలల దినోత్సవం పన్నెండో శతాబ్దిలో పరిపాలించిన కమకురా వంశస్థుల హయాం నుంచి జరుగుతూ వస్తోంది.తొలినాళ్లలో బాలల దినోత్సవాన్ని ఏటా చాంద్రమానం ప్రకారం ఐదో నెలలోని పున్నమి తర్వాత వచ్చే ఐదో రోజున జరుపుకొనేవారు. తర్వాత పంతొమ్మిదో శతాబ్ది నుంచి ఈ వేడుకను గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఏటా మే 5న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలో ఊరూరా ఆరుబయట ఎత్తుగా నిలిపిన స్తంభాలకు కట్టిన దండాలకు చిత్ర విచిత్రమైన రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. వీటిని ‘కొయినొబొరి’ అంటారు.అలాగే, ఇంటింటా బయటి ఆవరణల్లో గాని, పెరటి స్థలాల్లోగాని నిలిపిన స్తంభాలకు సంప్రదాయకమైన ‘నొబోరి’, ‘ఫుకునుకె’ జెండాలను ఎగురవేస్తారు. బహిరంగ వేదికల మీద సమురాయ్ బొమ్మలను ప్రదర్శనతో పాటు చిన్నారుల విచిత్ర వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జనాలు ఆరుబయట విందుభోజనాలు చేస్తారు.ఈ విందుభోజనాల్లో ఓక్ ఆకుల్లో చుట్టిన రెడ్బీన్స్ జామ్ నింపిన బియ్యప్పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించిన వంటకం ‘కషివామొచి’, గంజితో తయారు చేసే మద్యం ‘సాకె’లను తప్పనిసరిగా వడ్డిస్తారు. ఓక్ ఆకులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ వేడుకల్లో ఓక్ ఆకుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.ఇవి చదవండి: రేటే 'బంగారమాయెనే!' -
బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
-
అప్పట్లో బాలల దినోత్సవం అంటే అలా ఉండేది..ఆరోజులే వేరు
అప్పట్లో పండగలంటే పంద్రా ఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగు అనే బాలల దినోత్వవమేగా ! అదిగదిగో, తెల్లవారుఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. ఇంట్లో వాళ్ళు పొయ్యి మీద డేగిశా నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి. అప్పటికీ అక్కడికీ చేరిన ఇరుగూ పొరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు ఒకరికొకరు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు ముందుగా తమ తమ యూనిఫాంలు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. "కొండలా కూచుంది ఎంతకీ తరగనంది ఏందిరో వింత గొడవా అనే పాట అప్పుడు తెలీకపోయినా పాడుకునే ఉంటాము ఇస్త్రీ చెయ్యవలసిన ఆ బట్టల కొండనీ చూసి ఆ జాతీయ పండగలకు దగ్గర్లో ఏ శుభకార్యం వచ్చినా, పిల్లల పుట్టిన రోజు వచ్చినా పనిలో పని అని , కలిసి వస్తాయి స్కూల్ డ్రెస్సు లే కుట్టించేవారు ఇంట్లో పెద్దలు. స్కూల్ డ్రస్సే కదాని చిన్న చూపేమీ లేదు మాకు, కొత్త తెల్ల అంగి, బ్లూ నిక్కర్ డ్రస్ వేసుకుని బడికి వెల్లడం ఎంత దర్జా ఒలకబోసే పని.చాచా నెహ్రూ పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, బాలల దినోత్సవం అంటే మాత్రం ప్రతి బాలబాలికల యొక్క రెండో పుట్టిన రోజని మాత్రం ఖచ్చితంగా తెలుసు. బిలబిల్లాడుతూ దారివెంట గలగలల కబుర్లు నడిచేవి. పుయ్యిమని మా PET సుందరం సార్ విజిల్ మోతతో కబుర్లన్నీ అఠెన్షన్ మూసి పెట్టి కాలికి కాలు, చేతుకి చేతులు దగ్గరగా చేర్చి విధ్యార్థులు వరుసలు కట్టిన మా బాలల జాతికి మా హెడ్మాస్టర్ హనీఫ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చేవారు, విద్యార్థి వరుసల మధ్యలో క్లాస్ లీడర్లు, కండపుష్టి, దబాయింపు తెలిసిన కుర్రాళ్ళు వచ్చి మా అరచేతుల్లో పంచి పెట్టే నెయ్యి చాక్లెట్ తిని మళ్ళీ హానీఫ్ గారి ప్రసంగానికి అంకితం అయ్యేవాళ్ళం. బాగా చదివే పిల్లలకు, బాగా పరిగెత్తే పిల్లలకు, ఖోఖో,కబాడి ఇత్యాది మల్లయుద్దాలు ఆడే పిల్లలకు, క్రమం తప్పకుండా బడికి హజరయ్యే వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. స్టేజీ మీద పాటలు పాడి కొంతమంది రంజింపజేసేవారు, ఇంకొంతమంది అయ్యామే డిస్కో డాన్సర్ ’ అనీనూ, ’ఒలమ్మీ తిక్క రేగిందా ’ అని కూడాను స్టెప్పులు వేసేవారు. వారికి బహుమతులతో పాటు చొక్కాలకు రూపాయి నోట్లు పిన్నీసు పెట్టి తగిలించేవారు. విజిళ్ళు వేసీ , చప్పట్లు చరిచి ఎంకరేజింగ్ కూడానూ. పదేళ్ల పాటు సాగిన నా బడి బ్రతుకులో నాకు కాసింత అబ్బిన చిత్రకళకు చోటు ఎప్పుడూ దొరకలేదు,ఏనాడు స్టేజి ఎక్కి ఇదిగో బొమ్మకు ఈ బహుమతి అని అందుకున్నది లేదు. అది ఈ రోజుకూ లేదనుకో. అయినా బొమ్మలు వేసినందుకు బడిలో తన్నకపోవడమే మహద్భాగ్యం. ఇంకా పురస్కారాలు కూడానా? ఆశకు అంతుందా ఎక్కడయినా ? పిల్లల పండగ వస్తుందనగానే పిల్లలందరం కలిసి తలా ఇంతా ఇంతా చిల్లర డబ్బులు వేసుకుని క్లాసు రూములకు సున్నాలు కొట్టి, ఝండాలు కట్టి, నల్ల బల్లలకు బుడమాకు-బొగ్గు కలిపిన సింగారం చేసి, తరగతి గది ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల ముగ్గులు చిత్రించి అవి చూసుకోవడానికి ఇంతింత కళ్ళయ్యేవాళ్లం. బడి లోపలి గోడల మీద నేను వేసిన చాచా నెహ్రూ కోటు మీది గులాబి పువ్వుని అందుకుని అమ్మాయిలు జడల్లొ తురుముకునేవారు. అదీ ఒక పురస్కారం వలెనే అని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసినా లాభం లేదు. అప్పుడు మా నూనెపల్లేలో ఉన్నట్లు ఇప్పుడు ఏ పల్లె పాఠశాలల్లో కూడా బడి పాకలు ఉన్నట్టు లేవు, చెట్టు కింద తరగతులు నడుస్తున్నట్టు కానరావు, క్లాస్ ముగియగానే నిక్కర్ల వెనుక దుమ్ము దులుపుకుంటు మగపిల్లలు పైకి లేస్తే , లంగాలు విదిలించుకుంటూ ఆడపిల్లలు నిలబడేవారు, వారి వడి నిండా క్లాసుల తరబడి గంటలుగా వింటూ వింటూ తిన్న పొద్దుతిరుగుడు, కర్బూజా విత్తనాల పొట్టు తెల్లగా రాలేది క్లాసుల నిండా. ఆ రాలినదల్లా విత్తనాల పొట్టు మాత్రమే కాదని అవి నా భవిష్యత్తు లో తలుచుకోబోయే జ్నాపకాల పూల చినుకులని ఇప్పడు తెలుస్తుంది. బాల్యం చెదిరి, వయసు ముదిరి ఇప్పుడు ఆ రాశిని రెండు చేతులా ఎత్తి పట్టుకుని "ఏవి తల్లి! నిరుడు కురిసిన ఆ హిమసమూహములు?" అంటున్నారు సాహిత్య వాళ్ళు.నూనెపల్లె వాళ్ళకు హిమము ఎక్కడిదిరా? అవి కర్బూజా గింజెల పొట్టురా నాయనా. ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి వెళితే అవన్నీ అక్కడే ఉన్నాయిరా, ఇంకా ఈత గింజలూ, రేగు గింజలు, సీతా ఫలం గింజలు, ఉసిరికాయ గింజలూ, రంగు జండాలు, బాలలదినోత్సవమునూ, చాచా నెహ్రూ నూ. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
డాలస్: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా బాలల సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా తెలుగు చిన్నారుల్లోని ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులను రెండు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.. సత్య శ్రీరామనేని, రవికుమార్ తాండ్ర, రవీంద్ర చుండూరు, శ్రీనాథ్ జంధ్యాల ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డి వి ప్రసాద్, జ్యోతి వనం, తేజ వేసంగి, డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, మణిధర్ గూడవల్లి, స్వప్న కాట్రగడ్డ, శ్రీధర్ న్యాలమడుగుల, నాగిరెడ్డి, శ్రీనివాస్ ఉరవకొండ, గౌతమ్ కాసిరెడ్డి, పార్ధ బొత్స, కృష్ణ వల్లపరెడ్డి, సురేంద్ర ధూళిపాళ్ల, యువ నిర్వాహకులు నిఖిత దాస్తి, యశిత చుండూరు, రేహాన్ న్యాలమడుగుల, ప్రణవి మాదాల తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, ప్రేమ్ కలిదిండి పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారులు బాపూజీ జంధ్యాల చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు)ని అభినందించారు. గత పన్నెండు సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ డల్లాస్ విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తన సందేశం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ నిర్వాహకులు పిల్లలకు లక్కీ డ్రా నిర్వహించి కొన్ని బహుమతులను అందించారు. (క్లిక్ చేయండి: ఘనంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్) -
ఘనంగా బాలల దినోత్సవం
-
ఘనంగా చిల్డ్రన్స్‌డే వేడుకలు