Children's Day Celebrations by North America Telugu Society in Dallas
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

Nov 16 2022 2:15 PM | Updated on Nov 16 2022 3:39 PM

childrens day celebrations in dallas by North America Telugu Society - Sakshi

డాలస్‌: అమెరికాలో  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా   బాలల సంబరాలు  ఘనంగా జరిగాయి.  ప్రతి ఏటా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా తెలుగు చిన్నారుల్లోని ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది.

దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులను రెండు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.. 

సత్య శ్రీరామనేని, రవికుమార్ తాండ్ర, రవీంద్ర చుండూరు, శ్రీనాథ్ జంధ్యాల ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డి వి ప్రసాద్, జ్యోతి వనం, తేజ వేసంగి, డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, మణిధర్ గూడవల్లి, స్వప్న కాట్రగడ్డ, శ్రీధర్ న్యాలమడుగుల, నాగిరెడ్డి, శ్రీనివాస్ ఉరవకొండ, గౌతమ్ కాసిరెడ్డి,  పార్ధ బొత్స, కృష్ణ వల్లపరెడ్డి, సురేంద్ర ధూళిపాళ్ల, యువ నిర్వాహకులు నిఖిత దాస్తి, యశిత చుండూరు, రేహాన్ న్యాలమడుగుల, ప్రణవి మాదాల తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, ప్రేమ్ కలిదిండి పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారులు బాపూజీ జంధ్యాల చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు)ని అభినందించారు. గత పన్నెండు సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ డల్లాస్ విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తన సందేశం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ నిర్వాహకులు పిల్లలకు లక్కీ డ్రా నిర్వహించి కొన్ని బహుమతులను అందించారు. (క్లిక్ చేయండి: ఘనంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement