ఇమ్మిగ్రేషన్ అంశాలపై నాట్స్ వెబినార్ | NATS Dallas chapter conducts immigration webinar | Sakshi
Sakshi News home page

ఇమ్మిగ్రేషన్ అంశాలపై నాట్స్ వెబినార్

Published Wed, May 6 2020 9:32 AM | Last Updated on Wed, May 6 2020 9:42 AM

NATS Dallas chapter conducts immigration webinar - Sakshi

డల్లాస్ : కరోనా దెబ్బకు అమెరికాలో వలసదారులపై నిబంధనలు కఠినతరం చేస్తుండటంతో అమెరికాలో ఉండే ప్రవాస భారతీయుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అమెరికాలో ఇమిగ్రేషన్ అంశాలపై వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో ఎవరిపై కొత్త నిబంధనలు ప్రభావం చూపుతాయి..? అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్ధుల భవితవ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? వర్క్, డిపెండెంట్,ఈఏడీ, విజిటర్ గ్రీన్ కార్డు, ఫ్యామిలీ బేస్డ్ వీసాల విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయనే అంశాలపై ఈ వెబినార్ ద్వారా అవగాహన కల్పించారు.

కోడెం లా ఫర్మ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లాయర్ శారదా కోడెంతో నాట్స్ ఈ వెబినార్ ఏర్పాటు చేసింది. దాదాపు  రెండు గంటల పాటు సాగిన ఈ వెబినార్‌లో భారతీయులు, వారికున్న ఇమ్మిగ్రేషన్ సంబంధిత సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కోవిడ్-19 ప్రభావం ఇమ్మిగ్రేషన్లపై ఎలా ఉండనుంది? అన్ని రకాల సంబంధించిన వీసాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై శారదా అవగాహన కల్పించారు. ఇప్పుడున్న పరిస్థితులకు ఎలాంటి నిర్ణయాలు ఎంచుకోవాలి..? ప్రస్తుత ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై విశ్లేషణతో పాటు అది నాన్ ఇమ్మిగ్రేన్ట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది...?  నాన్ ఇమ్మిగ్రేన్ట్స్ ఎవరైనా ఉద్యోగం కోల్పోతే నిరుద్యోగ భృతి పొందటానికి గల అవకాశాలు ఉన్నాయా..? అమెరికా కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థుల వీసాలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అలానే ఇక్కడ వీసాలపై ఉన్న భారతీయలు స్టిములస్ ప్యాకేజీకి అర్హులా కాదా ? అమెరికా ప్రభుత్యం ఇటీవల పంపించిన స్టిములస్ చెక్‌లను డిపాజిట్ చేయవచ్చా లేదా? ఇలాంటి అనేక 66 ఇమ్మిగ్రేషన్ ప్రశ్నలకు శారదా కోడెం సమాధానాలు ఇచ్చారు.

నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డు డైరెక్టర్ కిషోర్ వీరగంధం ఈ వెబినార్‌కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వెబినార్‌లో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు సమాధానాలందించడంలో వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విజయ శేఖర్ అన్నే వెల్లడించారు. జూమ్ యాప్ ద్వారా 300 మంది, ఫేస్‌బుక్ ద్వారా మరికొందరు ఈ వెబినార్‌లో పాల్గొన్నట్లు కిషోర్ వీరగంధం తెలిపారు.

నాట్స్ డల్లాస్ టీం ఏర్పాటు చేసిన ఈ వెబినార్ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ అఫ్ డైరెక్టర్ కిషోర్ కంచర్ల, నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ అశోక్ గుత్తా, విజయ్ వర్మ కొండా ఈ వెబినార్ నిర్వహణ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ వెబినార్ నిర్వహణకు సహకారం అందించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తదితరులకు నాట్స్ డల్లాస్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement