డల్లాస్ : అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో కరోనాపై పోరాడే వారికి తమ వంతు సహాయం చేస్తుంది. తాజాగా డల్లాస్‌లోని అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ ఉచితంగా ఆహార పంపిణీ చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి ఆహార పంపిణీ చేసే ప్రతిపాదనకై స్థానిక అగ్నిమాపక అధికారి జాన్సన్‌ను కలిసి ఆహార ప్రతిపాదన పెట్టారు. దీనికి జాన్సన్ అంగీకరించడంతో 50 మంది సిబ్బందికి నాట్స్ ఆహార పంపిణీ చేసింది. నాట్స్ సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఫైర్ స్టేషన్ కెప్టెన్ జాన్సన్ ప్రశంసించారు. ఆహార పంపిణీలో పాల్గొన్న నాట్స్ సభ్యులందరిని నాట్స్ నాయకత్వం అభినందించింది.
Comments
Please login to add a commentAdd a comment