డల్లాస్ : అమెరికాలో తెలుగు జాతికి తమ విశిష్ట సేవలతో దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో డాలస్ చాప్టర్ బాలల సంబరాలు కన్నుల పండగగా నిర్వహించారు. నవంబర్ 30న జరిగిన ఈ ఈవెంట్‌కు కూడి అకాడమీ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఇక ఈ వేడుకలు నిర్వహించడం ఇది తొమ్మిదవసారి. ఇప్పటి వరకు వరుసగా ఎనిమిది సంవత్సరాలు బాలల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ బాలల సంబరాల్లో వందలాది చిన్నారులు తమ ప్రతిభ చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా డాలస్ చాప్టర్ కార్యదరి అశోక్ గుత్తా, కిషోర్ వీరగంధం వ్యవహరించారు. దాదాపు పన్నెండు గంటల పాటు జరిగిన ఈ వేడుకలో భారత దేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 150 మంది చిన్నారులు గణితం, చదరంగంతోపాటు తెలుగు పదకేళి పోటీలలో ఎంతో ఉత్సాహాంతో పాల్గొన్నారు. సాఫ్ట్ స్కూల్స్ తరపున గూడవల్లి మణిధర్ పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. యుఎస్‌సీఎఫ్, స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 90 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ డాలస్ చాప్టర్ బహుమతులు అందించింది. విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంపొందించి వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తోందని నాట్స్ ఉపాధ్యక్షులు శేఖర్ అన్నే తెలిపారు. నాట్స్ చేసే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించి అందరిని భాగస్వామ్యులు కావాల్సిందిగా ఆయన కోరారు.
ఇతర వక్తలు మాట్లాడుతూ ప్రవాసాంద్రుల పిల్లల కొరకు నాట్స్ చేస్తున్ని సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి డాలస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి మండల, ప్రేమ్ కలిదిండి, భాను లంక, కృష్ణ వల్లపరెడ్డి, శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, దేవీప్రసాద్, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు,వెంకట్ కొయలముడి ఇతరులు పూర్తి సహయ సహకారాలు అందించి తోడ్పడ్డారు. అలాగే నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానిక సాఫ్ట్ స్కూల్స్.కామ్, స్పా ర్కల్స్, బావార్చి బిర్యానీ పాయింట్‌తో పాటు స్థానిక సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment