చాలామంది చిన్నారులు తమ తల్లుల్లాగానే మేకప్ వేసుకోవడం, స్పాకి వెళ్లడం వంటి పనులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ పనుల్లో తల్లులను అనుకరించాలని తహతహలాడతారు. అలాంటి వారికి మార్కెట్‌లో చాలానే డివైస్‌లు, కిట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. హెయిర్ స్టైల్స్ మెషిన్స్ మ్యానిక్యూర్– పెడిక్యూర్ కిట్స్, మేకప్ బాక్సెస్ ఇలా చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దామా?
చిత్రంలోని ఈ కిట్ వెంట ఉంటే.. చిన్నారులంతా తమ చేతులను, కాళ్లను అందంగా మార్చుకోవచ్చు. ఫుట్ స్పా బాత్ సెట్, ఐ మాస్క్, నెయిల్ ఫ్యాన్ డ్రైయర్, వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్, మసాజ్ స్టోన్స్, గ్లిట్టర్ పౌడర్ ఇలా చాలానే ఈ కిట్‌లో లభిస్తాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఇది బెస్ట్ బహుమతి అవుతుంది. ఈ కిట్ ఇంట్లో ఉంటే చిన్నారులకు ఇంట్లోనే స్పా ఫీలింగ్ కలుగుతుంది. ఈ కిట్‌తో పిల్లలే చక్కగా నెయిల్స్‌ని క్లీన్ చేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, కాళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా తమ అందాన్ని తామే కాపాడుకుంటూ మెరిసిపోవచ్చు.
మీ లిటిల్ ప్రిన్సెస్‌కి ఈ కిట్‌ని కొనిచ్చేస్తే.. వారి మేకప్ వారే వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇందులో బ్రష్‌లు, ఐ షాడోస్, బ్లష్‌లు, లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ స్టిక్కర్స్, ప్రత్యేకమైన కిరీటం, హెయిర్ యాక్సెసరీస్ వంటివి చాలానే ఉంటాయి. మందపాటి మృదువైన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కిట్‌ను తేలికగా ఓపెన్, క్లోజ్ చేసుకోవడానికి జిప్ ఉంటుంది. ఇలాంటి కిట్స్ ఆన్‌లైన్‌లో చాలానే అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీపైన, వినియోగించే తీరుపైన రివ్యూస్ చదివి చేసుకుంటే మంచిది.
చిత్రంలోని ఈ డై హెయిర్ టూల్ బోలెడన్ని జడలల్లేస్తుంది. కొత్తకొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసే అవకాశాన్నిస్తుంది. ఈ ‘రియలిస్టిక్ డై రోప్ హెయిర్ బ్రైడర్’ అందంగా క్యూట్‌గా కనిపించేందుకు రకరకాల హెయిర్ స్టైల్స్‌ను అందిస్తుంది. ఈ డివైస్ సెట్‌లో నాణ్యమైన ఎలక్ట్రానిక్ బ్రెయిడింగ్ మెషిన్, హెయిర్ రబ్బర్లు, ఒక దువ్వెన, హెయిర్ స్ప్లిటర్, బ్రెయిడింగ్ మెషిన్‌లో ఉపయోగించే త్రీ హుక్స్, వివిధ హెయిర్ యాక్సెసరీలు ఉంటాయి. దీన్ని పిల్లలకు బహుమతిగా అందివ్వొచ్చు. ఇలా తేలికగా పిల్లలు వారి జడలను వారే వేసుకునేలా మార్కెట్‌లో చాలా మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి.
(చదవండి: చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..)
Comments
Please login to add a commentAdd a comment