చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం! | NATS Highway Adoption Program Held By NATS Chicago | Sakshi
Sakshi News home page

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!

Published Thu, Sep 19 2024 10:12 AM | Last Updated on Thu, Sep 19 2024 10:12 AM

NATS Highway Adoption Program Held By NATS Chicago

అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగు వారిలో సామాజిక బాధ్యత పెంచేలా హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో నాట్స్ దత్తత తీసుకున్న హైవే (రూట్.59 స్ట్రీట్) లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైవే పక్కన చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు అక్కడ పచ్చదనాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టింది. 

అమెరికాలో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేందుకు హైవే దత్తత లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. నాట్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అక్కడ ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. విద్యార్థుల సేవా సమయానికి గుర్తింపు ఇస్తుంది. విద్యార్థి దశ నుంచే సేవ చేయాలనే సంకల్పాన్ని కలిగించేందుకు నాట్స్ చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని తీసుకుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన విద్యార్ధులను, నాట్స్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన చికాగో చాప్టర్ సమన్వయకర్తలు  నరేందర్  కడియాల, వీర తక్కెళ్లపాటి లను అందరూ ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చికాగో చాప్టర్ సభ్యులు హవిల మద్దెల, చంద్రిమ దాడి, చెన్నయ్య కంబల, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, వినోత్ కన్నన్, దివాకర్ ప్రతాపుల మరియు ఇతర చాప్టర్ సభ్యులు తదితరులు కీలక పాత్ర పోషించారు. 

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కే బలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీలాతో పాటు నాట్స్ బోర్డు మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బోపన్నలు వాలంటీర్లకు విలువైన సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక బాధ్యతను పెంచే అడాప్ట్ ఏ హైవే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: సివిల్ సర్వీసెస్ వ్రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement