
ఇదే చివరి రోజు అనుకో!
‘‘జీవితం చాలా చిన్నది. ఎప్పటి దాకా ఉంటామో గ్యారెంటీ లేదు. చిన్న వయసులోనే ఇంత వేదాంతం చెబుతోందేంటని అనుకోకండి. దీనికి వయసు అవసరం లేదు. నాకు ఎదురైన అనుభవాలే పాఠాలు. అందుకే చెబుతున్నా... మన జీవితంలో ప్రతి రోజునూ ఇదే ఆఖరి రోజు అనుకోవాలి. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో చేయాలి. చేసిన తప్పులను తలుచుకుని కుమిలిపోతే లాభం లేదు. మనల్ని మనం క్షమించుకుంటేనే జీవితంలో ముందుకు సాగి విజయాలను సాధించగలం. కాకపోతే, మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి.’’
- నర్గీస్ ఫక్రీ