Director Krish: Clarifies About Cast Change In Pawan Kalyan Movie - Sakshi
Sakshi News home page

Pawan Kalyan Movie: పవర్‌ స్టార్‌ సినిమా నుంచి జాక్వెలిన్‌ ఔట్‌.. హాట్‌ బ్యూటీకి ఛాన్స్‌ !

Published Thu, Dec 16 2021 5:05 PM | Last Updated on Thu, Dec 16 2021 9:01 PM

Director Krish Clarifies About Cast Change In Pawan Kalyan Movie - Sakshi

Director Krish Clarifies About Cast Change In Pawan Kalyan Movie: పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్రకు మొదటగా శ్రీలంక ముద్దుగుమ్మ, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జాక్వలెన్ సమస్యల్లో చిక్కుకుంది. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకే జాక్వెలిన్‌ను పవన్‌ సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఈ పుకార్లపై దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. 'డేట్స్‌ ఇష్యూ వల్లే జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మా సినిమా చేయలేకపోయింది. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం ఆమెకు కష్టమైంది. అందుకే గతేడాదే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. జాక్వెలిన్‌ స్థానంలో మేం నర్గిస్‌ ఫక్రిని ఎంపిక చేశాం. జాక్వెలిన్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు.' అని క్రిష్‌ తెలిపారు. 

పవన్‌ నటిస్తున్న హరి హర వీర మల్లు చిత‍్రంలో మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్‌ ఫక్రి కనిపించనుంది. ఆమె లుక్‌ చాలా అందంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఇందులో పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏఎమ్‌ రత్నం సినిమాను నిర్మిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement