karan
-
తండ్రి స్థానంలోకి కొడుకు.. అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు
అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కరణ్ అదానీని నియమించింది. ఇక ఆయన తండ్రి గౌతమ్ అదానీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు. దేశంలో అతిపెద్ద పోర్ట్స్, లాజిస్టిక్స్ కంపెనీ అయిన ఏపీఎస్ఈజెడ్ తమ సీఈవో కరణ్ అదానీని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. కాగా ఈ పదవిని ఇప్పటిదాకా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిర్వహిస్తున్నారు. మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిస్సాన్ మోటార్స్‌లో మాజీ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా నియామకానికి కూడా తమ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తెలిపింది. కరణ్ అదానీ 2009లో ముంద్రా పోర్ట్‌లో తన తండ్రి వ్యాపార సమ్మేళనంలో చేరారు. 2016లో దాని సీఈవోగా ఎదిగారు. మరొక పరిణామంలో ఏపీఎస్ఈజెడ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను విక్రయించడం ద్వారా 600.6 మిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్నట్లు తెలిపింది. అయితే వసూళ్లను ఎలా వినియోగించుకుంటారో కంపెనీ పేర్కొనలేదు. -
మహిళపై అఘాయిత్యానికి నేపాల్ యువకుల యత్నం
కందుకూరు: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు అఘాయిత్యానికి విఫలయత్నం చేశారు. దిశ యాప్‌లో వచ్చి న ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నేపాల్‌కు చెందిన యువకులు కాగా, మరొకరు పట్టణానికి చెందిన యువకుడు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చింది. అయితే ఆలస్యం కావడంతో రాత్రి 11 గంటల వరకు పట్టణంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సు కోసం పామూరు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలోని గూర్ఖాలుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన యువకులు కరణ్, జ్యోషిలతో పాటు, పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఫిరోజ్ ముగ్గురూ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మాచవరం వైపు తీసుకెళుతున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. దీంతో పెట్రోల్ బంకులో పనిచేసే యువకుడు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు రక్షణ కల్పించి యువకుల కోసం గాలించారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఆటో ఆధారంగా బుధవారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం
Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఎలైట్ గ్రూప్ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కడు తప్ప.. అంతా సింగిల్ డిజిట్ స్కోర్లే! ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్ ఓపెనర్ జ్ఞానేశ్వర్ 72, కెప్టెన్ హనుమ విహారి 33, రికీ భుయ్ 116, శ్రీకర్ భరత్ 89 పరుగులు సాధించగా.. కరణ్ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. చెలరేగిన శశికాంత్ చందన్ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్ కేవీ శశికాంత్ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్ మూడు, నితీశ్ రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు ఆంధ్ర- 135 & 462 హైదరాబాద్- 197 & 246 చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
సీఈవో కావడం గొప్ప కాదు.. ప్రధానమంత్రి కావాలి!
రిషి సునాక్ యూకే ప్రధాని కావడం పట్ల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! కావాల్సింది ప్రణాళిక నేను గతంలో 90 శాతం మంది భారతీయులు మూర్ఖులు అన్నాను. రిషి సునాక్ యూకే ప్రధాని కావడాన్ని పండుగ చేసుకోవడం చూస్తుంటే అది నిరూపితమవుతోంది. యూకే ప్రధాని మూలాలు బ్రిటిష్, ఇండియన్, చైనీస్ – ఏవైతే ఏంటి... మాంద్యంలో ఉన్న బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను ఒడ్డున పడేయడానికి ఆయన దగ్గర ఏం ప్రణాళిక ఉందన్నది ముఖ్యం? – మార్కండేయ ఖట్జూ, మాజీ న్యాయమూర్తి రేసు మారిపోయింది సారీ ఇండియన్ – అమెరికన్స్! సీఈవో కావడం ఇప్పుడు గొప్పేమీ కాదు. పూర్వ వలసవాద దేశానికి ప్రధానమంత్రి కాగలగాలి. ఇప్పుడిదే కొత్త ప్రమాణం. – కరణ్ తలాటి, ఆంట్రప్రెన్యూర్ ఏం చేయరా? అధికారంలో ఉన్న స్మృతీ ఇరానీ మహిళల కోసం ఏం చేసిందో, రిషి సునాక్ ఇండియన్స్ కోసం అంతే చేస్తాడు. – అదితీ మిత్తల్, కమెడియన్ మీ శిబిరం కాదనా? చరిత్రలో ఇటలీకి మొదటిసారి ఒక మహిళ (జార్జియా మెలోనీ) ప్రధాని అయ్యారు. ఆమె రోమ్ శివార్లలో పెరిగారు. శ్రామిక కుటుంబానికి చెందిన, తండ్రిలేని ఈమె యూనివర్సిటీకి వెళ్లి చదువుకోలేదు. వెయిట్రెస్‌గా రాత్రి షిఫ్టుల్లో పనిచేశారు. కానీ ఆమె ఊసే ఎక్కడా లేదు. ఆమె గనుక ప్రగతిశీలవాది అయివుంటే మీడియా ఆమె గురించి హోరెత్తించి ఉండేది. – అలెజాండ్రా బెక్కో, ఇటలీ జర్నలిస్ట్ -
అదానీ కీలక నిర్ణయం: కరణ్ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు
న్యూఢిల్లీ: స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఆవిర్భవించింది. కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్ డాలర్లకు హోల్సిమ్ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ టేకోవర్ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు) గౌతమ్ అదానీ అధ్యక్షతన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్ ఇండియా మాజీ హెడ్ నితిన్ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్ బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ఇదీ చదవండి: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్ -
బైపోలార్ డిజార్డర్ ఉంది కానీ సైకోని కాదు : నటి
పాపులర్ హిందీ సిరీయల్ ‘యే రిష్కా క్యా కెహ్లతా హై’నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తను గోడకేసి కొట్టాడని భార్య నిషా రావల్ ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అతడిని సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇక జూన్ 1న బెయిల్ మీద బయటకు వచ్చిన కరణ్ మెహ్రా భార్యపై పలు ఆరోపణలు చేశాడు. ఆమె బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని, ఆమె తలను ఆమే గోడ గోడకేసి కొట్టుకొని తన పేరు చెబుతోందని ఆరోపించాడు. తాజాగా భర్త ఆరోపణలపై నిషా రావల్ స్పందించారు. తాను బైపోలార్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతన్న మాట నిజమేనని, కానీ తాను మాత్రం సైకో కాదని పేర్కొన్నారు. ‘బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మానసిక రుగ్మత, ఇది తీవ్రమైన గాయం కారణంగా జరుగుతుంది. కొన్ని సార్లు జన్యు లోపం వల్ల కూడా జరగవచ్చు. ఈ వ్యాధి బారిన పడటం పట్ల నేను సిగ్గుపడడం లేదు. నాకు ఆ జబ్బు లేదని అబద్ధం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక మానసిక రుగ్మత మాత్రమే. కానీ నేను సైకోని మాత్రం కాను. నేను ఎంత సమతుల్యతతో ఉన్నానో అందరికి తెలుసు. నేను వెబ్ కంటెంట్‌ని రాయగల్గుతున్నాను. వీడియోలు చేస్తాను. నా మానసిక స్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు’అని నిషా రావల్ మీడియాకు తెలిపారు. కాగా నిషా రావల్ పాపులర్ నటి కమ్ మోడల్. ఈమె కోకా కోలా, సన్ సిల్క్ షాంపూలతోపాటు పలు టీవీ యాడ్స్ లో కనిపించారు. అంతేకాదు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించారు. చాలా కాలం డేటింగ్ అనంతరం 2012 లో కరణ్-నిషాలు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. చదవండి: నా భార్యే తలను గోడకేసి కొట్టుకుంది: టీవీ నటుడు భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్ -
భార్యను కొట్టలేదు, ఆవిడే నా మీద ఉమ్మేసింది: నటుడు
టీవీ నటుడు కరణ్ మెహ్రా గురించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు అనేక టీవీ షోలలోనూ పాల్గొన్నాడు. ఈ క్రమంలో తను ప్రేమించిన నిషాను 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ 'నాచ్ బలియే సీజన్ 5'లోనూ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే కరణ్ దంపతులు ఇప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు. తనను గోడకేసి కొట్టాడని భార్య ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన కరణ్ మెహ్రా భిన్న వాదన వినిపిస్తున్నాడు. అసలు తన భార్య మీద చేయి చేసుకోలేదని చెప్తున్నాడు. "నేను మా అమ్మతో ఫోన్‌కాల్ మాట్లాడుతున్నా.. ఇంతలో నా భార్య నిషా అరుచుకుంటూ వచ్చి నన్ను, నా తల్లిదండ్రులను, ఆఖరికి నా సోదరుడిని కూడా తిట్టడం ప్రారంభించింది. గట్టి గట్టిగా అరుస్తూ నానా రభస చేసింది" "అంతే కాదు ఆమె వచ్చి నా ముఖం మీద ఉమ్మేసింది. దీంతో కోపంతో ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపో అన్నా. అందుకు ఆమె ఇప్పుడేం చేస్తానో చూడు అంటూ తన తలను గోడకు బాదుకుంది. పైగా నేనే ఆమెను గోడకేసి కొట్టానని అందరికీ చెప్తోంది. ఆమె సోదరుడు కూడా నన్ను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు" అని కరణ్ తెలిపాడు. అటు నిషా మాత్రం తన భర్త కరణ్ తన తలను గోడకేసి కొట్టి హింసించాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మరి వీరిద్దరి ఆరోపణల్లో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. చదవండి: బుల్లితెర నటుడు కరణ్ అరెస్ట్.. ఆ వెంటనే బెయిల్ 4 వారాలు..4 సినిమాలు..కట్టిపడేసే కంటెంట్‌తో ‘ఆహా’ రెడీ -
ఆసియా సీనియర్ రెజ్లింగ్: భారత్‌కు ఐదు పతకాలు
అల్మాటీ (కజకిస్తాన్): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) తన టైటిల్‌ను నిలబెట్టుకోగా... బజరంగ్ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన రవి కుమార్ ఆసియా చాంపియన్‌షిప్‌లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్ ఫైనల్లో 9–2తో సఫరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బజరంగ్‌కు గాయం ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్ రెజ్లర్ టకుటో ఒటుగురోతో ఫైనల్ తలపడాల్సిన బజరంగ్ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్‌కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 3–0తో జియోంగ్ యోంగ్‌సియోక్ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్‌గున్ సర్‌మన్‌డక్ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో కరణ్ 3–1తో సీంగ్‌బోంగ్ లీ (కొరియా)పై, నర్సింగ్ యాదవ్ 8–2తో అహ్మద్ మోసిన్ (ఇరాక్)పై, సత్యవర్త్ 5–2తో మిన్‌వన్ సియో (కొరియా)పై విజయం సాధించారు. -
ఘనంగా టీవీ సెలబ్రిటీల వివాహం
న్యూఢిల్లీ: టీవీ సెలబ్రిటీలు కరణ్ వీర్ మెహ్రా, నిధి సేత్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. న్యూఢిల్లీలోని గురుద్వారలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి రాలేకపోయిన బుల్లితెర సెలబ్రిటీల కోసం వధూవరూలిద్దరూ ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 24వ తేదీనే ఎందుకు ముహూర్తం పెట్టుకున్నారన్న విషయాన్ని కూడా నిధి సేత్ గతంలోనే మీడియాకు వెల్లడించారు. 'పెళ్లెప్పుడు? అనుకున్నప్పుడు కొన్ని డేట్స్ అనుకున్నాం. అందులో ఒకటి డిసెంబర్లో కూడా వచ్చింది. అయితే 2021 నుంచే కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాం. అలా ఆన్లైన్లో ఏ రోజు మంచిదా? అని వెతుకులాడితే జనవరి 24 బ్రహ్మాండంగా ఉందని తెలిసింది. అందుకే ఆ రోజు షూటింగ్‌కు బ్రేక్ చెప్పేశాను. ఎందుకంటే ఆ రోజే మా పెళ్లి జరగడం ఖాయం కాబట్టి!' అని పేర్కొంది. నిన్న మరో బాలీవుడ్ జంట వరుణ్ ధావన్- నటాషా దళాల్ కూడా ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. (చదవండి: ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘డీ కంపెనీ’ టీజర్ విడుదల) కాగా కరణ్ వీర్ మెహ్రా 2005లో 'రీమిక్స్' షోతో బుల్లితెరపై అడుగు పెట్టాడు. తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రాగిని ఎమ్ఎమ్ఎస్ 2, మేరే డాడ్‌కీ మారుతి, బ్లడ్ మనీ, బద్మాషీయాన్, ఆమెన్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 'పవిత్ర రిష్తా' సీరియల్లో నటనకుగానూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు దేవిక మెహ్రాను ఇదివరకే పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా 2009లో విడిపోయారు. తర్వాత తన సహనటి నిధి సేత్తో ప్రేమలో పడ్డ ఆయన ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక నిధి సేత్ శ్రీమద్ భగ్వత్ మహాపురాణ్, మేరే డాడ్ కీ దుల్హాన్ వంటి పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. (చదవండి: అమితాబ్ సెక్సిస్ట్ కమెంట్స్ దుమారం) View this post on Instagram A post shared by KaranVeerMehra (@karanveermehra) -
4 నెలల్లో 18 కిలోలు తగ్గింది: నటుడు
ముంబై: ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు తన తల్లి వీణా వాహి నాలుగు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించిందని నటుడు కరణ్ వాహి పేర్కొన్నాడు. 62 ఏళ్ల వయస్సులో 18 కిలోల బరువు తగ్గి.. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిందన్నాడు. తన సూచన మేరకు ఫిట్నెస్ విషయంలో తల్లి ప్రదర్శించిన అంకితభావాన్ని కొనియాడుతూ ఇన్‌స్టాలో ఆమె ఫొటోలు షేర్ చేశాడు. లాక్డౌన్ కాలంలోనూ ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించిన తీరు అద్భుతమని ప్రశంసలు కురిపించాడు.(నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఆయన: దీపికా) ఈ మేరకు.. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది అమ్మ. నా మాట విన్నందుకు ధన్యవాదాలు. మా అమ్మకు ఇప్పుడు 62 ఏళ్లు. తను హైపోథైరాయిడ్. అయినప్పటికీ పట్టుదల వీడలేదు. నాలుగు నెలల్లో 18 కిలోలు తగ్గింది. లాక్‌డౌన్‌లోనూ మా అమ్మ ఎంతో ధైర్యంగా నిలబడింది. వయసు కేవలం సంఖ్యను మాత్రమే సూచిస్తుందని మరోసారి నిరూపితమైంది. దీనికంతటికి కారణమైన తహీరాకొచ్చర్కు కృతజ్ఞతలు. ఇతరులను ప్రభావితం చేయడం కాదు.. వారిలో స్ఫూర్తి నింపడం గొప్ప విషయం. లవ్ యూ అమ్మా’’ అని కరణ్ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు సింగర్ విశాల్ దద్లానీ, గౌతం రోడే, మందిరా బేడీ, శరద్ ఖేల్కర్, శిబానీ దండేకర్ వీణా వాహిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.(పోల్ డ్యాన్స్‌ను చాలా మిస్సవుతున్నా..) View this post on Instagram So proud of my MOM @wahi.veena Thank you for listening to me and taking care of yourself before u took care of the world. My Mom is 62 and a hypothyroid But Iam glad I inspired her to do this for her 18 kgs in 4 months Lockdown ke bawajoood my MUMMA is the strongest... Thank you @tahirakochar for making this happen .. Age is just a number ,hence proved... INSPIRE People NOt Influence... #iloveyou Mom A post shared by Karan Wahi 💜 (@karanwahi) on May 5, 2020 at 6:31am PDT -
కరణ్వీర్ కౌశల్ డబుల్ సెంచరీ
నదియాడ్ (గుజరాత్): పాతికేళ్ల దేశవాళీ వన్డే టోర్నీ చరిత్రలో తొలి ద్విశతకం నమోదైంది. ఉత్తరాఖండ్ ఓపెనర్ కరణ్వీర్ కౌశల్ (135 బంతుల్లో 202; 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే వన్డే టోర్నీలో సిక్కింపై ఉత్తరాఖండ్ 199 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరణ్వీర్ అద్భుత ఇన్నింగ్స్‌తో గతంలో అజింక్య రహానే (187, 2007–08) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు తెరమరుగైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 366 పరుగుల భారీ స్కోరు చేసింది. కరణ్‌వీర్‌తో పాటు మరో ఓపెనర్ వినీత్ సక్సేనా (100; 4 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 296 పరుగులు జతచేశారు. భారత లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం మరో విశేషం. గతంలో ఈ రికార్డు ధావన్–ఆకాశ్ చోప్రా (277 పరుగుల, 2007–08) పేరిట ఉంది. అనంతరం సిక్కిం 50 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. -
సోషల్ మీడియా లవ్‌స్టోరీ
కరణ్, అమృత, నిషా, దివ్య, ప్రీతి ముఖ్య తారలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ గొంటి నిర్మించిన చిత్రం ‘బెస్ట్ లవర్స్’. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ పోస్టర్స్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలశ్రీనివాస యాదవ్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో సాగే అందమైన లవ్‌స్టోరీ ఇది. సినిమా బాగా వచ్చింది. ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సినిమా తీశాం. అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి ఫీల్ ఇచ్చే లవ్‌స్టోరీ చేశాం’’అన్నారు నిర్మాత. ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. శ్రీకరణ్ చక్కగా చేశాడు. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అట్లూరి రామకృష్ణ, సాయి వెంకట్, తదితరులు పాల్గొన్నారు. -
కారు డోర్ లాక్ పడి బాలుడు మృతి
పూణే : ఎండ వేడికి తట్టుకోలేక ఓ ఐదేళ్ల చిన్నారి పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లాడు. ఆ కారే ఆ పసివాడిని మింగేసింది. పోలీసుల వివరాల ప్రకారం కరణ్ పాండే (5) మధ్యాహ్నం పూట తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. వేడికి తట్టుకోలేక అక్కడే పార్కు చేసి ఉన్న కారు ఎక్కాడు. అది కాస్తా లాక్ అవడంతో కరణ్ లోపలే ఉండిపోయాడు. లోపల వేడి తట్టుకోలేక బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ కార్ లాక్ అవడం వల్ల బయటకు రాలేకపోయాడు. దీంతో కారు లోపల ఊపిరాడక మరణించాడు. అయితే ఎంతసేపయిన కరణ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. సుమారు ఆరు గంటలపాటు వెతికిన తరువాత కారులో కరణ్ మృతదేహాన్ని కనుగొన్నారు. కరణ్ తల, మెడ, ముఖం మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు కారు లోపలి వేడి వల్ల ఏర్పడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమాని వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
తెరపైకి హీరో వారసుడు!
ముంబై: బాలీవుడ్ లో మరో వారసుడు తెరంగ్రేటం చేయబోతున్నాడు. సీనియర్ నటుడు సన్నిడియోల్ తన కుమారుడు కరణ్ ను హీరోగా పరిచయం చేయాలని భావిన్నాడు. 30 ఏళ్ల క్రితం తనకు తొలి విజయాన్ని అందించిన 'బెతాబ్' సినిమాను కరణ్ తో రీమేక్ చేయాలని కోరుకుంటున్నాడు. మంచి కథ కోసం చాలా ఆగాడు. చివరకు 'బెతాబ్'కే ఫిక్సయినట్టు తెలుస్తోంది. అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్ కూతురు సారాను కరణ్ కు జోడిగా నటింపజేయాలని ప్రయత్నిస్తున్నాడు. తన తొలి సినిమాలో సన్నిడియోల్ మొదటి సినిమాలో అతడి సరసన అమృతా సింగ్ నటించింది. అయితే కరణ్-సారా జోడి కుదిరేట్టు లేదు. ఎందుకంటే ధర్మా ప్రొడక్షన్ లో మొదటి సినిమా చేసేందుకు సారా అంగీకరించింది. కరణ్ జోహర్ నిర్మించనున్న సినిమాతో ఆమె తెరంగ్రేటం చేయనుంది. దీంతో శ్రీదేవి కూతురు జాహ్నవిని సంప్రదించాలని సన్నిడియోల్ భావిస్తున్నాడట. -
కరణ్ చిత్రానికి కోర్టు బ్రేక్
చెన్నై: నటుడు కరణ్ చిత్రానికి మద్రాసు హైకోర్టు బ్రేక్ వేసింది. విలన్‌గా, హీరోగా పలు చిత్రాల్లో నటించిన కరణ్ కొంచెం గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం కన్నియుమ్ కళైయుమ్ సెమకాదల్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లో కెళితే...చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ గగన్ బోద్రా మద్రాసు హైకోర్టులో కన్నియుమ్ కాళైయుమ్ సెమకాదల్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ పిటిషన్ వేశారు. అందులో ఆయన కన్నియుమ్ కాళైయుమ్ సెమకాదల్ చిత్ర నెగటివ్, శాటిలైట్ హక్కులు, విదేశీ విడుదల హక్కులను చిత్ర దర్శక నిర్మాత వి.సి.వడావుడైయన్నుంచి తాను పొందినట్లు పేర్కొన్నారు. అందుకు గాను నిర్మాతకు రూ.40 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే ఇప్పుడాయన ఈ హక్కులను మరొకరికి విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తానీ విషయంలో నిర్మాతతో చర్చించ యత్నించినా నిర్మాత నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. అందువలన కన్నియుమ్ కాళైయుమ్ సెమకాదల్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసును మంగళవారం విచారించిన న్యాయమూర్తి ఎం.దురైస్వామి చిత్ర విడుదలపై తాత్కాలిక స్టే విధిస్తూ నిర్మాత వడివుడైయాన్కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. -
‘లా’ నుంచి ఇలా వచ్చాను!
‘వేదం’ సినిమా గుర్తుందా? అందులో మనోజ్‌కి ఓ రాక్ బ్యాండ్ ఉంటుంది. ఆ గ్రూపులో ఓ అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అందం పేరు సౌమ్యా సుకుమార్. ఇప్పుడామె ‘పోరా పోవే’ చిత్రం ద్వారా కథానాయికగా మారారు. కరణ్, సౌమ్య జంటగా లంకపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్ బింగమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సౌమ్యా సుకుమార్ మాట్లాడుతూ - ‘‘నేను తెలుగమ్మాయినే. చెన్నయ్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అద్దం ముందు నిలబడి యాక్ట్ చేసేదాన్ని. ‘లా’ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే ‘వేదం’లో అవకాశం వచ్చింది. వాస్తవానికి చాలామందిని ఆడిషన్స్ చేసినప్పటికీ, నా వంకీల జుత్తు వల్ల రాక్ బ్యాండ్‌లో అమ్మాయిగా నప్పుతానని నన్ను తీసుకున్నారు. ఇక, ‘పోరా పోవే’ కథానాయికగా నాకు మంచి లాంచింగ్ అవుతుందనిపిస్తోంది. ఇందులో నేను అల్లరి పిల్ల పాత్ర చేశాను. నా నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది’’ అని చెప్పారు. హీరోల్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టమని, హీరోయిన్స్‌లో ఐశ్వర్యా రాయ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘క్షణ క్షణం’లో శ్రీదేవి, ‘గీతాంజలి’లో గిరిజ, ‘బొమ్మరిల్లు’లో జెనీలియా చేసిన పాత్రలంటే ఇష్టమని, అలాంటివి చేయాలనుకుంటున్నానని సౌమ్య చెప్పారు. -
పోరా పోవే మూవీ పోస్టర్స్
-
పోరా పోవే మూవీ స్టిల్స్
-
ఇంటికి రక్షణ.. సకల సౌకర్యాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీరు ఇంటికి చేరుకునేలోపే సిద్ధంగా ఉండే వేడి వేడి వంటకాలు. గోరువెచ్చని నీళ్లు. చల్లని గదులు. ఇంటికి చేరుకోగానే వాహనాన్ని గుర్తుపట్టి తెరుచుకునే గేటు. లోనికి వెళ్లగానే వెలిగే లైట్లు. స్మార్ట్‌ఫోన్‌తో ఒక్క క్లిక్ చేస్తే చాలు. ఇలా కావాల్సిన సౌకర్యాలు సిద్ధం. ఏంటి ఇదేదో అద్భుతమనుకోకండి. మీకు కావాలంటే అచ్చం ఈ సౌకర్యాలన్నీ పొందవచ్చు. ఇందుకు సాధారణ విల్లాకు రూ.2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరిన్ని సౌకర్యాలు కావాలంటే అదనంగా వెచ్చించాల్సిందే. మరో విషయమేమంటే విలాసవంతమైన సౌకర్యాలతోపాటు ఇంటికి భద్రత కూడా ఉంటుంది. జీ-వేవ్ అనే కంపెనీ భారత్‌తోసహా 60 దేశాల్లో ఇటువంటి యాంత్రికీకరణ (ఆటోమేషన్) సేవలను అందిస్తోంది. జీ-వేవ్ ఇండియా 600 రకాల సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.20 లక్షలు వెచ్చించి.. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, పీసీ చేతిలో ఉంటే చాలు. మైక్రోవేవ్ ఓవెన్, గీజర్, ఏసీ ఇలా ఏదైనా సరే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. లైట్ల వెలుగును నియంత్రించవచ్చు. ఇంట్లోకి ఏ సమయంలో ఎవరెవరు వస్తున్నారు, వెళ్తున్నారు తెలుసుకోవచ్చు. ఇంట్లో ఎటువంటి సందడి లేకపోయినా అప్రమత్తం చేసే వ్యవస్థ కూడా ఉందని జీ-వేవ్ టెక్నికల్ లీడ్ కె.కరణ్ బుధవారమిక్కడ తెలిపారు. పాత ఇంటికి యాంత్రికీకరణకు ఎటువంటి మార్పు లు చేయనవసరం లేదని అన్నారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన ఒకరు రూ.20 లక్షలు వెచ్చింది ఇంటికి విలాసవంతమైన భద్రత కల్పించారట. మొక్కలకు నీరుపోయడం మొదలు అక్వేరియంలో చేపలకు ఆహారం వేయడం వంటి యాంత్రికీకరణ సేవలను ఆయన పూర్తి స్థాయిలో అమర్చుకున్నారట. పర్యవేక్షణ మాదే.. వ్యవసాయ క్షేత్రం, ఇల్లు, కార్యాలయం.. స్థలం ఏదైనా, ఎక్కడున్నా భద్రత పర్యవేక్షిస్తామని అంటోంది ప్రోవిజిల్ సర్వెలెన్స్ లిమిటెడ్. కంపెనీ అద్దె ప్రాతిపదికన కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. పర్యవేక్షణకు నెలకు కొంత చార్జీ చేస్తోంది. అనుమానిత వ్యక్తులు వస్తే అలారం మోగడంతోపాటు యజమానుల మొబైల్‌కు సందేశం పంపి అప్రమత్తం చేస్తారు. టెలికాం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో వీశాట్ ఆధారంగా కెమెరాలను కేంద్ర వ్యవస్థకు అనుసంధానిస్తున్నట్టు కంపెనీ సీవోవో మురళి రాచపూడి తెలిపారు. అమెరికా, యూకేలో ఇప్పటి వరకు 3 వేల కెమెరాలను ఏర్పాటు చేసి విజయవంతమయ్యామని చెప్పారు. ఇప్పుడు భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడాలో అడుగు పెట్టామని అన్నారు. హైదరాబాద్‌లో కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. భద్రత పర్యవేక్షణకు హైదరాబాద్, వైజాగ్‌లో 500 మంది సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉంటారు. రూ.4,300 కోట్లకు సెక్యూరిటీ పరిశ్రమ.. సెక్యూరిటీ టెక్నాలజీ, ఉత్పత్తుల మార్కెట్ దేశంలో సుమారు రూ.4,300 కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు ఏటా 30 శాతం నమోదవుతోందని యూబీఎం ఇండియా సెక్యూరిటీ విభాగం ఈడీ వర్గీస్ వి జోసెఫ్ తెలిపారు. పారిశ్రామికీకరణ, నగరాలకు వలసలు, తీవ్రవాదం తదితర అంశాల కారణంగా భద్రత ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. గృహాలకు, కార్పొరేట్ కంపెనీలకు భద్రత కల్పించే థర్డ్ పార్టీ సేవలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని అన్నారు. గ్రేటర్ నోయిడాలో డిసెంబరు 5-7 తేదీల్లో జరగనున్న ఐఎఫ్ఎస్ఈసీ-2013 ప్రదర్శన వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 దేశాలకు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లు అధునాతన సెక్యూరిటీ ఉపకరణాలను ప్రదర్శిస్తారని తెలిపారు. -
‘పోరా పోవే’ చిత్రం లోగో ఆవిష్కరణ
‘‘ఈ టైటిల్ వింటుంటే, కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. ఈ దర్శకుడు నా దగ్గర ‘పూలరంగడు’ చిత్రానికి రచయితగా చేశారు. క్యాచీ టైటిల్‌తో ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధిం చాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వీరభద్రమ్ చౌదరి. కరణ్, సౌమ్య సుకుమార్ జంటగా శ్రీనివాస్ బింగమల, యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘పోరా పోవే’. లంకపల్లి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం లోగోను వీరభద్రమ్, ప్రచార చిత్రాన్ని చంద్రబోస్ ఆవిష్కరించారు. యాజమాన్య మంచి స్వరాలిచ్చారని చంద్రబోస్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. ఈ సినిమాకి కథే హీరో అని కరణ్ తెలిపారు. ‘‘మూడు సినిమాలకు రచయితగా చేసిన అనుభవంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించాను. ప్రేమికుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో సరదాగా సాగే సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు.