‘లా’ నుంచి ఇలా వచ్చాను! | Pora Pove Releasing on 18th July | Sakshi
Sakshi News home page

‘లా’ నుంచి ఇలా వచ్చాను!

Jul 6 2014 10:44 PM | Updated on Sep 2 2017 9:54 AM

‘లా’ నుంచి ఇలా వచ్చాను!

‘లా’ నుంచి ఇలా వచ్చాను!

‘వేదం’ సినిమా గుర్తుందా? అందులో మనోజ్‌కి ఓ రాక్ బ్యాండ్ ఉంటుంది. ఆ గ్రూపులో ఓ అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అందం పేరు సౌమ్యా సుకుమార్. ఇప్పుడామె ‘పోరా పోవే’ చిత్రం ద్వారా కథానాయికగా మారారు. కరణ్, సౌమ్య జంటగా లంకపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్ బింగమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సౌమ్యా సుకుమార్ మాట్లాడుతూ - ‘‘నేను తెలుగమ్మాయినే. చెన్నయ్‌లో పెరిగాను.

 ‘వేదం’ సినిమా గుర్తుందా? అందులో మనోజ్‌కి ఓ రాక్ బ్యాండ్ ఉంటుంది. ఆ గ్రూపులో ఓ అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అందం పేరు సౌమ్యా సుకుమార్. ఇప్పుడామె ‘పోరా పోవే’ చిత్రం ద్వారా కథానాయికగా మారారు. కరణ్, సౌమ్య జంటగా లంకపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్ బింగమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సౌమ్యా సుకుమార్ మాట్లాడుతూ - ‘‘నేను తెలుగమ్మాయినే. చెన్నయ్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అద్దం ముందు నిలబడి యాక్ట్ చేసేదాన్ని. ‘లా’ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను.
 
 అప్పుడే ‘వేదం’లో అవకాశం వచ్చింది. వాస్తవానికి చాలామందిని ఆడిషన్స్ చేసినప్పటికీ, నా వంకీల జుత్తు వల్ల రాక్ బ్యాండ్‌లో అమ్మాయిగా నప్పుతానని నన్ను తీసుకున్నారు. ఇక, ‘పోరా పోవే’ కథానాయికగా నాకు మంచి లాంచింగ్ అవుతుందనిపిస్తోంది. ఇందులో నేను అల్లరి పిల్ల పాత్ర చేశాను. నా నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది’’ అని చెప్పారు. హీరోల్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టమని, హీరోయిన్స్‌లో ఐశ్వర్యా రాయ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘క్షణ క్షణం’లో శ్రీదేవి, ‘గీతాంజలి’లో గిరిజ, ‘బొమ్మరిల్లు’లో జెనీలియా చేసిన పాత్రలంటే ఇష్టమని, అలాంటివి చేయాలనుకుంటున్నానని సౌమ్య చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement