pora pove
-
పోరా పోవే మూవీ ప్లాటీనమ్
-
‘లా’ నుంచి ఇలా వచ్చాను!
‘వేదం’ సినిమా గుర్తుందా? అందులో మనోజ్‌కి ఓ రాక్ బ్యాండ్ ఉంటుంది. ఆ గ్రూపులో ఓ అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అందం పేరు సౌమ్యా సుకుమార్. ఇప్పుడామె ‘పోరా పోవే’ చిత్రం ద్వారా కథానాయికగా మారారు. కరణ్, సౌమ్య జంటగా లంకపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్ బింగమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సౌమ్యా సుకుమార్ మాట్లాడుతూ - ‘‘నేను తెలుగమ్మాయినే. చెన్నయ్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అద్దం ముందు నిలబడి యాక్ట్ చేసేదాన్ని. ‘లా’ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే ‘వేదం’లో అవకాశం వచ్చింది. వాస్తవానికి చాలామందిని ఆడిషన్స్ చేసినప్పటికీ, నా వంకీల జుత్తు వల్ల రాక్ బ్యాండ్‌లో అమ్మాయిగా నప్పుతానని నన్ను తీసుకున్నారు. ఇక, ‘పోరా పోవే’ కథానాయికగా నాకు మంచి లాంచింగ్ అవుతుందనిపిస్తోంది. ఇందులో నేను అల్లరి పిల్ల పాత్ర చేశాను. నా నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది’’ అని చెప్పారు. హీరోల్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టమని, హీరోయిన్స్‌లో ఐశ్వర్యా రాయ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘క్షణ క్షణం’లో శ్రీదేవి, ‘గీతాంజలి’లో గిరిజ, ‘బొమ్మరిల్లు’లో జెనీలియా చేసిన పాత్రలంటే ఇష్టమని, అలాంటివి చేయాలనుకుంటున్నానని సౌమ్య చెప్పారు. -
పోరా పోవే మూవీ పోస్టర్స్
-
‘పోరా పోవే’ చిత్రం లోగో ఆవిష్కరణ
‘‘ఈ టైటిల్ వింటుంటే, కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. ఈ దర్శకుడు నా దగ్గర ‘పూలరంగడు’ చిత్రానికి రచయితగా చేశారు. క్యాచీ టైటిల్‌తో ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధిం చాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వీరభద్రమ్ చౌదరి. కరణ్, సౌమ్య సుకుమార్ జంటగా శ్రీనివాస్ బింగమల, యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘పోరా పోవే’. లంకపల్లి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం లోగోను వీరభద్రమ్, ప్రచార చిత్రాన్ని చంద్రబోస్ ఆవిష్కరించారు. యాజమాన్య మంచి స్వరాలిచ్చారని చంద్రబోస్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. ఈ సినిమాకి కథే హీరో అని కరణ్ తెలిపారు. ‘‘మూడు సినిమాలకు రచయితగా చేసిన అనుభవంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించాను. ప్రేమికుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో సరదాగా సాగే సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు.