అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కరణ్ అదానీని నియమించింది. ఇక ఆయన తండ్రి గౌతమ్ అదానీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు.
దేశంలో అతిపెద్ద పోర్ట్స్, లాజిస్టిక్స్ కంపెనీ అయిన ఏపీఎస్‌ఈజెడ్ తమ సీఈవో కరణ్ అదానీని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. కాగా ఈ పదవిని ఇప్పటిదాకా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిర్వహిస్తున్నారు.
మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిస్సాన్ మోటార్స్‌లో మాజీ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా నియామకానికి కూడా తమ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తెలిపింది.
కరణ్ అదానీ 2009లో ముంద్రా పోర్ట్‌లో తన తండ్రి వ్యాపార సమ్మేళనంలో చేరారు. 2016లో దాని సీఈవోగా ఎదిగారు. మరొక పరిణామంలో ఏపీఎస్‌ఈజెడ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను విక్రయించడం ద్వారా 600.6 మిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్నట్లు తెలిపింది. అయితే వసూళ్లను ఎలా వినియోగించుకుంటారో కంపెనీ పేర్కొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment